psycopk Posted August 13 Report Posted August 13 Avinash Reddy: రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నాం: అవినాశ్ రెడ్డి 13-08-2025 Wed 11:07 | Andhra పులివెందులలో రెండు బూత్ లలో రీపోలింగ్ అన్ని బూత్ లలో అవకతవకలు జరిగాయన్న అవినాశ్ కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు బూత్ లలో ఉప ఎన్నిక జరుగుతోంది. నిన్న జరిగిన పోలింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఫిర్యాదు చేయడంలో రెండు బూత్ లలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీపోలింగ్ ను తాము బహిష్కరిస్తున్నామని అవినాశ్ తెలిపారు. అన్ని పోలింగ్ బూత్ లలో అవకతవకలు జరిగిన విషయాన్ని నిన్న రాష్ట్ర ప్రజలందరూ చూశారని... కానీ రెండు బూత్ లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. కంటితుడుపు చర్యగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. పులివెందులలో సరికొత్త సంస్కృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారని మండిపడ్డారు. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రీపోలింగ్ అనేది ఒక డ్రామా అని విమర్శించారు. మొత్తం 15 బూత్ లలో దొంగ ఓట్లు వేశారని తెలిపారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి స్లిప్ లు తీసుకుని వెళ్లి వాళ్లే ఓటు వేశారని ఆరోపించారు. Quote
psycopk Posted August 13 Author Report Posted August 13 B.Tech Ravi: రీపోలింగ్ కోరి.. ఇప్పుడు బహిష్కరించడమేంటి?: బీటెక్ రవి ఫైర్ 13-08-2025 Wed 11:36 | Andhra పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో అనూహ్య పరిణామం రెండు బూత్‌లలో రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీ ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఈ నిర్ణయం తీసుకుందని టీడీపీ ఆరోపణ రీపోలింగ్ అడిగింది వాళ్లే, పారిపోయేది వాళ్లేనంటూ బీటెక్ రవి విమర్శ రాజారెడ్డి రాజ్యాంగం వద్దని ప్రజలు తీర్పిచ్చారని టీడీపీ నేతల వ్యాఖ్య కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఉపఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించిన రెండు బూత్‌ల రీపోలింగ్‌ను బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. "మొదట 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పుడు ఎన్నికల సంఘం రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే, దానిని బహిష్కరిస్తున్నామని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంటే ఈ రెండు బూత్‌లలో రీపోలింగ్ ను ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు మీకు ఓటు వేయరని, మీరు ఓడిపోతారని స్పష్టంగా తెలియడం వల్లే ఈ బాయ్‌కాట్ డ్రామా ఆడుతున్నారు" అని బీటెక్ రవి ఆరోపించారు. ఈ రెండు బూత్‌లలో ఎన్నికలు జరిగితే ఎలాగూ మళ్లీ రీపోలింగ్ రాదని, అలాంటప్పుడు పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ వైపు లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వైఎస్సార్సీపీ ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇదే విషయంపై ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతూ, ఇది వైఎస్సార్సీపీ ఆడుతున్న "డైవర్షన్ పాలిటిక్స్" అని ఆరోపించారు. పోలింగ్ రోజు సాయంత్రం ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత తమకు ఓట్లు పడలేదని నిర్ధారించుకుని, కావాలనే రీపోలింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఇప్పుడు తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘం, పోలీసులు, టీడీపీపై నెపం మోపుతున్నారని, రేపు మీడియాపైనా ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. "గతంలో ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కానీ ఇప్పుడు ప్రజలు ఆ పాలన వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థి లతారెడ్డికి ఓటు వేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు" అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా, వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ, ఈసీ ఆదేశాల మేరకు రెండు బూత్‌లలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. Quote
psycopk Posted August 13 Author Report Posted August 13 YS Avinash Reddy: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు .. రెండు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్ 13-08-2025 Wed 09:54 | Andhra 3, 14 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ రీపోలింగ్ బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు రెండు కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. పటిష్ఠమైన పోలీసు భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చువేల్లి, కొత్తపల్లె గ్రామాల్లోని 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అచ్చువేల్లిలోని మొదటి పోలింగ్ బూత్‌లో 492 మంది ఓటర్లు ఉండగా, కొత్తపల్లెలోని పోలింగ్ బూత్‌లో 1273 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు రీ పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు నిన్న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. ఈ రెండు స్థానాలను కూటమి, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా, మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. Quote
psycopk Posted August 13 Author Report Posted August 13 YS Jagan Mohan Reddy: ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు.. పులివెందుల ఘటనలపై జగన్ 13-08-2025 Wed 14:59 | Andhra పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ కొన్ని వీడియోల ప్రదర్శన ‘కాల్చి పారేస్తా’ అంటూ డీఎస్పీ బెదిరించారని విమర్శ మంత్రి రామప్రసాద్ రెడ్డి బూత్‌లోకి వెళ్లి ఏజెంట్లపై దాడి చేశారని ఆరోపణ ఓటమి భయంతోనే టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని జగన్ వ్యాఖ్య పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ నేతలు పోలీసులను, మంత్రులను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్‌లను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. పులివెందుల డీఎస్పీ ఒకరు ‘కాల్చి పారేస్తా నా కొ..!’ అంటూ తమ పార్టీ కార్యకర్తలను బెదిరించారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ప్లే చేసి చూపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతుంటే, ఓ అధికారి ఇలాంటి భాష వాడటం దారుణమని ఆయన మండిపడ్డారు. దీనికితోడు, పులివెందుల పట్టణంలోని వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి హడావిడి సృష్టించారని ఆరోపించారు. మరో ఘటనలో, రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రామప్రసాద్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లె గ్రామానికి వెళ్లి పోలింగ్ బూత్‌లో రౌడీయిజం చేశారని జగన్ విమర్శించారు. మంత్రి సమక్షంలోనే తమ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాగి, వారిపై దాడి చేశారని ఆరోపించారు. తుమ్మలపల్లి గ్రామంలో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత భూపేశ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని, ఓటర్ల స్లిప్పులు పంచుతూ కెమెరాకు చిక్కారని తెలిపారు. ప్రజల మద్దతుపై నమ్మకం లేకపోవడం వల్లే చంద్రబాబు ఇలాంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. ప్రజలు తమకు ఓటు వేయరనే భయంతోనే టీడీపీ నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. 2017లో నంద్యాల ఉపఎన్నికలో కూడా టీడీపీ ఇదే తరహాలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన గుర్తుచేశారు. నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే, ఇలాంటి అక్రమాలకు దిగాల్సిన అవసరం ఏముందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. Quote
psycopk Posted August 13 Author Report Posted August 13 https://www.instagram.com/reel/DNSk3kZI5PT/?igsh=MTZxNm1ibWlrNWh2cg== Quote
Sinthakai Posted August 13 Report Posted August 13 Kendra balagaale gaavale ani gajji gaadu edusthante eedemo boycott antaadendo bhayya? Ide covert emo🤣🤣🤣pichi nayallantha jeraaru movayya pakkana🤣🤣🤣 Quote
7691 Posted August 13 Report Posted August 13 Election commissioner ni 11gaadu cm ga unnapudu appoint chesadu tammullu. Amey vaadi rigging ki ullikipadi 2 places lo repolling antundi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.