Jump to content

Recommended Posts

Posted

Chandrababu: పవన్ కల్యాణ్ భరించలేక ఒకటే మాటన్నాడు: చంద్రబాబు 

02-03-2024 Sat 14:33 | Andhra
  • నెల్లూరులో  టీడీపీ సభ
  • హాజరైన చంద్రబాబు
  • టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం
  • జగన్ ను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు
 
Chandrababu supports Pawan Kalyan comments against CM Jagan

నెల్లూరు రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత అని చంద్రబాబు వివరించారు. 

ఇక, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణరెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా ఇలాగే వేధించాడని వెల్లడించారు. అహంభావంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

జగన్ పరిస్థితి నచ్చక సొంత పార్టీ వారే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని వెల్లడించారు. ఐదు కోట్ల ప్రజానీకం క్షేమం కోసం అందరూ ఆలోచించాలని అన్నారు. 

"చెల్లెలు షర్మిలకు అన్యాయం చేశాడు. పాపం, ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు. ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇప్పుడామె కూడా ఒక పార్టీలో చేరింది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైంది. అందుకే నేనేమీ మాట్లాడను. వాళ్ల అన్నపై ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తోంది. అయినా మేమేమీ బాధపడడంలేదు. సమాధానం చెప్పుకునే సమర్థత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. 

ఇక్కడో విషయం గమనించాలి. ఎన్నికల ముందు సొంత చెల్లెలితో పాదయాత్ర చేయించి, ఊరూరా తిప్పి ఎలా ఉపయోగించుకున్నాడో అందరూ చూశారు. బాత్రూంలో టిష్యూ పేపర్ ను విసిరేసినట్టు చెల్లెల్ని వదిలేశాడు. కుటుంబాల్లో తగాదాలు రావడం సహజమే. కానీ సోషల్ మీడియాలో ఆమె నీపై పోరాడుతోందని ఆమె పుట్టుకపై కూడా నీచంగా మాట్లాడావు. నీ సొంత చెల్లి పుట్టుకను దారుణంగా చిత్రీకరిస్తుంటే నీ కన్నతల్లికి అవమానం కాదా? కనీసం ఆ ప్రచారాన్ని ఖండించారా? 

మమ్మల్ని కూడా ఇలాగే తిడుతుంటారు. పవన్ కల్యాణ్ ను కూడా తిట్టారు. చివరికి పవన్ కల్యాణ్ భరించలేక మొన్న మీటింగ్ లో ఒకటే మాటన్నాడు. అవునయ్యా... నాకు ముగ్గురు పెళ్లాలు ఉన్నారు... నువ్వు నాలుగో  పెళ్లాంగా రమ్మన్నాడు. దాంతో ఏం చేయాలో అర్థంకాక వాళ్లు పీక్కుంటున్నారు... రాజకీయాల్లో కనీస విలువలు ఉండక్కర్లేదా? ఇంత దగాకోరు రాజకీయాలు చూస్తే చాలా బాధేస్తుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.

కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతుందా?

కందుకూరు సీటులో వైసీపీ అభ్యర్థిని ఇప్పటికి మూడు సార్లు మార్చారు. ఇప్పుడు ఇంకొకాయన (బుర్రా మధుసూదన్ యాదవ్) వచ్చాడు. ఆయన కూడా ఉంటాడో ఉండడో తెలియదు. కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతుందా? జీడీ నెల్లూరులో కూడా మూడు సార్లు మార్చేశారు. ఆయనైతే ఏకంగా డిప్యూటీ సీఎం... ఆయన సీటుకే దిక్కులేదు. మంగళగిరిలో కూడా మూడు సార్లు మార్చేశారు. ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు... మళ్లీ మార్చే అవకాశం ఉంది. 

వాళ్ల కార్యకర్తలు రోజూ తమ ఫొటోలతో ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. పాపం... సాయంత్రానికి ఆ ఫ్లెక్సీ తీసేసి మరో ఫ్లెక్సీ వేసుకోవాల్సి వస్తోంది. ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా అభ్యర్థులను మార్చేస్తుండడం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూశారా? 

వై నాట్ 175 అంట... వై నాట్ కుప్పం అంట!

జగన్ అంటున్నాడు... వై నాట్ 175... వై నాట్ కుప్పం అంట! 175 కాదు గుండు సున్నా అని మా చెల్లెమ్మలు చెబుతున్నారు. వై నాట్ పులివెందుల అని మా తమ్ముళ్లు అంటున్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. మోసం, దగా తప్ప మరేమీ తెలియని వ్యక్తి జగన్. 

జగన్ తానొక్కడినే రాజు అనుకుంటున్నాడు. సిద్ధం మీటింగ్ అంటాడు... ప్రజలు నవ్వుకుంటున్నా లెక్కచేయకుండా ముందుకు పోతుంటాడు. ఆయన మీటింగ్ పెడితే స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేయాల్సిందే. 5 జిల్లాల పరిధిలో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెట్టుకుంటే డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు కానీ, ఈయనకు మాత్రం ఆర్టీసీ వాళ్లు ఊడిగం చేస్తుంటారు... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. బస్సులు ఎందుకు ఇవ్వలేదో నువ్వు నాకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 40 రోజులే ఉంది... ఆ తర్వాత చెబుతా నీ కథ. 

