Jump to content

Recommended Posts

Posted
5 hours ago, Thokkalee said:

It is true that their family is targeted a lot by trollers and memers… okko sari limits cross avtaaru.. snow family kuda top material istundi andariki…  😁😁

mohan-babu-tv9-manisha-mohan-baba.gif

  • Haha 1
Posted
9 hours ago, kakatiya said:

ధైర్యే సాహసే మంచు లక్ష్మి . 

brahmi-praying.gif

aagalekapothunnam-bandla-ganesh.gif

Enduko Tollywood Jon Snow will cross 1000cr+.
But nenu matram opikaga OTT lono or piracy version IPTV lono choodalani aagalekapotunna.

  • Haha 2
Posted
1 hour ago, Kakynada said:

prabhas-rebel-star.gif

Cinema chusaka manam....nenu inka andhuku brathikunnana ani akasam loki chudala?

Posted
5 hours ago, The_Mentalist said:

Snow family is a vibe

Snow family ki kattu banisulu vunnara? Just asking?

Posted
1 minute ago, DarkKnight19 said:

Snow family ki kattu banisulu vunnara? Just asking?

Yea

valla trolls ki fan ikkada

  • Upvote 1
Posted
50 minutes ago, The_Mentalist said:

Yea

valla trolls ki fan ikkada

Trolls theatre lo release chesthey vadi movie kante ekkuva collections vasthayi

  • Haha 1
Posted
2 hours ago, Rendu said:

Cinema chusaka manam....nenu inka andhuku brathikunnana ani akasam loki chudala?

peb anna kosam tiketlu tegutayi anna

mass-elevation-by-bandla-ganesh-about-pr

Posted
4 hours ago, Truth_Holds said:

Modhalayyayi ro.. paid reviewlu...

 

 

 

Kalki ki 2.5,..kanappa ki 3.5 tenor.gif

 

Posted
5 hours ago, Truth_Holds said:

Modhalayyayi ro.. paid reviewlu...

 

 

 

maharaju gaari modati fellam chaala manchidhi ante...chinna pellam donga m* ane kadha artham?

attage "last 40 minutes specactular" ante..appati daaka big rod anena artham?  #JustAsking

Posted

కన్నప్ప ... మినీ రివ్యూ 

 

ఈ సినిమా మీద చాలా మందికి చాలా రకాలుగా expectations ఉన్నాయి... 

 

trollers కి ట్రోల్ చెయ్యడానికి కావాల్సిన కంటెంట్ ఉంటుందా లేదా అని ...

 

నా లాంటి మంచు ఫామిలీ ఫాన్స్ కి ... ఈ సినిమా తో మేము తల ఎత్తుకుని తిరగగలమా లేదా అనే టెన్షన్ ...

 

సినిమా మీద ఖర్చు పెట్టిన ఫైనాన్సియర్స్ కి పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అనే టెన్షన్ ...

 

ఇలా ఒకొక్కరికి ఒకో రకమయిన ఆత్రుత ఈ సినిమా మీద.

 

బయట వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు ఈ రోజు ప్రొద్దున నిద్ర లెగిసిన తరువాత నుండి ఒకటే టెన్షన్ .... సినిమా బాగోకపోతే ... నేను నెగటివ్ రివ్యూ రాస్తే .... మా విష్ణు బాబు లీగల్ గా ఎమన్నా action తీసుకుంటాడా అనే భయం. బాగుంది అని రాస్తే నన్ను కిండల్ చేసే బ్యాచ్ కామెంట్స్ ని తట్టుకోగలనా అని ఇంకో టెన్షన్...

 

మీరు నమ్మరు కానీ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేశా.... తినబుద్దికాలేదు.... ఈ టెన్షన్ తో.

 

మధ్య మధ్య లో రీగల్ సినిమా అప్ మీద చెక్ చెయ్యడం... ఎన్ని టికెట్లు తెగాయి అని... ప్రివ్యూ షో ముత్తం కి 5 టికెట్ లు మాత్రమే బుక్ అయ్యాయి ఈ రోజు ప్రొద్దున్న కి. థియేటర్ వెళ్లే టైం కి ఆ నెంబర్ లో మార్పు లేకపోవడం ఒకింత నిరుత్సాహ పరిచింది.

