kakatiya Posted August 19, 2025 Report Posted August 19, 2025 క్రింది ఫోటో లో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి.మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు. ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రం నుండి తెలుగు వార్తలను మన తెలుగు వారికి వినిపించిన మహిళ.వీరి వయస్సు 94 సం.లు.ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉంటూ రేడియో కార్యక్రమాలు వినడం ఆవిడ అలవాటు.శ్రీశ్రీ మరియు జగ్గయ్య గార్లతో కలిసి పనిచేసారు.స్వస్థలం నెల్లూరు జిల్లా పల్లెపాడు గ్రామం.ఈవిడ ప్రస్థానం ఆకాశవాణి లో సంగీత కార్యక్రమాలకు అనౌన్సర్ గా మొదలైంది.ఆరోజుల్లోఆకాశవాణి లో పాల్గొన 14 భాషలు విభాగాలుగా ఉండేవి. 1960 సం.నుండి అద్దంకి మన్నార్,దుగ్గిరాల పూర్ణయ్య,ఏడిద గోపాలరావు మరియు మంగమ్మ ఆకాశవాణి లో ప్రముఖులు.ఆరోజుల్లో వార్తల సేకరణ టెలీ పింటర్లు మరియు ఫోన్ల ద్వారా ఉండేవి.ఉదయం 7 గం.,మధ్యాహ్నం 12 గం.మరియు రాత్రి 7 గం.లకు.నా గొంతు లక్షల రేడియోల్లో వినిపిస్తోందని,తెలుగు వారంతా వింటున్నారని ఆవిడ భావం.కోట్లాది శ్రోతలు వార్తల కోసం వేచి ఉండేవారు ఆ రోజుల్లో. 94 సం.ల ఈవిడకి మన తెలుగు కళాసమితి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటుంది.💐 2 Quote
Sinthakai Posted August 19, 2025 Report Posted August 19, 2025 Puttina roju subhaakaankshalamma🙏 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.