 

Posted

BC Declaration: మంగళగిరిలో ఈ నెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు 

02-03-2024 Sat 16:53 | Andhra
  • మంగళగిరిలో జయహో బీసీ సభ
  • ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలన్న కొల్లు రవీంద్ర
  • ఇది బీసీలే రూపొందించుకున్న డిక్లరేషన్ అని వెల్లడి  
 
Chandrababu will announce BC Declaration on Mar 5 in Mangalagiri

మంగళగిరిలో మార్చి 5న మధ్యాహ్నం 3 గంటలకు జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జయహో సభ ద్వారా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ను ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బీసీ ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. 

బీసీల అభ్యున్నతి కోసం నిజంగా పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. బీసీలే తమ డిక్లరేషన్ ను రూపొందించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందని వెల్లడించారు. బీసీలకు అన్ని రకాలుగా మేలు చేకూర్చడమే టీడీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.

బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని తెలిపారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు.

Posted

Chandrababu: ఒకాయన బుల్లెట్ దిగిందా అంటుండేవాడు... రేపు ఆయనకు పల్నాడులో కరెక్టుగా దిగుతుంది బుల్లెట్: చంద్రబాబు 

02-03-2024 Sat 14:57 | Andhra
  • నెల్లూరులో టీడీపీ సభ
  • హాజరైన చంద్రబాబు
  • టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందన్న చంద్రబాబు
 
Chandrababu satires on YCP leaders in Nellore

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు సభలో మాట్లాడుతూ... ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు జగన్ తీరును భరించలేక టీడీపీలోకి వస్తున్నారని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని అన్నారు. వైసీపీ నాయకుడు అనే వాడు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. 

నాడు ఎగిరెగిరి పడ్డాడు!

ఇక్కడ నెల్లూరు నడి వీధిలో ఒక నాయకుడు మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా నిలవలేదు... కన్నుమిన్ను కానలేదు... మన ఖర్మ కొద్దీ ఆయన కూడా మంత్రి అయ్యాడు. కానీ, మొన్న బదిలీల్లో ఒక్క తన్ను  తంతే... ఒక్క జిల్లా కాదు మూడు జిల్లాల అవతలికి పోయి పడ్డాడు. బుల్లెట్ దిగిందా, లేదా అని ఒకప్పుడు డైలాగులు కొడుతుండేవాడు. ఇప్పుడు బుల్లెట్ కరెక్టుగా దిగింది. రేపు పల్నాడులో కూడా కరెక్టుగా బుల్లెట్ దిగుతుంది. ఈసారి తిరుగుటపాలో చెన్నైకి పోతాడు. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది... వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. 

విశాఖను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు తీసుకువచ్చారు!

ఇవాళ ఒకటి గమనించాలి. ఇక్కడ మీటింగ్ ఉందంటే, దీన్ని కౌంటర్ చేయడానికి, విశాఖపట్నంను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. అక్కడ మొత్తం ఊడ్చేశాడు... ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు... నెల్లూరుకు వస్తే మిగిలేది ఏదీ ఉండదు. ఇలాంటి నాయకులను తిరుగుటపాలో  పంపించేస్తారు మీరు... నాకు తెలుసు వీళ్ల తాట తీస్తారు మీరు.

Posted

Roop Kumar Yadav: "ఈయన అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్"... రూప్ కుమార్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన కోటంరెడ్డి 

02-03-2024 Sat 15:17 | Andhra
  • నెల్లూరులో టీడీపీ సభ
  • టీడీపీలోకి క్యూ కట్టిన నెల్లూరు వైసీపీ ముఖ్య నేతలు
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
  • రూప్ కుమార్ భుజం తట్టిన చంద్రబాబు
 
Kotamreddy introduced Roop Kumar to Chandrababu

ఇవాళ నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చాలామంది వైసీపీ నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 

ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా కప్పిన అనంతరం... ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి... ఈయన అనిల్ కుమార్ కు బాబాయ్ అంటూ రూప్ కుమార్ యాదవ్ ను చంద్రబాబుకు పరిచయం చేశారు. అవునా... అంటూ చంద్రబాబు రూప్ కుమార్ భుజం తట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెల్లూరు వైసీపీలో ఎప్పటినుంచో ఆధిపత్య పోరు ఉంది! నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ కు, ఆయన బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు మధ్య విభేదాలు పలు సందర్భాల్లో వెల్లడయ్యాయి. 

రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు అబ్దుల్ హాజీపై కొన్నాళ్ల కిందట దాడి జరిగింది. తాను రూప్ కుమార్ కు మద్దతు ఇస్తున్నందునే తనపై దాడి చేశారని హాజీ ఆరోపించాడు. 

గాయపడిన హాజీని పరామర్శించిన సమయంలో రూప్ కుమార్... అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. పైకి నీతులు చెప్పడం కాదు... నీ అనుచరులు ఏం చేస్తున్నారో చూసుకో అంటూ అబ్బాయిపై నిప్పులు చెరిగారు. 

