ntr2ntr Posted November 7, 2024 Report Posted November 7, 2024 9 hours ago, psycopk said: Mee boss ee pedda lucha gadu G kinda multiple cases vunnay. Quote
appusri Posted November 8, 2024 Report Posted November 8, 2024 YS Sharmila: ‘వైఎస్‌కు పుట్టలేదని నన్ను అవమానించారు’ సామాజిక మాధ్యమాల్లో అరాచక పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా.. అంతుచూడాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా సైకోల అంతు చూడాల్సిందే ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ షర్మిల విజ్ఞప్తి ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో అరాచక పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా.. అంతుచూడాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తానూ సోషల్ సైకోల బాధితురాలినేనని, వైఎస్ రాజశేఖరరెడ్డికి తాను పుట్టలేదని పోస్ట్ పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిపేరు మార్చి అవమానించారని షర్మిల మండిపడ్డారు. తన తల్లి విజయమ్మ, సోదరి సునీతపైనా విచ్చలవిడిగా పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారని ఎక్స్ వేదికగా గురువారం ఆమె పేర్కొన్నారు. ‘నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్‌రెడ్డిపై నేనూ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టా. ఆ సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం. సైకో పార్టీలతో కలిసి కొంతమంది సామాజిక మాధ్యమాలను భ్రష్టుపట్టించారు. మానవ, రక్తసంబంధాలు మరచి మృగాల్లా మారారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టి పైశాచిక ఆనందం పొందే సైకోలపై చర్యలు కఠినంగా ఉండాలి. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్క, చెల్లి కూడా సాటి మహిళనే ఇంగితం లేకుండా అసభ్యకర పోస్ట్‌లతో ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న సైకోలను విడిచిపెట్టొద్దు’ అని ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి చేశారు. Quote
appusri Posted November 8, 2024 Report Posted November 8, 2024 YSRCP: వైకాపా సోషల్ మీడియా.. ఉన్మాదుల కర్మాగారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వేదికగా వైకాపా ఏకంగా ఓ సైబర్ టెర్రరిస్ట్‌ల ఫ్యాక్టరీని నడిపిస్తోంది. ఒకరో.. ఇద్దరో కాదు.. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ దాదాపు 50వేల మంది సైబర్ ఉగ్రవాదుల్ని తయారుచేసి నిత్యం రేచుకుక్కలు, రాబందుల మాదిరిగా వారిని ఉసిగొల్పుతోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు హైదరాబాద్, బెంగళూరు, విదేశాల్లో మార్ఫింగ్ చిత్రాలు, అసభ్య సందేశాల తయారీ వాట్సప్, ఎక్స్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో గ్రామాల వరకూ చేరవేత సైబర్ టెర్రరిస్ట్ గ్రూపులో 50వేల మందికి పైగా ఉన్మాదులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, వారి కుటుంబంలోని మహిళలే లక్ష్యంగా దారుణ పోస్టులు వాటిని వైరల్ చేసేందుకు వ్యవస్థీకృతంగా ఏర్పాట్లు మానసికంగా కుంగదీయడమే ప్రధాన లక్ష్యం వైకాపాను ప్రశ్నించేవారిపై రేచుకుక్కలు, రాబందుల్లా బూతులతో దాడి గంటల వ్యవధిలో లక్షల మందికి అసభ్య పోస్టులు నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్న ఏపీ పోలీసులు.. ఇప్పటికే వందల మందికి నోటీసులు ఈనాడు - అమరావతి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం వేదికగా వైకాపా ఏకంగా ఓ సైబర్ టెర్రరిస్ట్‌ల ఫ్యాక్టరీని నడిపిస్తోంది. ఒకరో.. ఇద్దరో కాదు.. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ దాదాపు 50వేల మంది సైబర్ ఉగ్రవాదుల్ని తయారుచేసి నిత్యం రేచుకుక్కలు, రాబందుల మాదిరిగా వారిని ఉసిగొల్పుతోంది. ఈ వైకాపా ఉగ్రవాదులకు తల్లి, చెల్లి, అక్క అనే ఉచ్ఛనీచాలుండవు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా.. వారి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, వారి పార్టీకి ఎదురు తిరిగితే చాలు అది షర్మిల అయినా, విజయమ్మ అయినా కూడా చూడకుండా అసభ్య పోస్టులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత సహా కూటమిలోని ముఖ్య నాయకులు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలే లక్ష్యంగా ఈ ఉన్మాదమూక సామాజిక మాధ్యమాల్లో అత్యంత దారుణమైన పోస్టులు, మార్ఫింగ్, ఎడిటింగ్ చిత్రాలు, వీడియోలు పెడుతున్నారు. వారిని మానసిక క్షోభకు గురిచేసేందుకు విస్తృతంగా దాడి చేస్తున్నారు. ఇదేదో కొద్దిమందో, ఎవరికి వారుగానో చేస్తున్న పని కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వ్యవస్థీకృతంగా, పక్కా నేరపూరిత కుట్రతో నడిపిస్తున్న, నడుస్తున్న వైకాపా సైబర్ ఉగ్రవాదుల దాడి ఇది. దీని మూలాలు తాడేపల్లిలో మొదలై హైదరాబాద్, బెంగళూరు, విదేశాల వరకూ వేళ్లూనుకుని ఉన్నాయి. వారు చేస్తున్న దాడి ప్రభావం నిత్యం లక్షల మందిపై ఉంటోంది. ఈ నెట్‌వర్క్ ఛేదనపై ఇప్పుడు ఏపీ పోలీసులు దృష్టిసారించారు. