psycopk Posted January 21, 2024 Author Report Posted January 21, 2024 3 hours ago, Android_Halwa said: Lokesham poleda ? Ledu anukunta.. rammohan naidu and cbn photos ee vachai Quote
psycopk Posted January 21, 2024 Author Report Posted January 21, 2024 Chiranjeevi: అయోధ్యకు బయల్దేరుతూ అభిమానులను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్ 21-01-2024 Sun 21:26 | Both States అయోధ్యలో రేపు రామ మందిరం ప్రారంభోత్సవం చిరంజీవి, రామ్ చరణ్ లకు ఆహ్వానాలు ఈ సాయంత్రం అయోధ్య పయనమైన చిరంజీవి, రామ్ చరణ్ అయోధ్యలో రేపు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ సాయంత్రం చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయల్దేరేముందు అభిమానులను కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ ప్రతిమను బహూకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు. అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. "ఆ అంజనాదేవి పుత్రుడు 'చిరంజీవి' హనుమంతుడు... భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం" అంటూ అభివర్ణించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.