psycopk Posted February 29, 2024 Report Posted February 29, 2024 Prathipati Sarath: ప్రత్తిపాటి శరత్ ఆచూకీ చెప్పాలంటూ డీసీపీ శ్రీనివాసరావును కలిసిన టీడీపీ నేతలు 29-02-2024 Thu 21:27 | Andhra ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శరత్ పై పన్ను ఎగవేత ఆరోపణలు పలు సెక్షన్ల కింద ఏడుగురిపై కేసు నమోదు టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు నేడు విజయవాడ డీసీపీ శ్రీనివాసరావును కలిశారు. ప్రత్తిపాటి శరత్ ఆచూకీ చెప్పాలని డీసీపీని కోరారు. టీడీపీ నేత పట్టాభిరామ్ మాట్లాడుతూ, శరత్ ను పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారని, శరత్ అలెక్సా కంపెనీలో అదనపు డైరెక్టర్ గా 3 నెలలే పనిచేశారని పట్టాభి వివరించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో జగన్ పెట్టిన కేసు అని ఆరోపించారు. కాగా, డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు శరత్ పై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి శరత్ సహా ఏడుగురిపై కేసు నమోదైంది. అందులో ఆయన భార్య, బావమరిది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయనపై ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Quote
psycopk Posted February 29, 2024 Author Report Posted February 29, 2024 Prathipati Sarath: ప్రత్తిపాటి శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా? తాడేపల్లి ముఠానా?: నారా లోకేశ్ 29-02-2024 Thu 21:59 | Andhra ప్రత్తిపాటి పుల్లారావు తనయుడిపై పన్ను ఎగవేత ఆరోపణలు విజయవాడలో నేడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ ప్రత్తిపాటి కుటుంబానికి అండగా ఉంటామన్న నారా లోకేశ్ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? అని ప్రశ్నించారు. శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. "ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో జగన్ పిరికిపంద చర్యలకు దిగుతున్నాడు: అచ్చెన్నాయుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేని జగన్ రెడ్డి పిరికి పంద చర్యలకు దిగుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. "రాష్ట్రంలో జగన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఐదేళ్ల నుంచి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని, ఏ కంపెనీలోనూ షేర్ హోల్డర్‌గా లేని ప్రత్తిపాటి శరత్‌ను అకారణంగా అరెస్ట్ చేశారు. ఓటమి భయంతో ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని అక్రమంగా అదుపులోకి తీసుకొని.. ఆచూకీ కూడా చెప్పకుండా వేధించడం జగన్ సైకో చర్యలకు నిదర్శనం! అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరి లెక్కలు తేలుస్తాం. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయం. 45 రోజులు ఆగలేక జగన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. Quote
psycopk Posted February 29, 2024 Author Report Posted February 29, 2024 Chandrababu: శరత్ ను వెంటనే విడుదల చేయాలి: చంద్రబాబు 29-02-2024 Thu 21:42 | Andhra పన్ను ఎగవేత కేసులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడి అరెస్ట్ ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపులు ఎక్కువయ్యాయన్న చంద్రబాబు శరత్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు చర్యలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగమే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని చంద్రబాబు వివరించారు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శరత్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్డీఆర్ఐ (Andhra Pradesh State Directorate of Revenue Intelligence) ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీఎస్డీఆర్ఐ ఎందుకు ఏర్పడింది, దాని అసలు లక్ష్యాలు ఏమిటి, మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్ని, ఎవరెవరిపై కేసులు పెట్టారు? అనే వివరాలను ప్రభుత్వం బయటపెట్టగలదా? అని చంద్రబాబు సవాల్ చేశారు. టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్టే... ఇప్పుడు ఏపీఎస్డీఆర్ఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని విమర్శించారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు అని మండిపడ్డారు. ఏపీఎస్డీఆర్ఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? అని చంద్రబాబు నిలదీశారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగం సభ్యులుగా పనిచేసే అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. Quote