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించి వందల మందికి నోటీసులిచ్చారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో అసభ్య పోస్టుల తయారీ దశ-1: రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలేంటి? వాటి ఆధారంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరెవర్ని లక్ష్యంగా చేసుకోవాలి? వారికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు ఎలా తయారుచేయాలి? అత్యంత అసభ్య పదజాలాలు, బూతులతో పోస్టులు ఎలా తయారుచేయాలి? తదితర అంశాలపై తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆలోచనలు సిద్ధమవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జునరెడ్డి, హర్షారెడ్డి ఈ ఉగ్రవాద శిబిరానికి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దశ-2: గ్రాఫిక్ డిజైనింగ్, ఫొటోషాప్, కంటెంట్ తయారీ తదితర అంశాల్లో పట్టున్న కొందరిని ఎంపిక చేసుకుని వారికి సైబర్ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారు. వేతనమిస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బెంగళూరు, హైదరాబాద్, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో వీరిని పెట్టుకుని అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు, దారుణమైన మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు తయారు చేయిస్తున్నారు. ఇదంతా ఒక ఫ్యాక్టరీ మాదిరిగా పనిచేస్తుంది. సర్వర్లు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. దశ-3: ఆ సైబర్ టెర్రరిస్ట్‌ల ఫ్యాక్టరీలో తయారైన అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను వారు సజ్జల భార్గవరెడ్డి, అర్జునరెడ్డికి పంపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వైకాపాకు సంబంధించిన జాతీయ, రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, గ్రూపులను వీరిద్దరే నిర్వహిస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేయిస్తారు. వ్యవస్థీకృతంగా పనిచేసే సైబర్ ఉగ్రవాదులతో గ్రామస్థాయి వరకూ.. అత్యంత అసభ్యంగా, జుగుప్సాకరంగా తయారుచేసిన వీడియోలు, చిత్రాలు, అసభ్య పోస్టులను నిత్యం లక్షల మందికి చేరేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయిస్తున్నారు. దీనికోసం వ్యవస్థీకృతంగా పనిచేసే సైబర్ ఉగ్రవాదులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సైబర్ ఉగ్రవాద గ్రూపునకు ప్రతి జిల్లాకు ఓ కన్వీనర్ ఉన్నారు. ఆయనకు అనుబంధంగా ఇద్దరు ముగ్గురు కో కన్వీనర్లను పెట్టుకున్నారు. ఇంకా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక కన్వీనర్, ఐదారుగురు కో కన్వీనర్లు, మండలానికి ఒక కన్వీనర్, ఇద్దరు ముగ్గురు కో కన్వీనర్లను పెట్టుకున్నారు. వీరంతా వైకాపా సోషల్ మీడియా విభాగంగా చలామణి అవుతుంటారు. జిల్లా స్థాయిలో సైబర్ ఉగ్రవాద గ్రూపునకు నాయకత్వం వహించే కన్వీనర్.. జిల్లా కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులుగా 500-600 మందితో వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపులు ఏర్పాటుచేశారు. రాష్ట్రస్థాయి నుంచే వచ్చే అభ్యంతరకర, అసభ్య, దారుణ పోస్టులు, మార్ఫింగ్ వీడియోలను వీరు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తారు. ఎక్స్‌లోనూ పెడతారు. నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు వాటిని తమ పరిధిలోని మండల స్థాయి కన్వీనర్లు ఉన్న గ్రూపుల్లో రీ పోస్టు చేస్తారు. అక్కడి నుంచి అవి గ్రామాల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా పూర్తి వ్యవస్థీకృతంగా సాగుతోంది. గంటలు, నిమిషాల వ్యవధిలో ఈ దారుణ పోస్టులను వైరల్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్నే ఉదాహరణగా చూస్తే. ఇలాంటి వైకాపా సైబర్ ఉగ్రవాదులు 41 మంది ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అందరూ కలిపి 50 వేలపైనే ఉన్నారు. తల్లి, చెల్లి, అక్క అనే ఉచ్ఛనీచాలు లేకుండా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటు, వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని, ఆ పార్టీని విమర్శించే, ప్రశ్నించేవారు, వారి కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులను అత్యంత దారుణంగా చిత్రీకరించి వారిపై సామాజిక మాధ్యమాల్లో దాడిచేయడమే ఈ సైబర్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. జగన్ తప్పిదాలనుప్రశ్నించినందుకు చివరికి ఆయన సొంత చెల్లెళ్లైన వైఎస్ షర్మిల, సునీతపైనా నీచమైన దాడి కొనసాగించారు. షర్మిల అయితే అసలు రాజశేఖరరెడ్డికే పుట్టలేదంటూ పోస్టులు తయారుచేసి వైరల్ చేశారు. తల్లి, చెల్లి, అక్క అనే తేడా లేకుండా ఈ ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటారు. 1 Quote
idibezwada Posted November 8, 2024 Report Posted November 8, 2024 On 11/6/2024 at 11:30 AM, Mr Mirchi said: NO YCP GUY IN THIS THREAD? WHY? you hurted maa @Android_Halwa aniya.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.