psycopk Posted March 5, 2024 Report Posted March 5, 2024 Kinjarapu Ram Mohan Naidu: 'జయహో బీసీ' సభలో రామ్మోహన్ నాయుడు పవర్ ఫుల్ స్పీచ్... వివరాలు ఇవిగో! 05-03-2024 Tue 18:04 | Andhra మంగళగిరి వద్ద జయహో బీసీ సభ బీసీలు కష్టపడితేనే దేశం ముందుకు పోతోందన్న రామ్మోహన్ నాయుడు జగన్ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని వెల్లడి బీసీలకు నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తామని హెచ్చరిక మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన జయహో బీసీ సభ ప్రారంభమైంది. టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి రోజు ఒక బీసీ సోదరుడు, సోదరీమణి కష్టపడితేనే ఈ దేశం ముందుకు నడుస్తుందని అన్నారు. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ... జుట్టు సరిచేయాలన్నా బీసీ... గుడి తలుపులు తెరవాలన్నా బీసీ... బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ... పొలం దున్నాలన్నా బీసీ... బలంతో బస్తా మోసే కళాసీ బీసీ... పంచభూతాలన్నింటి సాయంతో వృత్తులను ముందుకు నడుస్తున్నది బీసీలు అని వివరించారు. అలాంటి బీసీలం స్వాతంత్ర్యం వచ్చాక ఎంతోమందికి పల్లకీలు మోశాం... అలాంటి బీసీలను మొట్టమొదట పల్లకీ ఎక్కించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. "1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో తెలియదు, ఎక్కడ బీసీలు ఉంటున్నారో తెలియదు... అటువంటి వారిని వెదికి వెదికి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పంపించిన ఘనత టీడీపీది. ఈ రోజు రామ్మోహన్ నాయుడు ఒక బీసీగా రెండు పర్యాయాలు పార్లమెంటుకు వెళ్లాడంటే అందుకు మొట్టమొదటి పునాది కింజరాపు ఎర్రన్నాయుడు వద్ద పడింది... ఆ పునాది వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. బడుగు బలహీన వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తోంది. బీసీల కోసం చంద్రబాబునాయుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు విద్య పరంగా, ఉపాధి పరంగా కోట్ల రూపాయలతో అనేక పథకాలు తీసుకువచ్చారు. విదేశీ విద్య పథకం ద్వారా బీసీ కుటుంబాల వారు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఆ అవకాశం చంద్రబాబు కల్పించారు. సుమారు రూ.3,700 కోట్ల మేర బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి, మనం ఎవరైనా ఆర్థికంగా బలపడాలి అనుకుంటే ఆ అవకాశం చంద్రబాబు కల్పించారు. ఆదరణ, తదితర పథకాలతో బీసీలకు చేయూతనిచ్చింది చంద్రబాబే. కానీ, ఒక్క అవకాశం అంటూ 2019లో ఈ దుర్మార్గుడు జగన్ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఇవాళ బీసీలకు దేంట్లోనైనా న్యాయం జరుగుతోందా అనేది మనమందరం పరిశీలించుకోవాలి. రూ.74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారిమళ్లించిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. బీసీలకు ఉద్దేశించిన అనేక పథకాలను ఆపేశాడు. బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని బడాయి కొట్టుకుంటున్నాడు. కానీ, ఆ బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వద్దకు బీసీ సోదరులు వెళితే కప్పు టీ ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి! ఇలాంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి... ఇవ్వకపోతే ఏంటి? మన బీసీలం నమ్మితే ప్రాణం ఇస్తాం... అదే నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం అని రేపటి ఎన్నికల్లో మనం నిరూపించాలి. ఆ చైతన్యం కోసమే ఇవాళ జయహో బీసీ సభ నిర్వహిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి మళ్లీ మాయమాటలు చెబుతూ ముందుకొస్తున్నాడు... నా బీసీ అంటున్నాడు. ఆ మాట అనే అర్హత ఆయనకు ఉందా? పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ అయ్యే అవకాశం దక్కితే... లోక్ సభలో మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశారు. రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే విజయసాయిరెడ్డికి ఇచ్చారు. అదే అవకాశం టీడీపీకి వస్తే ప్యానల్ స్పీకర్ గా కాదు, ఏకంగా స్పీకర్ గానే దళితబిడ్డ బాలయోగిని కూర్చోబెట్టింది. అదీ టీడీపీ ఘనత. కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే నాడు ఎర్రన్నాయుడు గారిని కేంద్రమంత్రిగా చేసింది కూడా టీడీపీనే. బీసీలకు ఏం చేశాడని జగన్ నా బీసీ అని చెప్పుకుంటాడు?" అంటూ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. మళ్లీ రాష్ట్రం వైపు చూడకుండా జగన్ ను తరిమేయాల్సిన సమయం వచ్చింది: కాలవ శ్రీనివాసులు మంగళగిరి వద్ద జయహో బీసీ సభలో టీడీపీ సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు ప్రసంగించారు. సమాజంలో సగానికి పైగా బీసీలమే ఉన్నామని అన్నారు. బీసీ యువత భవిష్యత్తును జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రం వైపు చూడకుండా జగన్ ను తరిమేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 1 Quote