Android_Halwa Posted February 29, 2024 Report Posted February 29, 2024 5 minutes ago, psycopk said: 9 minutes ago, psycopk said: డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు Caselu pettedi vunte jaggadiki duniya options vuntayi, poi poi DRI caselu ae pedtada ? Patipati gadi koduku pakka ga tax egottindu, anduke DRI case pettinaru and usuallu DRI cases with additional inputs from other offices like SFIO, IT, CBI, DRI, Commercial Taxes nundi inputs vunte ne DRI case pedtaru.. Gattigane dobbinattu vunnadu pratipati gadi koduku...Amaravati pasial anukunta. Quote
Ara_Tenkai Posted February 29, 2024 Report Posted February 29, 2024 Anna akkada surveylu janalani chustunte YCP gelichettu undi... Quote
ARYA Posted February 29, 2024 Report Posted February 29, 2024 32 minutes ago, psycopk said: Prathipati Sarath: ప్రత్తిపాటి శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా? తాడేపల్లి ముఠానా?: నారా లోకేశ్ 29-02-2024 Thu 21:59 | Andhra ప్రత్తిపాటి పుల్లారావు తనయుడిపై పన్ను ఎగవేత ఆరోపణలు విజయవాడలో నేడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ ప్రత్తిపాటి కుటుంబానికి అండగా ఉంటామన్న నారా లోకేశ్ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? అని ప్రశ్నించారు. శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. "ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో జగన్ పిరికిపంద చర్యలకు దిగుతున్నాడు: అచ్చెన్నాయుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేని జగన్ రెడ్డి పిరికి పంద చర్యలకు దిగుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. "రాష్ట్రంలో జగన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఐదేళ్ల నుంచి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు. వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేని, ఏ కంపెనీలోనూ షేర్ హోల్డర్‌గా లేని ప్రత్తిపాటి శరత్‌ను అకారణంగా అరెస్ట్ చేశారు. ఓటమి భయంతో ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడిని అక్రమంగా అదుపులోకి తీసుకొని.. ఆచూకీ కూడా చెప్పకుండా వేధించడం జగన్ సైకో చర్యలకు నిదర్శనం! అక్రమ కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరి లెక్కలు తేలుస్తాం. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్న జగన్ సర్కార్‌కు మరో 45 రోజుల్లో రాజకీయ సమాధి కట్టడం ఖాయం. 45 రోజులు ఆగలేక జగన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. Lion Lokesh is blazing all guns out...🔥🔥🔥 Quote
psycopk Posted February 29, 2024 Author Report Posted February 29, 2024 he is not even share holder or on the board of directors...psyco naa konde jaggadu.. mari labour yedava la tayaru aaiyadu Prathipati Pulla Rao: నా కుమారుడి అరెస్ట్ జగన్ రాజకీయ వికృత చర్యకు పరాకాష్ఠ: ప్రత్తిపాటి 29-02-2024 Thu 16:38 | Andhra జీఎస్టీ ఎగవేత కేసులో ప్రత్తిపాటి తనయుడు శరత్ అరెస్ట్ అక్రమ కేసులు పెట్టారన్న ప్రత్తిపాటి పుల్లారావు సీఎం జగన్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యలు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ ఎగవేత కేసులో నేడు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని, మనీలాండరింగ్ అంశాలు కూడా ఉన్నాయంటూ జీఎస్టీ విభాగం శరత్ పై అభియోగాలు మోపింది. జీఎస్టీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఏ కంపెనీలోనూ డైరెక్టర్ గా లేడని, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని స్పష్టం చేశారు. ఏ కంపెనీతో లావాదేవీలు లేని తన కుమారుడికి జీఎస్టీ ఎగవేతతో సంబంధం ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ఎన్నికల వేళ అక్కసుతో తమపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో తనపై పోటీకి వైసీపీకి దీటైన అభ్యర్థి దొరకడంలేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో ఎన్నికలకు ముందే తన గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజని వైఫల్యాలే వైసీపీ ఓటమికి బాటలు పరిచాయని అన్నారు. "జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ఠ ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు. నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని. కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డీ... గుర్తుపెట్టుకో... నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు సాగించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి. నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇటువంటి చేష్టలకు నీవు పూనుకుంటున్నావు" అంటూ ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.