Jump to content

ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి: చంద్రబాబు

psycopk

Recommended Posts

Chandrababu: ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి: చంద్రబాబు 

27-03-2024 Wed 14:19 | Andhra
  • ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
  • పలమనేరు సభలో వాడీవేడిగా ప్రసంగం
  • సీఎం జగన్ కూడా ఇవాళే ప్రచారం ఆరంభిస్తుండడం పట్ల చంద్రబాబు స్పందన
  • మా ప్రాంతానికి జగన్ రావడానికి వీల్లేదని ప్రజలు నినదించాలని పిలుపు
  • ప్రజలు గెలవాలంటే జగన్ దిగిపోవాలన్న టీడీపీ అధినేత 
 
Chandrababu has begun election campaign

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, సీఎం జగన్ కూడా ఇవాళ్టి నుంచే ప్రచారం చేస్తుండడంపై స్పందించారు. 

ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు... మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే... జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. 

తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని, గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ కాదా? అని మండిపడ్డారు. తాము గతంలో ఓసారి ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నామని, అప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, మైనారిటీల కోసం అనేక పథకాలు అమలు చేశామని వివరించారు. 

జగన్ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా?

టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులను 90 శాతం పూర్తి చేశామని, కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటికీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో జగన్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని, ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు జగన్ కు లేదని ఉద్ఘాటించారు. ఇప్పుడు సిద్ధం అంటూ వస్తున్నాడని, జగన్ ను ఇంటి దారి పట్టించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సమర సన్నద్ధత చాటారు.

25 ప్రాజెక్టులు రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీది!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఒక్క రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అందులోనూ హంద్రీనీవా కోసమే రూ.4,200 కోట్లు వ్యయం చేశామని వివరించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో నీటి ప్రాజెక్టుల కోసం కేవలం రూ.2,165 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. 

మే 13 కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు!

రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోవాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకే వారంతా ఎన్నికలు జరిగే తేదీ మే 13 కోసం ఎదురుచూస్తున్నారని చంద్రబాబు వివరించారు. మే 13 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజని అభివర్ణించారు. అరాచకపాలన, దోపిడీ, డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం... వీటన్నింటి నుంచి విముక్తి కలిగించే రోజు... మే 13 అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: జగన్ వెంట వైఎస్ ఘాట్ వద్దకు ఎవరు వచ్చారో చూశారా?: చంద్రబాబు 

27-03-2024 Wed 16:49 | Andhra
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ
  • బాబాయిని చంపిన వాళ్లను జగన్ వైఎస్ సమాధి వద్దకు తీసుకెళ్లాడన్న చంద్రబాబు
  • జగన్ కు సిగ్గుంటే ఆ పని చేస్తాడా అంటూ ఫైర్
  • జగన్ ప్రజల్లోకి వస్తే ఒక దోషిలా చూస్తారని వెల్లడి 
 
Chandrababu slams CM Jagan in Puthuru Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని, బోగస్ సర్వేలు చేయిస్తాడని, అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేయిస్తాడని అన్నారు. పేటీఎం కుక్కల్ని పెట్టుకుని మాపై దాడులు చేయిస్తుంటాడు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చెప్పడంలో దిట్ట అని పేర్కొన్నారు. 

జగన్ కు సిగ్గుందా?

జగన్ కు సిగ్గుంటే, తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళతాడా? అని ఘాటుగా విమర్శించారు. జగన్ తో పాటు ఇవాళ బస్సులో ఎవరున్నారు... అవినాశ్ రెడ్డి అని చంద్రబాబు వెల్లడించారు. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ అతడికి ఎంపీ టికెట్ ఇచ్చారు... ఎవరిపై అయినా ఆరోపణలు ఉంటే, అవి తేలాక టికెట్ ఇవ్వాలి కానీ, ఇలా మధ్యలోనే ఇస్తే ప్రజలను అవహేళన చేసినట్టే  లెక్క అని చంద్రబాబు వివరించారు. బాబాయినే చంపిన వారికి మీరూ, నేనూ ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. మొన్నటివరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని అన్నారు.

నువ్వు రాజకీయాలకు పనికి రావని చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

ముసుగు వీరుడు మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చాడు. జగన్ మోహన్ రెడ్డీ... ఇవాళ చెబుతున్నా... నీ యాత్రలకు ప్రజలు రారు. నిన్ను ఛీ కొడుతున్నారు. నువ్వు వచ్చినా నిన్ను ఒక దోషిలా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పే రోజు తొందర్లోనే ఉంది. నిన్నా మొన్నా ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారునంట. సేదలకు రూ.5కు అన్నం పెట్టే  అన్నా క్యాంటీన్లను రద్దు చేసినవాడు పేదల మనిషి అవుతాడా? తమిళనాడులో అన్నా క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్ రెడ్డీ... నేను పెట్టాను కాబట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశావు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలో అన్నీ పెడతా. 

జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు!

టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో, వాళ్లందరి కంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్లలో ప్రజల ఆదాయం తగ్గింది కానీ, జగన్ ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన జలగ ఈ జగన్. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా... మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాది. జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు... నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు వస్తుంది, నీ తాడేపల్లి ప్యాలెస్ ను ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు వస్తుంది... అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

NTR batikundagane “aa neechudu” ani tittadu CBN ni

ayina sare every meeting lo NTR photo ki danda vestadu CBN. 

Same to Same 😊

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...