psycopk Posted April 29, 2024 Report Posted April 29, 2024 Land Titiling: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చెయ్యం: ధర్మాన 29-04-2024 Mon 13:18 | Andhra న్యాయపరమైన క్లియరెన్స్ వచ్చాకే అమలుపై ఆలోచిస్తామని వెల్లడి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కొనసాగుతోందని వివరణ అత్యాధునిక టెక్నాలజీతో, పూర్తి అక్యూరసితో సర్వే జరుగుతోందన్న మంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయబోమని రెవెన్యూ, స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేస్తూ.. న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాకే రాష్ట్రంలో అమలుపై ఆలోచిస్తామని వివరించారు. ఈమేరకు సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మిగతా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో ఏపీలో కూడా అదేవిధంగా అమలుచేస్తామని, అదికూడా న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాకే అమలు చేస్తామని వివరించారు. వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూ సర్వే జరిగిందని, ఇప్పటి వరకూ మరే ప్రభుత్వం కూడా సర్వే చేపట్టలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే భూ సంస్కరణలు అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామలు ఉండగా.. అందులో 4 వేల రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని వివరించారు. లేటెస్ట్ టెక్నాలజీతో సర్వే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తిస్థాయిలో అక్యూరసీతో సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మిగతా 13 వేల గ్రామాల్లో సర్వే పనులు వివిధ దశలలో ఉన్నాయని, సర్వే మొత్తం పూర్తయ్యాక రాష్ట్రంలో ల్యాండ్ రికార్డులు అప్ డేట్ చేస్తామని తెలిపారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఆఫీసును ఏర్పాటు చేసి, పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తామని చెప్పారు. దీంతో గ్రామంలో కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఆధారంగా ఆటోమేటిక్ గా మ్యుటేషన్ పూర్తవుతుందని వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ఈ సందర్భంగా మంత్రి మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఒక్క మేలు కూడా చేయని వారు ఇప్పుడు జగన్ మంచి చేస్తుంటే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ చట్టంతో పేదల భూమిని జగన్ లాక్కుంటాడని ఆరోపించడం దుర్మార్గమని, ప్రతిపక్ష నేతల మాటలకు జనం నవ్వుకుంటున్నారని ధర్మాన చెప్పారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు న్యాయపరమైన క్లియరెన్స్ వచ్చాకే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని మంత్రి ధర్మాన వివరించారు. ఏమిటీ చట్టం..? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 2022 ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం, ఇల్లు, పొలం, గట్రా. ఇలా నమోదైన భూములపై వివాదం నెలకొంటే వీఆర్ వో నుంచి సివిల్ కోర్టుల దాకా ఎవరూ జోక్యం చేసుకునే వీలులేదు. సివిల్ కోర్టులో దావా వేసే వీలుండదు. వీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దే.. ఈ తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఇక నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందే. Quote
psycopk Posted April 29, 2024 Author Report Posted April 29, 2024 Devineni Uma: ప్రజల భూములు కొట్టేసేందుకు జగన్ కుట్రలు: దేవినేని ఉమా 29-04-2024 Mon 11:37 | Andhra వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై టీడీపీ నేత ధ్వజం రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడ్డాయని వ్యాఖ్య ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీ పెత్తనం ఏంటి? అంటూ దేవినేని ఉమా మండిపాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజల భూములు కొట్టేసేందుకు భూ హక్కు చట్టం పేరుతో జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా టైటిల్ పేరిట సర్కార్ వంచన చేస్తోందని విమర్శించారు. హక్కులను హరించడమే కాకుండా న్యాయం కోరే అవకాశం ఉండదన్నారు. ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీ పెత్తనం ఏంటి? అంటూ టీడీపీ నేత మండిపడ్డారు. భూభక్ష పథకంతో వైఎస్ జగన్.. సామాన్యుడిని సర్వం దోచేస్తాడంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. Quote
Android_Halwa Posted April 29, 2024 Report Posted April 29, 2024 land pooling scheme vunnaka ie bakasura scheme jujube... adigo capital anadam, andaru atu chudagane ituvaipudu lageyadam... hail development..! Quote
psycopk Posted April 30, 2024 Author Report Posted April 30, 2024 Credit vaste anna ki.. leka pote center ki https://www.instagram.com/reel/C6YWmYWJzUJ/?igsh=cWc0dHMzNnBtOGJo emi ra dharmana desaniki nevalla upayogam https://www.instagram.com/reel/C6ZDiilpgUD/?igsh=Mmk3bjRybXYxbHh2 Quote
psycopk Posted May 1, 2024 Author Report Posted May 1, 2024 Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివరణ ఇచ్చిన సీఎం జగన్ 01-05-2024 Wed 16:29 | Andhra అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ ఎన్నికల సభ విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం జగన్ భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ, చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ, భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు. "వందేళ్ల కిందట బ్రిటీష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు... భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం. భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును నవీకరించి, ఆ వివరాలతో రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే... చేతనైతే మద్దతు పలకాలి కానీ, దుష్ప్రచారం చేయడం తగదు" అని సీఎం జగన్ స్పష్టం చేశారు. Quote
psycopk Posted May 1, 2024 Author Report Posted May 1, 2024 Intaki dharmana ni nammala psyco jagan ni nammala?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.