 

4:15 షో కి థియేటర్ కి వెళ్లే సరికి ఇద్దరు మాత్రమే ఉన్నారు ... వాళ్ళు కూడా నేను లోపాలకి వెళ్తుంటే తల తిప్పేసుకుంటున్నారు.... సిగ్గు వల్లనో లేక భయం వల్లనో తెలియదు కానీ .... షో మొదలు అయ్యేసరికి 7 గురు మాత్రమే ఉన్నాము.

 

సినిమా ఓపెనింగ్ షాట్ ... 

 

శివపార్వతులని చూపెట్టారు ... 

చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకున్నాను.

 

కట్ చేస్తే ....

 

మంచు విష్ణు బాబు కూతుర్లు ఇద్దరి మీద ఒక సాంగ్... 

 

ambitious ప్రాజెక్ట్ కదా .... తండ్రి గా ఆ మాత్రం మమకారం ఉండదా అని అనుకున్నాను.... 

 

పాట అయ్యిపోయాక ..... మళ్ళీ కట్ చేస్తే ....

 

జూనియర్ విష్ణు బాబు మీద షాట్ ... 

సర్లే .... వాళ్ళ డబ్బులు .... వాళ్ళ సొంత సినిమా .... వాళ్ళ ఇష్టమయిన వాళ్ళని క్యాస్ట్ చెయ్యడం లో తప్పేముంటుంది చెప్పండి.

 

పిల్లలు ముద్దు గా ఉన్నారు ... వాళ్ళ పరిధి లో చెయ్యగలిగినంత చేశారు.

 

పిల్లల పెర్ఫార్మన్స్ ని చూడడం లో మునిగిపోయి ... వేరే విషయాలు పెద్దగా పట్టించుకోలేదు ... ఒక రెండు మూడు రీళ్లు అయ్యేవరకు.

 

కొంత సేపు అయ్యేసరికి .... ఎదో amature మూవీ మేకర్స్ తీస్తే ఎలా ఉంటుందో ఆలా అనిపించింది క్వాలిటీ. స్క్రీన్ / థియేటర్ మంచిదే మరి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటుంటే ... అప్పుడు అర్ధం అయ్యింది.

 

సినిమాటోగ్రాఫర్ ఎవడో కానీ ... వాడి ని ... %^ & ^ * *&(ర్ % ^ మింగేసా... 

 

లైటింగ్ ఎక్కడ పెట్టాలో తెలియదటండీ? 

ఎమన్నా అంటే హర్ట్ అయిపోతారు... లైటింగ్ మీద బేసిక్ సెన్స్ లేకపోవడం టూ మచ్ యా... 

 

అక్కడ విష్ణు బాబు అంత బ్లడ్ పెట్టి సినిమా తీస్తుంటే ఆ ఫోటోగ్రఫీ ఏంట్రా బాబు ... యూట్యూబ్ లో పిల్ల బ్యాచ్ దీనికన్నా బాగా తీస్తున్నారు కదా అనిపించింది. 

 

నాలో నేను విశ్లేషించుకుంటే నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ...

 

1. Sheldon Chau మన వాడు (కులం కాదేహే ) కాదు కదా అతనికి మన నేటివిటీ మైథలాజికల్ రెఫరెన్సెస్ పెద్దగా తెలిసిఉండకపోవచ్చు అని అనుకున్నాను 

 

2. అసలు లైటింగ్ కూడా సరిగ్గా పెట్టకుండా ... పేస్ మీద షాడోలు పడుతుంటే ఎక్స్ప్రెషన్స్ కనపడక ... సీన్ ల ని పాడుచేసేసాడు అని అనిపించింది 

 

3. న్యూజీలాండ్ లో సినిమా తీయడం... అది రిమోట్ ఫారెస్ట్ లొకేషన్స్ లో తీయడం వల్ల లైటింగ్ కి proper స్కోప్ లేదేమో అని అనిపించింది.

 

ఆలా ఆలా మొదటి పార్ట్ కంప్లీట్ చేసేసాడు డైరెక్టర్.

