Jump to content

@ Happy birthday to G.O.A.T @ TFI


Recommended Posts

Posted

Allu Arjun: 'ఒకే ఒక్క మెగాస్టార్'.. మామయ్యపై ప్రేమను చాటుకున్న అల్లు అర్జున్

22-08-2025 Fri 13:00 | Entertainment
Allu Arjun Wishes Chiranjeevi on his Birthday
 
  • చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
  • మామయ్యతో దిగిన ఫొటోను షేర్ చేసిన బన్నీ
  • ఖుషీ అవుతున్న మెగా, అల్లు ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో హోరెత్తుతోంది. అయితే, ఈ శుభాకాంక్షల వెల్లువలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ పోస్ట్ ఫుల్‌స్టాప్ పెట్టిందనే చర్చ మొదలైంది.

చిరంజీవితో కలిసి ఓ కార్యక్రమంలో ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న పాత ఫోటోను పంచుకుంటూ, "ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సింపుల్ పోస్ట్ మెగా, అల్లు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

20250822fr68a81b87b2cee.jpgతన మామయ్య చిరంజీవి అంటే తనకు ఎనలేని గౌరవం అని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన 'వేవ్స్' సదస్సులో మాట్లాడుతూ, చిరంజీవి తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారని, ఆయనే తనకు అతిపెద్ద స్ఫూర్తి అని బన్నీ వెల్లడించారు. ఇప్పుడు పుట్టినరోజున 'ఒకే ఒక్క మెగాస్టార్' అంటూ ఆయన చేసిన పోస్ట్, ఆ గౌరవాన్ని మరోసారి చాటి చెప్పింది.

ఇదిలా ఉండగా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విక్టరీ వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, హరీష్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Posted

Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ ఎమోష‌న‌ల్ విషెస్‌

22-08-2025 Fri 12:46 | Entertainment
Ram Charan Emotional Wishes for Chiranjeevi Birthday
 
  • తండ్రి చిరంజీవికి రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • నా హీరో, మార్గదర్శి, స్ఫూర్తి మీరేనంటూ భావోద్వేగం
  • నేను పొందిన ప్రతి విజయం మీ నుంచి వచ్చిందేనన్న చరణ్
  • మీరు దొరకడం నా అదృష్టం అంటూ తండ్రిపై ప్రేమ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చరణ్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తన తండ్రి తన జీవితంలో ఎంతటి ప్రాధాన్యం కలిగి వున్న వ్యక్తో వివరిస్తూ చేసిన ఈ పోస్ట్, అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.

"నాన్నా, ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు, మీరు ఎంత గొప్ప వ్యక్తి అనే దానికి ఇది ఒక వేడుక" అంటూ రామ్ చరణ్ తన సందేశాన్ని ప్రారంభించారు. తన తండ్రిని తన హీరోగా, మార్గదర్శిగా, స్ఫూర్తిగా అభివర్ణించారు. జీవితంలో తాను సాధించిన ప్రతి విజయం, తాను పాటిస్తున్న విలువలు తన తండ్రి నుంచే వచ్చాయని చరణ్ ప్రేమగా గుర్తుచేసుకున్నారు.

చిరంజీవి వయసు గురించి ప్రస్తావిస్తూ, "70 ఏళ్ల వయసులో, మీరు మనసులో మరింత యవ్వనంగా, గతంలో కంటే ఎక్కువ స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు" అని ప్రశంసించారు. తన తండ్రి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని, మరెన్నో అందమైన సంవత్సరాలు చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

"ఎవరైనా కోరుకోగల అత్యుత్తమ తండ్రి అయినందుకు ధన్యవాదాలు" అంటూ రామ్ చరణ్ తన సందేశాన్ని ముగించారు. తండ్రిపై కొడుకు చూపిన ఈ అపారమైన ప్రేమ, గౌరవానికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
Posted

: జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు.. పవన్‌ను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి

22-08-2025 Fri 10:43 | Entertainment
cr-20250822_1dd03d8dba7f1459.jpg
 
  • నేడు మెగాస్టార్ 70వ పుట్టినరోజు 
  • అన్నయ్యకు పవన్ కల్యాణ్ బ‌ర్త్‌డే విషెస్
  • తమ్ముడికి విజయోస్తంటూ చిరంజీవి ట్వీట్
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే సినీ, రాజకీయ, ఇత‌ర‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరుకు జన్మ‌దిన‌ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలుపుతూ, ఆయన పట్టుదల, కార్యదీక్షతలను కొనియాడారు. 

మెగాస్టార్ దీనిపై స్పందిస్తూ, పవన్ కు ఆశీస్సులు అందజేశారు. ఈ మేర‌కు చిరు ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేశారు. 'జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!' అంటూ అన్న‌య్య చేసిన పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

"జ‌న సైన్యాధ్యక్షుడికి విజ‌యోస్తు!.. త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట‌.. ప్రతీ అక్షరం నా హృద‌యాన్ని తాకింది. అన్నయ్యగా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదక్షత‌, ప‌ట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గ‌ర్వప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్లకు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్పటిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది. 

ఈ రోజు నీ వెనుక కోట్లాది మంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను" అంటూ చిరు రాసుకొచ్చారు. 

ఈ ట్వీట్‌కు పవన్ చిన్నతనంలో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్ డే వేడుకలు జరగ‌గా.. అప్పుడు కేక్ కట్ చేస్తున్న ఫొటోలను జ‌త‌ చేశారు. ఇలా ప‌వ‌న్‌కు చిరు పాత ఫొటోల‌తో సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. 
Posted

Chiranjeevi: చిరుకు సీఎం చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్ 

22-08-2025 Fri 10:10 | Andhra
Chandrababu Birthday Wishes to Chiranjeevi
 
  • నేడు 70వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన మెగాస్టార్
  • చిరుకు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల నుంచి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌ల వెల్లువ
  • ఎక్స్ వేదిక‌గా చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు
నేడు 70వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల నుంచి పెద్ద ఎత్తున జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి సోద‌రుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అన్న‌య్య‌కి ప్రేమ పూర్వ‌కంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. 

"మెగాస్టార్ చిరంజీవికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితం, దాతృత్వంలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తి. మీ సేవ‌, అంకిత‌భావంతో ఇంకా ఎంద‌రో జీవితాలను ప్ర‌భావితం చేయాల‌ని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఆనందాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 
Posted
5 hours ago, FrustratedVuncle said:

Anniiyyaa plz ra ee birthday ninchaina stage meda grand daughter age veroines tho flirting, tagi vaagi 10gatalu gatra apeyyara. aa Cringe soodaleka sasthannam. Movies lo vaddu anna vinavu ne musali chadastam. 

idi-amin-laugh.gif

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...