నిన్ను ఎన్నికల్లో గెలిపించడానికి శత్రువులతో పోరాడాం... అలాంటిది ఇప్పుడు మాపైనే దాడులు చేయిస్తావా? అంటూ రూప్ కుమార్ నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Posted

Vemireddy Prabhakar Reddy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు 

02-03-2024 Sat 13:56 | Andhra
  • నెల్లూరులో రా కదలిరా సభ
  • నెల్లూరు నగరానికి విచ్చేసిన చంద్రబాబు
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులకు పసుపు కండువా కప్పిన టీడీపీ చీఫ్
 
Vemireddy Prabhakar Reddy joins TDP

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దాం అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబం చంద్రబాబును సత్కరించి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించింది. కాగా, వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరిగింది. 

చంద్రబాబు స్పందిస్తూ... రాజకీయాల్లో అజాతశత్రువు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి... ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు టీడీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

టీడీపీలో చేరిన సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... తన పరిధి మేరకు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. మరింత మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మీ అందరి మద్దతు నాకు అవసరం అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని స్పష్టం చేశారు.

Posted

Chandrababu: ఈ నెల 6 నుంచి చంద్రబాబు ప్రజాగళం సభలు.. షెడ్యూల్ ఇదిగో 

02-03-2024 Sat 10:52 | Andhra
  • ఈ నెల 4న ముగియనున్న 'రా కదలిరా' సభలు
  • ఆ తర్వాత ప్రజాగళం సభలతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం
  • 6న నంద్యాల, మైదుకూరులో సభలు
 
Chandrababu Praja Galam sabha from March 4

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాగళం పేరుతో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ప్రజాగళం షెడ్యూల్ ఖరారయింది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. 6న నంద్యాల, మైదుకూరు, 7న పామర్రు, వేమూరు, 8న పాడేరు, పలాస, 9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 4వ తేదీన రాప్తాడులో జరిగే 'రా కదలిరా' సభతో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సభలు పూర్తి కానున్నాయి. ఆ తర్వత ప్రజాగళం పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలను నిర్వహించనున్నారు.

Posted

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 

02-03-2024 Sat 10:06 | Andhra
  • హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన కృష్ణప్రసాద్
  • పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • మైలవరం టికెట్ కృష్ణప్రసాద్ కు కేటాయించే అవకాశం
 
Vasantha Krishna Prasad joins TDP

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు... టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Posted
11 minutes ago, CaptainMaverick said:

Outdated policies & politics!

Still… why jaggad loosing these guys… 

 

Posted

Lavu Sri Krishna Devarayalu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 

02-03-2024 Sat 19:14 | Andhra
  • గురజాల  నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు
 
Lavu Srikrishnadevarayalu joins TDP

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలోకి వచ్చారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. 

చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు. 

ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. ఈ ఐదేళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనే అని వెల్లడించారు. తాను ఏ వేదికపైనా ఎవరినీ అతిగా పొగిడింది లేదు, ఎవరినీ అనవసరంగా విమర్శించిందీ లేదని అన్నారు. ఇకపైనా పల్నాడు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండడం తెలిసిందే.

Posted

Chandrababu: ఇవాళ నేను హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభాలే జరిగాయి: చంద్రబాబు 

02-03-2024 Sat 19:39 | Andhra
  • దాచేపల్లిలో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
  • ఈ సభను చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుందన్న చంద్రబాబు
 
Chandrababu said he had all good things today

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రా కదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, దాచేపల్లిలో ఉరకలెత్తుతున్న ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుందని అన్నారు. యువత, మహిళలు ఏ వైపు ఉంటే ఆ వైపుదే గెలుపు... టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు... ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతాం అని స్పష్టం చేశారు. 

"ఇవాళ నేను హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభపరిణామాలే జరిగాయి. మొదట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. అక్కడ్నించి నెల్లూరు వెళితే సాక్షాత్తు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు.

ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు... స్వలాభం కోసం కాదు... నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. లావు శ్రీకృష్ణదేవరాయలును పార్టీలో చేర్చుకునే ముందే ఐవీఆర్ఎస్ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ సందేశం పంపాను. ఈయన మంచివాడా, చెడ్డవాడా... ఎలాంటి వాడు అని అడిగాను. మంచివాడు అని మీరందరూ నాకు బ్రహ్మాండంగా సమాధానం పంపారు. లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడే గెలిచాడు. 

వైసీపీలో సీటు దక్కాలంటే చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టాలి. తిడితేనే సీటు ఇస్తాం అని చెప్పేసరికి... నీ సీటు వద్దు, ఏమీ వద్దు అని వీళ్లు బయటికి వచ్చేశారు. మంచివాళ్లు వీళ్లందరూ. అందుకే నేను వీళ్లకు స్వాగతం పలికాను. అందుకే రా కదలిరా అని పిలుపునిచ్చాను" అని వివరించారు. 

లావు శ్రీకృష్ణదేవరాయలు వరికపూడిసెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చాడని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టుకు నిధులు  కేటాయించి, ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...