psycopk Posted July 15 Report Posted July 15 Mithun Reddy: మిథున్ రెడ్డికి హైకోర్టులో షాక్ 15-07-2025 Tue 15:48 | Andhra ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు సిట్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని చెప్పారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని... ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. మిథున్ రెడ్డి తరపున టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇటీవలే ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజుకు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మిథున్ రెడ్డి ముందుస్తు బెయిల్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది. 1 Quote
Anta Assamey Posted July 15 Report Posted July 15 High court ivvakapote Supreme Court lo techukuntam bail .. Quote
karna11 Posted July 15 Report Posted July 15 High court miss itheee, supreme court mayaa, pedireddi family ni touch chestee govts change avuthyi annada gaa maa jagan bhai. Quote
Bendapudi_english Posted July 15 Report Posted July 15 5 hours ago, Anta Assamey said: High court ivvakapote Supreme Court lo techukuntam bail .. memu arrest cheyamu anna, Supreme Court lo bail vachevaraku time pass chestham 1 Quote
psycopk Posted July 18 Author Report Posted July 18 Mithun Reddy: ఏపీ లిక్కర్ కేసు.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ 18-07-2025 Fri 12:40 | Andhra ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ ముందుస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ ఇప్పటికే ఏపీ హైకోర్టులోనూ మిథున్‌రెడ్డికి చుక్కెదురు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేగాక సరెండర్‌కు సమయమిచ్చేందుకు కూడా న్యాయస్థానం విముఖత చూపింది. ముందుస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. దాంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ముందుస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మిథున్‌రెడ్డిపై ఇప్పటికే సిట్ లుకౌట్ సర్క్యూలర్ ఇక, మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా... ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని సర్క్యూలర్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు కనుక విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఆయనపై లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.