psycopk Posted March 5, 2024 Author Report Posted March 5, 2024 Nara Lokesh: చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా... మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్ 05-03-2024 Tue 19:13 | Andhra మంగళగిరిలో జయహో బీసీ సభ హాజరైన నారా లోకేశ్ బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శలు మంగళగిరిలో తాను 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని లోకేశ్ ధీమా బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా... బీసీ అంటే బలహీనవర్గం కాదు... బలమైన వర్గం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేశ్ ప్రసంగించారు. రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. "బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఇవాళ బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16 వేల మందికి పదవులు దూరం చేశాడు. ఇవాళ బీసీలకు చెందిన 8 వేల ఎకరాల అసైన్ మెంట్ భూములను వెనక్కి తీసుకున్నారు. ఆదరణ పథకం కూడా రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కోసం బీసీ సోదరులు 10 శాతం డబ్బు కడితే, ఆ డబ్బు నేడు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు... కానీ ఆ కార్పొరేషన్ల చైర్మన్లకు కుర్చీలు కానీ, టేబుళ్లు కానీ ఉన్నాయా? రూ.75 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు తప్పుదారి పట్టించారు. ఈ సైకో జగన్ జీవో నెం.217 తీసుకువచ్చి మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారు. ఆప్కాబ్ ను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 300 మంది బీసీలను చంపేశారు. 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. యనమల రామకృష్ణుడు పెళ్లికి వెళితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రుడిపై ఏకంగా రేప్ కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపైనా కేసులు పెట్టారు. నిన్న గాక మొన్న నంద్యాల టీడీపీ అధ్యక్షుడిగా రాజశేఖర్ ను నియమిస్తే, ఆ బీసీ నాయకుడిపై ఈ ప్రభుత్వం రౌడీషీట్ తెరిచింది. ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెబుతున్నా... మీరు పెట్టే ఎఫ్ఐఆర్ లను మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. రెండే రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి... జాగ్రత్త! 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు... రాష్ట్రంలో ఎక్కడ్నించి పోటీ చేస్తావని చంద్రబాబు నన్ను అడిగారు. రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి... గెలిపించి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబుతో చెప్పాను. ఆనాడు నన్ను మంగళగిరి పంపించారు. కేవలం 21 రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చాను. అప్పటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాను. కానీ, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 29 సంక్షేమ పథకాలు మంగళగిరిలో చేశాం. మీరు ముందుకు నడవండి మీకు అండగా మేముంటాం అని మంగళగిరి ప్రజలు కొండంత భరోసా ఇచ్చారు. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంగళగిరి ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నా. మొదటిది... కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు... మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత మనపై ఉంది చంద్రబాబు సర్. రెండోది... మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టించాల్సి ఉంది. మూడోది... పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు... మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు. పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నాలుగోది... అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ అన్నకు మాటిస్తున్నా... ఏ బాధ్యతతో అయితే నాకు మంగళగిరి సీటు ఇచ్చారో... అక్కడ గతంలో ఎంత తేడాతో ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి 53 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గి ఈ స్థానాన్ని మీకు అప్పగిస్తాను" అంటూ ప్రకటన చేశారు. 1 Quote
psycopk Posted March 5, 2024 Author Report Posted March 5, 2024 Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం 05-03-2024 Tue 18:52 | Andhra వైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి జయరాం మంగళగిరిలో జయహో బీసీ సభలో టీడీపీలో చేరిన వైనం జయరాంకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. Quote
psycopk Posted March 5, 2024 Author Report Posted March 5, 2024 Ganta Srinivasa Rao: రేపు మీరు గెలిచేది లేదు.. ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు జగన్: గంటా శ్రీనివాసరావు 05-03-2024 Tue 17:52 | Andhra 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖను 'సిటీ ఆఫ్ డేంజర్'గా మార్చేశారన్న గంటా ప్రశాంతంగా వుండే విశాఖను రాజధాని పేరిట రణరంగ క్షేత్రంగా మార్చారని విమర్శ ప్రజలు 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్స అంటున్నారని ఎద్దేవా విశాఖ నుంచి సీఏంగా ప్రమాణస్వీకారం చేస్తానని, ఇక్కడే ఉంటానని సీఏం జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) వేదికగా స్పందించారు. అదిగో వస్తా.. ఇదిగో వస్తానని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్లదీశారని అన్నారు. 'నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..' అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయిందని ఎద్దేవా చేశారు. 'మీరు రేపు గెలిచేది లేదు.. ప్రమాణస్వీకారానికి వచ్చేది లేదని' అంటూ గంటా జోస్యం చెప్పారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖను సీఏం జగన్.. 