psycopk Posted August 18 Report Posted August 18 Nara Lokesh: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ 18-08-2025 Mon 12:20 | National ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలను మంత్రికి తెలియజేసిన లోకేశ్ ఏపీ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరణ ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర విదేశాంగశాఖ మంత్రితో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు. దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేశ్ వివరించారు. దీనికి మీ పూర్తి సహకారం కావాలని లోకేశ్ మంత్రి జైశంకర్‌ను కోరారు. ఏపీకి చెందిన సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యూఎస్ లో అక్కడి ప్రజల తలసరి ఆదాయం 70 వేల డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం 1,26,000 డాలర్లుగా ఉందన్నారు. ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో కేంద్ర చర్యలు అభినందనీయమని, ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో ఉంటుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారించామని వివరించారు. ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి రాష్ట్రానికి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్ కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. Quote
psycopk Posted August 18 Author Report Posted August 18 Nara Lokesh: ఢిల్లీలో కేంద్రమంత్రి నడ్డాతో నారా లోకేశ్ భేటీ... ఏపీకి కీలక హామీలు 18-08-2025 Mon 14:22 | Andhra కేంద్రమంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేష్ భేటీ ఏపీకి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు ఈ నెల 21 నాటికి యూరియా సరఫరా చేస్తామని హామీ రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం విశాఖ నిపర్కు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని వినతి పోలవరం, అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయని వెల్లడి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉందని, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి నడ్డా స్పందిస్తూ... ఈనెల 21నాటికి ఆంధ్రప్రదేశ్ కు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని, రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ కోరగా, జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (NIPER) శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన 100 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 14 నెలలుగా కొనసాగతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేశ్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, అమరావతి రాజధాని పనులు మళ్లీ పట్టాలెక్కాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 1 Quote
psycopk Posted August 18 Author Report Posted August 18 Nara Lokesh: ఢిల్లీలో మంత్రి లోకేశ్... ఏపీ రోడ్ల అభివృద్ధిపై గడ్కరీకి కీలక ప్రతిపాదనలు 18-08-2025 Mon 15:26 | Andhra ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి లోకేష్ భేటీ విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు విజయవాడ, విశాఖల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణంపై చర్చ కుప్పం-హోసూరు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతులు కోరిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక రహదారుల విస్తరణకు వినతి భూసేకరణ వేగవంతం చేస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు–మచిలీపట్నం నడుమ 6లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలమంత్రి లోకేశ్ విజ్జప్తి చేశారు. లోకేశ్ నేడు ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడతూ... ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కానూరు–మచిలీపట్నం రోడ్డు విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్–అమరావతి మధ్య కనెక్టివిటీలో ఎన్ హెచ్–65 కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే మంజూరైన హైదరాబాద్–గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజిని డీపీఆర్ లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు "ఎన్ హెచ్–16 వెంట విశాఖపట్నంలో 20 కి.మీ.లు, విజయవాడలో 14.7 కి.మీ.ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్లను నాగపూర్ మోడల్ లో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఎన్ హెచ్ఏఐ, రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో డీపీఆర్ రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశంపై చర్చ జరిగింది. ఏపీలో రీజనల్ కనెక్టివిటీ, డెవలప్ మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కర్నూలు – ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుకొండ-గుంటూరు నడుమ ఎన్ హెచ్ 544డి, కాకినాడ పోర్టు–ఎన్ హెచ్ 216 నడుమ దక్షిణ రహదారి, కాణిపాక వినాయక దేవాలయం లింకు రోడ్డు నిర్మాణ పనుల చేపట్టాలి" అని గడ్కరీని కోరారు. బెంగుళూరు–చెన్నై (ఎన్ఇ-7) రహదారికి డైరక్టర్ కనెక్టవిటీ కోసం కుప్పం-హోసూరు - బెంగుళూరు నడుమ 56 కి.మీ.ల మేర రూ.3వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని లోకేశ్ కేంద్రమంత్రికి విన్నవించారు. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (కాడా) ప్రాంతంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేశ్... గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు భద్రతా ప్రమాణాల మెరుగుదల, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, లాజిస్టిక్స్, పాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను వివరించారు. కేంద్రప్రభుత్వ సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన భూసేకరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్థిరమైన మోడరన్ కనెక్టివిటీ కోసం గ్రీన్ కారిడార్లు, అధునాతన టోలింగ్, రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచార వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్జప్తిచేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.