psycopk Posted May 29 Report Posted May 29 Chandrababu Naidu: చంద్రబాబుకు అన్ని విధాలా విజయం చేకూరాలి: పవన్ కల్యాణ్ 29-05-2025 Thu 11:34 | Andhra టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి వరం అని కితాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడి అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని పవన్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా ప్రజాక్షేత్రంలో నిలిచిందని పవన్ కల్యాణ్ కొనియాడారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరుగుతున్న ఈ తొలి మహానాడు వేదికగా, చంద్రబాబు నాయుడు 12వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడి గత పాలనను పవన్ గుర్తుచేసుకున్నారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను 'సైబరాబాద్'గా తీర్చిదిద్ది, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1999లోనే 'ఆంధ్రప్రదేశ్ విజన్ 2020' దార్శనిక పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు, సాంకేతికత ఆధారిత అభివృద్ధికి బాటలు వేశారు" అని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధత, ఆయన అనుభవ సంపద ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని పవన్ అన్నారు. దేశాభివృద్ధికి చంద్రబాబు మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ, నూతన బాధ్యతల్లో ఆయనకు అన్ని విధాలా విజయం చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ శుభ తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. Quote
psycopk Posted May 29 Author Report Posted May 29 Chandrababu Naidu: కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు 29-05-2025 Thu 12:29 | Andhra ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు రేపు ఢిల్లీలో జరగనున్న సీఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి రాజమండ్రికి పయనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని తాజ్ హోటల్లో జరగనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జరగనుంది. రేపు రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లి గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. వాస్తవానికి ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ఈసారి జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే అంటే మే 31వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం, సీఎం చంద్రబాబు స్థానిక గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఆ తర్వాత, పార్టీ శ్రేణులతో కూడా ఆయన భేటీ అవుతారు. కార్యక్రమాలన్నీ ముగించుకుని, శనివారం సాయంత్రం 5:15 గంటలకు ముమ్మిడివరం నుంచి విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.