'సిటీ ఆఫ్ డేంజర్'గా మార్చేశారని దుయ్యబట్టారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖను రాజధాని పేరిట రణరంగ క్షేత్రంగా మార్చారని మండిపడ్డారు. అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇక మీరు రాకముందు వరకు విశాఖ నగరం అభివృద్ధిలో దూసుకెళ్ళిందని, మీరొచ్చాకే అభివృద్ధి కుంటుబడిందనేది జగమెరిగిన సత్యం అని గంటా పేర్కొన్నారు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి, ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరకొడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్' అంటూ స్వరం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరని, ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు కదా.. ఇక్కడి నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశారు. Quote
Sam480 Posted March 5, 2024 Report Posted March 5, 2024 5 minutes ago, psycopk said: Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం 05-03-2024 Tue 18:52 | Andhra వైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి జయరాం మంగళగిరిలో జయహో బీసీ సభలో టీడీపీలో చేరిన వైనం జయరాంకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. This guy will create more trouble than strength. he has lot of negativity, TDP should have not joined him 1 Quote
Mr Mirchi Posted March 5, 2024 Report Posted March 5, 2024 23 minutes ago, psycopk said: Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం 05-03-2024 Tue 18:52 | Andhra వైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి జయరాం మంగళగిరిలో జయహో బీసీ సభలో టీడీపీలో చేరిన వైనం జయరాంకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ... టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. ee rajakeeeeya rayakulu .....mari chendalam....right now vaadu minister...but giving below statement...emi manushuluraaaa meeru """బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు"""" jagan dhaggara vundi ninnati dhakaa "చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు."" 2 Quote
Vaaaampire Posted March 5, 2024 Report Posted March 5, 2024 24 minutes ago, Mr Mirchi said: ee rajakeeeeya rayakulu .....mari chendalam....right now vaadu minister...but giving below statement...emi manushuluraaaa meeru """బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు"""" jagan dhaggara vundi ninnati dhakaa "చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు."" Elections time lo ee jumpings, tongue twisting common ey kada. If anyone is really concerned about state while in ruling party, they would have resigned long back or turned rebel like rrr. Ee last min jumpings ni encourage cheyyadam valla nastam ey ekkuva labham kantey 1 Quote
JaiBalayyaaa Posted March 5, 2024 Report Posted March 5, 2024 1 hour ago, psycopk said: Ganta Srinivasa Rao: రేపు మీరు గెలిచేది లేదు.. ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు జగన్: గంటా శ్రీనివాసరావు 05-03-2024 Tue 17:52 | Andhra 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖను 'సిటీ ఆఫ్ డేంజర్'గా మార్చేశారన్న గంటా ప్రశాంతంగా వుండే విశాఖను రాజధాని పేరిట రణరంగ క్షేత్రంగా మార్చారని విమర్శ ప్రజలు 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్స అంటున్నారని ఎద్దేవా విశాఖ నుంచి సీఏంగా ప్రమాణస్వీకారం చేస్తానని, ఇక్కడే ఉంటానని సీఏం జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) వేదికగా స్పందించారు. అదిగో వస్తా.. ఇదిగో వస్తానని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్లదీశారని అన్నారు. 'నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..' అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయిందని ఎద్దేవా చేశారు. 'మీరు రేపు గెలిచేది లేదు.. ప్రమాణస్వీకారానికి వచ్చేది లేదని' అంటూ గంటా జోస్యం చెప్పారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖను సీఏం జగన్.. 'సిటీ ఆఫ్ డేంజర్'గా మార్చేశారని దుయ్యబట్టారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖను రాజధాని పేరిట రణరంగ క్షేత్రంగా మార్చారని మండిపడ్డారు. అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఇక మీరు రాకముందు వరకు విశాఖ నగరం అభివృద్ధిలో దూసుకెళ్ళిందని, మీరొచ్చాకే అభివృద్ధి కుంటుబడిందనేది జగమెరిగిన సత్యం అని గంటా పేర్కొన్నారు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి, ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరకొడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్' అంటూ స్వరం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరని, ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు కదా.. ఇక్కడి నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశారు. Veedu malli TDP loki ochaada, appatlo hiding lo unnadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.