psycopk Posted January 9 Report Posted January 9 Raghava Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 07-01-2025 Tue 18:04 | Andhra సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారం అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై అభియోగాలు రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు పులివెందులలోని అతడి నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసే అవకాశాలుండడంతో... వైసీపీ కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చారు. వైసీసీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డితో అసభ్య పోస్టులు పెట్టించాడని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అటు... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ రాఘవరెడ్డి ఏ20 నిందితుడిగా ఉన్నాడు. ఇవాళ పులివెందులలోని రాఘవరెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పులివెందుల పీఎస్ కు తరలించారు. Quote
sarfaroshi2 Posted January 9 Report Posted January 9 6 minutes ago, psycopk said: Sleeper cell ni leppinatuu ee thread baga leppavu Samara…Parledu marii….Tirupathi incident cover cheyali ante….illantivi 3-4 lepalli !! Quote
psycopk Posted March 22 Report Posted March 22 Varra Ravindar Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి బెయిల్ 22-03-2025 Sat 20:38 | Andhra సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పీఎస్ లో కేసు నేడు బెయిల్ మంజూరు చేసిన స్థానిక కోర్టు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్ లభించింది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రవీంద్రారెడ్డికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించడంతో వర్రా రవీంద్రారెడ్డి జగ్గయ్యపేట జైలు నుంచి విడుదలయ్యాడు. అటు, వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వర్రా రవీంద్రారెడ్డి అసభ్య పోస్టులు పెట్టగా, ఆ పోస్టులు తొలగించమని అడిగితే తనను కులం పేరుతో దూషించాడంటూ కడప జిల్లా జనసేన కార్యకర్త వెంకటాద్రి నందలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ కేసును పులివెందులకు బదిలీ చేశారు. ఇదే కేసులో సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.