psycopk Posted November 12, 2024 Report Posted November 12, 2024 Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం... లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు 12-11-2024 Tue 18:17 | Andhra నవంబరు 8న వర్రా, భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు భార్గవరెడ్డి విదేశాలకు పారిపోతాడన్న అనుమానం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం నేపథ్యంలో, ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి, జగన్ కు దగ్గరి బంధువు అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబరు 8వ తేదీన వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడైన సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డే కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే, అతడు తప్పించుకుని పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. Quote
psycopk Posted November 12, 2024 Report Posted November 12, 2024 Varra Ravindra Reddy: వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు 12-11-2024 Tue 17:13 | Andhra సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి వైసీసీ సోషల్ మీడియా గుట్టు బయటపెట్టిన వర్రా! ఆ ముగ్గురే కీలకమని రిమాండ్ రిపోర్టులో వెల్లడి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమా రెడ్డి కీలకమైన వ్యక్తులు అని వర్రా వెల్లడించాడు. మొదట్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టామని, ఆ తర్వాత సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు అందుకున్నాక మరింతగా విజృంభించామని చెప్పాడు. వైసీపీకి వ్యతిరేకంగా టీవీ చానళ్లలో మాట్లాడే వాళ్లని తాము టార్గెట్ చేశామని... నేతలు వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టామని వివరించాడు. గతేడాది సెప్టెంబరులో పవన్ కల్యాణ్, వారి పిల్లలపై పోస్టులు పెట్టినట్టు వర్రా అంగీకరించాడు. అయితే, ఆ పోస్టులు తొలగించాలని వెంకటాద్రి అనే వ్యక్తి వచ్చాడని, రూ.2 లక్షలు ఇస్తే ఆ పోస్టులు తొలగిస్తానని అతడిని డిమాండ్ చేసినట్టు తెలిపాడు. 2020 నుంచి ఐప్యాక్ టీమ్ ద్వారా కంటెంట్ వచ్చేదని, తాము ఫేస్ బుక్ లో పోస్టు చేసేవాళ్లమని తెలిపాడు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్ లోనూ పోస్టు చేసేవాళ్లమని పేర్కొన్నాడు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని సజ్జల భార్గవరెడ్డి ఒత్తిడి తెచ్చాడని వర్రా పేర్కొన్నాడు. గత ఏడాది నుంచి నా ఫేస్ బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెడుతున్నాడు అని వర్రా వెల్లడించాడు. వైఎస్ షర్మిల, విజయమ్మ, సునీతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టాలని అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి తమకు సూచించడంతో పాటు, కంటెంట్ కూడా ఇచ్చేవాడని తెలిపాడు. ఆ పోస్టులు ఏ విధంగా ఉండాలన్నది అవినాశ్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించుకునేవాళ్లని వెల్లడించాడు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టయిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా... న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. Quote
psycopk Posted November 12, 2024 Report Posted November 12, 2024 Sharmila: సోషల్ మీడియాలో నాపై ప్రచారాన్ని జగన్ ప్రోత్సహించారు: షర్మిల 12-11-2024 Tue 15:26 | Andhra సోషల్ మీడియా పోస్టుల అంశంపై షర్మిల స్పందన జగన్ వద్దు అని చెప్పి ఉంటే తప్పుడు ప్రచారం ఆగేదని వెల్లడి వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని విమర్శలు ఇప్పటివరకు పట్టుబడింది విషనాగులేనని వ్యాఖ్యలు విషనాగులతో పాటు అనకొండను కూడా పట్టుకోవాలని సూచన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తాను కూడా బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల ద్వారా తనపై ప్రచారం వెనుక ఉన్నది జగనే అని స్పష్టం చేశారు. నాపై దుష్ప్రచారం జరుగుతుంటే ఆయన ఆపలేదు... దానర్థం ఏమిటి? ఆ అసభ్యకర ప్రచారాన్ని ఒకరకంగా ఆయన ప్రోత్సహించినట్టే