psycopk Posted September 10 Author Report Posted September 10 Chandrababu Naidu: 15 నెలల్లోనే చెప్పింది చేశాం.. చేసి చూపిస్తున్నాం: అనంతపురం సభలో కూటమి నేతలు 10-09-2025 Wed 16:35 | Andhra అనంతపురంలో 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పేరుతో భారీ బహిరంగ సభ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే హామీలు నెరవేర్చామన్న కూటమి నేతలు పెన్షన్‌ను రూ.4 వేలకు, వికలాంగులకు రూ.15 వేలకు పెంచిన వైనం వెల్లడి ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ నిర్ణయం రాష్ట్రంలో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రకటన గత వైసీపీ ప్రభుత్వంపై నేతల తీవ్ర విమర్శలు అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల వ్యవధిలోనే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేసి చూపించామని కూటమి ప్రభుత్వ నేతలు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' బహిరంగ సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. చెప్పిన హామీలతో పాటు చెప్పని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్ పెంచాం: గోరంట్ల మోహన్ సాయి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచిందని, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000 నుంచి రూ.15,000కు పెంచిందని బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ సాయి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా: కదిరి ఎమ్మెల్యే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 3,000కు పైగా చికిత్సలను 2493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారని, పాత్రికేయులకు కూడా వర్తింపజేశారని తెలిపారు. ఏపీకి నలుగురు నాలుగు స్తంభాలు: జేసీ అస్మిత్ రెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ రాష్ట్రానికి నాలుగు స్తంభాల్లా నిలబడ్డారని అభివర్ణించారు. వారి వల్లే రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా ఉందని అన్నారు. 15 నెలల్లోనే రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, 11 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేశామని, డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను, 6100 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, 'తల్లికి వందనం', 'దీపం-2', 'ఆడబిడ్డ నిధి' వంటి పథకాలతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి గండికోట రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కార్గో ఎయిర్‌పోర్ట్ వంటి వాటికి నిధులు కేటాయించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. Quote
psycopk Posted September 10 Author Report Posted September 10 Nara Lokesh: వైసీపీ కోరలు పీకేసినా... ఆ పాము విషం చిమ్ముతూనే ఉంది: నారా లోకేశ్ 10-09-2025 Wed 11:42 | Andhra సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరించారని లోకేశ్ మండిపాటు ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ యూరియా, పథకాలపై కూడా నకిలీ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య వైసీపీ ఫేక్ వీడియోలతో విష ప్రచారానికి పాల్పడుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించినట్టుగా ఆయన మాటలనే వక్రీకరించి ఒక నకిలీ వీడియోను సృష్టించారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే ఎడిట్ చేసి దుష్ప్రచారం చేయడం వైసీపీ నేతల తీరుకు నిదర్శనమని అన్నారు. కేవలం ముఖ్యమంత్రి ప్రసంగం విషయంలోనే కాకుండా యూరియా, ప్రభుత్వ పథకాలు వంటి పలు అంశాలపై కూడా వైసీపీ క్రిమినల్స్ ఫేక్ ప్రచారాలు, నకిలీ ఆందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అనే విష సర్పం కోరలు పీకేశారని, అయినా ఆ పార్టీ తన బుద్ధి మార్చుకోకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరలు పీకేసిన పాము కూడా కాటేయాలని చూస్తుందనే విధంగా వైసీపీ ప్రవర్తన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను నిర్ధారించుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.