psycopk Posted September 16 Author Report Posted September 16 KT Rama Rao: హీరోయిన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ పై భారీ కుట్ర: సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 16-09-2025 Tue 14:45 | Telangana కేటీఆర్ లక్ష్యంగా బీఆర్ఎస్‌లో పెద్ద కుట్ర జరుగుతోందన్న సామ రామ్మోహన్ కవిత తర్వాత కేటీఆర్ టార్గెట్ అని వ్యాఖ్య తాను గతంలో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయన్న సామ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ భారీ కుట్ర జరుగుతోందంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలనం రేకెత్తించారు. కల్వకుంట్ల కవితను ఏ విధంగానైతే కేసీఆర్ కుటుంబం నుంచి బయటకు పంపించారో, అదే రీతిలో కేటీఆర్‌ను కూడా పక్కకు నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద వ్యక్తి ఉన్నారని, ఆయనకు బీజేపీ నేతలు మద్దతిస్తున్నారని బాంబు పేల్చారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశపడుతున్న ఓ ట్రబుల్ షూటర్, కేటీఆర్‌ను పక్కకు తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బెంగళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో, కేటీఆర్‌ను ఇరికించాలనే ప్లాన్ మొదలైంది" అని ఆయన ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో సెలబ్రిటీల డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కేటీఆర్ పేరును ప్రస్తావించారని, దాన్నే ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఆయనపై కుట్ర పన్నుతున్నారని రామ్మోహన్ రెడ్డి వివరించారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను గతంలో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని, వ్యాపార ఒప్పందాల కోసమే కేటీఆర్, నారా లోకేశ్ రహస్యంగా భేటీ అయ్యారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. Quote
psycopk Posted September 16 Author Report Posted September 16 KTR: పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్... బీజేపీపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు 16-09-2025 Tue 12:35 | Telangana పాక్‌తో మ్యాచ్ ఆడటంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందన్న కేటీఆర్ పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించిన మాజీ మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా బీజేపీకి గౌరవం లేదని విమర్శ బీజేపీ జాతీయవాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటాన్ని తప్పుబడుతూ, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఐదు నెలల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ దారుణ ఘటనకు వ్యతిరేకంగా బాధిత కుటుంబాలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నా, జాతీయవాదాన్ని తమ బ్రాండ్‌గా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటంపై ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. ఈ విషయంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడంపై కొందరు బీజేపీ మద్దతుదారులు కలవరపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిని బట్టి చూస్తే బీజేపీకి భారత రాజ్యాంగంపైనా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపైనా గౌరవం లేదని స్పష్టమవుతోందని ఆయన అన్నారు. వారి వైఖరి ఎప్పుడూ ఇలాగే నీచంగా ఉంటుందని విమర్శించారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా చూడటమే తమ పార్టీకి తెలిసిన నిజమైన జాతీయవాదం అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని నిర్మించేది జాతీయత అయితే, ఆధిపత్యం, అహంకారాన్ని ప్రదర్శించేది జింగోయిజం అని, ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను బీజేపీ గ్రహించాలని ఆయన హితవు పలికారు. "జైహింద్" అంటూ తన ట్వీట్‌ను ముగించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.