psycopk Posted September 24 Author Report Posted September 24 chee poo anna ee adukovatam enti ra babu... mari inta leki ga.. Perni Nani: ఆ సత్తా ఉంటే జగన్కు హోదా ఇవ్వండి: ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్ 24-09-2025 Wed 16:04 | Andhra జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని పేర్ని నాని డిమాండ్ ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్న హోదా ఇవ్వకపోవడం వల్లే కోర్టు మెట్లెక్కామని వెల్లడి వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంలో ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేదంటే ఆ విషయాన్ని అంగీకరించాలని ఆయన సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్కు ప్రతిపక్ష హోదాను నిరాకరిస్తోందని ఆరోపించారు. "వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం? జగన్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేమనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మేము న్యాయపోరాటం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది" అని ఆయన స్పష్టం చేశారు. కూటమి పాలన తీరు ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఏ ఎన్నికనైనా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్ని నాని తెలిపారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 Jagan: జగన్ రాజకీయ జీవితం ముగిసినట్టే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి 24-09-2025 Wed 15:29 | Andhra జగన్పై ఉన్న అవినీతి, ఈడీ కేసులు తుది దశకు చేరాయన్న బుచ్చయ్య చౌదరి తాడేపల్లి ప్యాలెస్లో బూతుల పండుగ నిర్వహించారని విమర్శ ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఆరాటపడుతున్నారని మండిపాటు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని, ఆయనపై నమోదైన అవినీతి, ఈడీ కేసులు తుది దశలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలతో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు బయటకొచ్చి పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. "జగన్పై ఉన్న కేసుల విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుల్లో ఆయనకు ఇంకెన్నేళ్లు జైలు శిక్ష పడుతుందోనని అనిపిస్తోంది" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని, అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాన్ని వ్యాప్తి చేసేందుకే తాడేపల్లి ప్యాలెస్లో ‘బూతోత్సవం’ నిర్వహించారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి, ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పట్టుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని, అయితే ప్రజలు మళ్లీ మోసపోయేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఓర్వలేక, వైసీపీ నేతలు పనిగట్టుకుని బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారని, ఈ నిజాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 anavasaram ga mlc aaiyadu botsa... roju dobulu tinatame Botsa Satyanarayana: శాసనమండలి నుంచి బొత్స సత్యనారాయణ వాకౌట్ 24-09-2025 Wed 14:40 | Andhra శాసనమండలిలో అనధికార విగ్రహాలపై తీవ్ర చర్చ వైఎస్ విగ్రహాలపై టీడీపీ సభ్యుల ఆరోపణలు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష నేత బొత్స అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల మధ్య విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందులలో ప్రజా నిధులతో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్ల అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ సభ్యులు తిరుమలనాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అనధికార విగ్రహాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నాయకుడు వైఎస్ఆర్ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, బయటకు వెళ్లిపోయారు. ఈ చర్చ అనంతరం, సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రహదారులపై 1671, రాష్ట్ర హైవేలపై 815 విగ్రహాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2013 ఫిబ్రవరి 18న జారీ చేసిన జీవో 18 ప్రకారం పబ్లిక్ రోడ్లు, కాలిబాటలపై విగ్రహాలకు అనుమతి లేదని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ నిబంధన హై మాస్ట్ లైట్లు, రోడ్ల సుందరీకరణ వంటి ప్రజా వినియోగ పనులకు వర్తించదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విగ్రహాలను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి సభకు తెలిపారు. Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 itla sankarayya lanti valla sanka nakatame ra jagga. .nee bratuku anta.. Shankarayya: ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపిన సీఐ 24-09-2025 Wed 09:04 | Andhra సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకా హత్య కేసు నిందితులు ఆధారాలు చెరిపివేశారని ఆరోపించిన చంద్రబాబు తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్న శంకరయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులో పేర్కొన్న శంకరయ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువునష్టం దావా నోటీసు పంపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య ఆరోపించారు. ఈ నెల 18న న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపగా, అవి నిన్న వెలుగులోకి వచ్చాయి. శాసనసభ వేదికగా తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు. శంకరయ్యపై గతంలో ఆరోపణలు: 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న జె. శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీబీఐ విచారణలో శంకరయ్య పాత్ర: మొదట సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమపై ఒత్తిడి తెచ్చారని, కేసు నమోదు చేయొద్దని బెదిరించారని శంకరయ్య తెలిపారు. అయితే, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయాల్సిన సమయంలో ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఆ తరువాత వారం రోజుల్లోనే, 2021 అక్టోబర్ 6న వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసింది. నిందితుల ప్రభావంతోనే సీఐ శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం కర్నూలు రేంజ్ వీఆర్లో ఉన్న శంకరయ్య నేరుగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 Nara Lokesh: మెగా డీఎస్సీ వేడుకకు జగన్ను పిలుస్తాం: నారా లోకేశ్ 24-09-2025 Wed 17:27 | Andhra మెగా డీఎస్సీ ద్వారా 16,000 మంది టీచర్ల ఎంపిక పూర్తి ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,000 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరికీ నియామక పత్రాలను ఒకే వేదికపై అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 16,000 మంది ఉపాధ్యాయులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాము. ఈ కార్యక్రమానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ను కూడా ఆహ్వానిస్తాము" అని పేర్కొన్నారు. Quote
CanadianMalodu Posted September 24 Report Posted September 24 3 minutes ago, psycopk said: Jagan: జగన్ రాజకీయ జీవితం ముగిసినట్టే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి 24-09-2025 Wed 15:29 | Andhra జగన్పై ఉన్న అవినీతి, ఈడీ కేసులు తుది దశకు చేరాయన్న బుచ్చయ్య చౌదరి తాడేపల్లి ప్యాలెస్లో బూతుల పండుగ నిర్వహించారని విమర్శ ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఆరాటపడుతున్నారని మండిపాటు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని, ఆయనపై నమోదైన అవినీతి, ఈడీ కేసులు తుది దశలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలతో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు బయటకొచ్చి పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. "జగన్పై ఉన్న కేసుల విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుల్లో ఆయనకు ఇంకెన్నేళ్లు జైలు శిక్ష పడుతుందోనని అనిపిస్తోంది" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని, అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాన్ని వ్యాప్తి చేసేందుకే తాడేపల్లి ప్యాలెస్లో ‘బూతోత్సవం’ నిర్వహించారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి, ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పట్టుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని, అయితే ప్రజలు మళ్లీ మోసపోయేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఓర్వలేక, వైసీపీ నేతలు పనిగట్టుకుని బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారని, ఈ నిజాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. Mugisindhi Buchiah Chowdari rajakeeyam jeevutham Samara. NTR ki POTU daggara nunchi, Baboru Chowdari ni pakkaki pettesaru. Em ivvaledhu eeroju dhaka MLA post tappa. Quote
Sam480 Posted September 24 Report Posted September 24 19 minutes ago, psycopk said: making a fool of himself by asking again and again Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 5 minutes ago, Sam480 said: making a fool of himself by asking again and again just cover up story... next sessions ki vellataniki.. idi oka saku.. inni rojulu court lo fight chesam... inka labham ledu ani assembly ki vacham ani chepukotaniki.... ee pichi battai gadiki pulusu karipodi... Quote
2024 Posted September 24 Report Posted September 24 inta chillar gadi endhi boseDK gadu, vadi laganee vadi fans kooda behave chestunnaru Quote
psycopk Posted September 24 Author Report Posted September 24 Permission lekunda ayya peru tho college start cheyatam endi ra jagga Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.