కదా! అని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఆ ప్రచారం అప్పుడే ఆగిపోయి ఉండేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని పేర్కొన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉండేవారిపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పుడు పట్టుబడ్డ వాళ్లంతా విషనాగులేనని, ఆ సోషల్ మీడియా విషనాగులతో పాటు అనకొండను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని షర్మిల ఉద్ఘాటించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లను అనడం జగన్ అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ కు ఒకప్పుడు 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారని, జగన్ అక్రమాలు, అవినీతిని ప్రజలు గమనించారని షర్మిల వివరించారు. ప్రజల తీర్పుపై జగన్ కు గౌరవం ఉండాలని హితవు పలికారు. సభలో మైకు ఇవ్వలేదంటే, అది మీ స్వయంకృతాపరాధమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లడానికి కాదా? మరి ప్రజల ఓట్లతో గెలిచి అసెంబ్లీకి హాజరుకాకపోవడం అంటే ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా? అని షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి గైర్హాజరవడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల అజ్ఞానం ఏంటో బయటపడిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, అసెంబ్లీకి వెళ్లబోమని చెప్పి ఓట్లు అడిగారా? అని నిలదీశారు. మీకు సత్తా లేకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు. Quote
psycopk Posted January 9 Report Posted January 9 Meru eni kotina bharthi peru chepanu antunadu ga Varra Raveendra Reddy: నాకు అన్నీ తెలుసు, అయినా చెప్పలేను.. తొలి రోజు కస్టడీలో వర్రా రవీందర్ రెడ్డి 09-01-2025 Thu 08:40 | Andhra సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై అసభ్యకర పోస్టుల కేసులో వర్రా అరెస్ట్ నిన్న తొలి రోజు సుదీర్ఘంగా ప్రశ్నించిన పులివెందుల డీఎస్పీ ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించిన పోలీసులు న్యాయవాది సమక్షంలో వర్రాను ప్రశ్నించి ఆడియో, వీడియో రికార్డ్ చేసిన అధికారులు నేడు మరోమారు విచారణ ‘నాకు అన్నీ తెలుసు.. కానీ, సమాధానాలు మాత్రం చెప్పలేను’.. ఇదీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కస్టడీలో పోలీసులకు ఇచ్చిన సమాధానం. అధికార పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు పెట్టిన కేసులో అరెస్ట్ అయిన వర్రాను నిన్న పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ దాదాపు 30 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ పోస్టులు పెట్టారన్న దానికి రవీందర్ రెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. అయితే, చాలా వరకు ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలుసని, కాకపోతే చెప్పలేనని పేర్కొన్నట్టు తెలిసింది. ఆయన తరపు న్యాయవాది ఓబుల్‌రెడ్డి సమీక్షంలో ఆడియో, వీడియో రికార్డు చేస్తూ విచారించారు. వర్రా ఆధ్వర్యంలోని మొత్తం 43 ఫేస్‌బుక్ ఖాతాలను సీజ్ చేశారు. వీటిలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులతోపాటు షర్మిల, ఆమె తల్లి విజయ, సునీతకు సంబంధించి అసభ్యకర పోస్టులున్నాయి. వాటిని వర్రా ముందు ఉంచి ప్రశ్నించగా.. వాటిని తానే పెట్టినట్టు అంగీకరించినట్టు తెలిసింది. తనకు తెలియకుండా తన పేరుతో 18 నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని చెప్పినట్టు సమాచారం. కాగా, నిన్న కస్టడీ ముగిసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు వర్రాను తరలించారు. నేడు కూడా విచారణ కొనసాగనుంది. Quote
psycopk Posted January 9 Report Posted January 9 Jagan pakkane untu vadini kanna talli ni chelli ni esukunadu ante … em analo teliyatam ledu వర్రా ఆధ్వర్యంలోని మొత్తం 43 ఫేస్‌బుక్ ఖాతాలను సీజ్ చేశారు. వీటిలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులతోపాటు షర్మిల, ఆమె తల్లి విజయ, సునీతకు సంబంధించి అసభ్యకర పోస్టులున్నాయి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.