 

ఈ విషయం లో మంచు విష్ణుబాబు నే blame చెయ్యాలి ... ఆ రేంజ్ బడ్జెట్ కి ఆ లెవెల్ స్టార్ క్యాస్ట్ కి సినిమాటోగ్రఫీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియాలి. ఫైట్ లు కూడా నాసిరకం గా అనిపించాయి. ఆడియన్స్ ఎక్సపెక్టషన్స్ బాహుబలి రేంజ్ లో expect చేస్తారు అటువంటిది ఇంత చీప్ గా ఎలా చేసారో అని అనుకున్నాను.

 

ఇంటర్వెల్ బ్రేక్ కి బయట కి వచ్చేసరికి నా తో బాటు రెగ్యులర్ గా ప్రివ్యూ షోస్ కి వచ్చే ఒక అతను కలిశారు... ఇద్దరం ఒక నిట్టూర్పు ఒదిలి ఏంటండీ మరీ అసలు ఎమోషనల్ కనెక్షన్ లేకుండా మరీ చీప్ సినిమా లా చుట్టేశారు .... దీనికి మళ్ళీ ఎంత హైప్ create చేశారో కదా అని అనుకున్నాము.

 

ఇంక సినిమా మీద ఆశలు ఒదిలేసుకున్నాను... ఇంటర్వెల్ బ్రేక్ టైం కి వాట్సాప్ / messages చూస్తే ... ఫ్రెండ్స్ ... తోటి మంచు ఫాన్స్ ప్రశ్నల పరంపర .... ఎలా ఉంది .... విష్ణుబాబు ఎలా perform చేసాడు అని. ఎవరికీ రిప్లై ఇవ్వలేదు .... విష్ణుబాబు లీగల్ గా ఎమన్నా ఆక్షన్ తీసుకుంటాడేమో బాగోలేదు అని నెగటివ్ గా చెబితే అని అనుకున్నా 🙂

 

సెకండ్ హాఫ్ మొదలు అయ్యింది ...

 

మాటలు లేవు ...

మాట్లాడుకోడాలు లేవు ...

 

చెత్త సినిమా అని అనుకున్న నా మనసు మార్చేశాడు విష్ణుబాబు & డైరెక్టర్. సినిమా కి ఆయువు పట్టు మొత్తం సెకండ్ హాఫ్ లో నే ఉంది. విష్ణుబాబు కూడా బాగా చేసాడు. ప్రభాస్ ఎంట్రీ అదిరింది... 

 

సినిమా పూర్తి అయ్యి బయటకి వచ్చేటప్పుడు మనకి ఆ సెకండ్ హాఫ్ మాత్రమే గుర్తు ఉంటుంది.... చాలా బాగా కనెక్ట్ చేసాడు.

 

ఫస్ట్ హాఫ్ చూసి ఏంటి ఇంత immature అని అనుకునే జనాల నోరు మూయించేశారు సెకండ్ హాఫ్ తో.

 

mediocre ఫస్ట్ హాఫ్ ని తట్టుకుని సెకండ్ హాఫ్ వరకు ఎంత మంది చూడగలరు అనే దాని బట్టి ఈ సినిమా రేంజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్, మంచు మోహన్ బాబు గారు, విష్ణు బాబు చుట్టూ నడిచే సీన్స్ చాలా బాగా వచ్చాయి... key for the success of the movie. 

 

Cinematography: Sheldon Chau

Edited by: Anthony

Music by: Stephen Devassy

 

non-native technicians ని తీసుకోవడం పెద్ద తప్పిదం అని అనుకుంటున్నాను ఈ ఒక్క విషయం లో కొంచెం జాగ్రత్త పడిఉంటే సినిమా బాగా వచ్చేది అని అనుకుంటున్నాను.   

 

ఫస్ట్ హాఫ్ కి 1/5 రేటింగ్ ఇస్తే ...

సెకండ్ హాఫ్ కి 3/5 రేటింగ్ ఇవ్వొచ్చు. 

 

సెకండ్ హాఫ్ కోసం అన్నా థియేటర్ కి వెళ్లి చూడండి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...