psycopk Posted October 19 Report Posted October 19 Nara Lokesh: అన్ని థాంక్స్ బాస్ కే చెందుతాయమ్మా!: సిడ్నీలో నారా లోకేశ్ 19-10-2025 Sun 14:08 | Andhra ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం డైరెక్టర్‌తో భేటీ ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చ ఈ వారంలోనే సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశానికి సన్నాహాలు సిడ్నీలో టీడీపీ ఎన్నారైలతోనూ సమావేశమైన లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. సిడ్నీ నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. పర్యటనలో భాగంగా తొలిరోజే కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టగానే ఆయనకు ఓ ఊహించని అభినందన ఎదురైంది. ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ చిన్నారి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కృతజ్ఞతలు తెలిపింది. గూగుల్ ను ఏపీకి తీసుకువచ్చినందుకు థాంక్యూ లోకేశ్ అన్నా అంటూ ఆ చిన్నారి ఓ ప్లకార్డును కూడా ప్రదర్శించింది. ఆ పసిమొగ్గ ప్రశంసకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఈ ప్రశంసలన్నీ నావి కాదమ్మా.. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడే మన బాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెందాలి" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. ఒకవైపు ప్రవాసాంధ్రుల ఆత్మీయ పలకరింపులు, మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక సమావేశాలు.. ఇలా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద పారించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన క్షణం తీరిక లేకుండా సాగుతోంది. విమానం దిగిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీ పర్యటనలో భాగంగా, లోకేశ్ తొలిరోజే సిడ్నీ హార్బర్ వద్ద ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా కంపెనీలకు కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే ధ్యేయంగా ఈ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలను లోకేశ్ ఆమెకు వివరించారు. ఈ భేటీ ఫలవంతంగా ముగిసిందని, త్వరలోనే జోడీ మెక్కే ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురూ ప్రధానంగా చర్చించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు, సాంకేతిక అవకాశాలు లభిస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Nara Lokesh: ఆస్ట్రేలియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. ఏపీలో పెట్టుబడులే లక్ష్యం! 19-10-2025 Sun 11:52 | Andhra సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌తో మంత్రి లోకేశ్ భేటీ ఏపీని తమ స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో చేర్చాలని ఫోరమ్‌కు విజ్ఞప్తి రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపు కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం క్లస్టర్లలో పెట్టుబడులకు ఆహ్వానం నవంబర్‌లో జరిగే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని విజ్ఞప్తి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నామని తెలిపిన ఫోరం డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ఆస్ట్రేలియా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సిడ్నీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ఈ భేటీలో కీలక పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ను తమ స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో చేర్చాలని లోకేశ్ ఫోరమ్‌ను కోరారు. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా కలిసి నిర్వహించనున్న ‘ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్’ సమావేశానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఇంధనం, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ వంటి కీలక రంగాల్లో ఉన్న అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈవోలకు వివరించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కోరారు. ఇదే క్రమంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్–2025కు ఫోరం నాయకత్వ బృందంతో సహా హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. తదుపరి సీఈవోల ఫోరం సెషన్‌లో ఏపీకి భాగస్వామ్యం కల్పించాలని, ఆ సమావేశంలో రాష్ట్రంలోని ప్రాధాన్యత రంగాలను ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. లోకేశ్ విజ్ఞప్తిపై స్పందించిన మెక్ కే ఫోరం కార్యకలాపాలను వివరించారు. ఇరు దేశాల ప్రధానుల చొరవతో 2012లో ఈ ఫోరం ప్రారంభమైందని, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యమని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. సుమారు 48.4 బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యానికి తమ ఫోరం మద్దతు ఇస్తోందని, విధానపరమైన సహకారం కోసం సీఐఐతో కలిసి పనిచేస్తున్నామని ఆమె వివరించారు. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Nara Lokesh: ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం 19-10-2025 Sun 08:41 | Andhra సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్ తెలుగుదేశం ఆస్ట్రేలియా బృందం ఆధ్వర్యంలో లోకేశ్ కు స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయంలో రెపరెపలాడిన టీడీపీ జెండాలు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేశ్ కు స్వాగతం పలికారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్నారైలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేశ్ కు స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేశ్ కు స్వాగతం పలికారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లోకేశ్ ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేశ్ అధ్యయనం చేయనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేశ్ సమావేశమవుతారు. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Nara Lokesh: ఆ ఒక్క ఫోన్ కాల్‌తోనే ఏపీకి గూగుల్: అసలు విషయం చెప్పిన మంత్రి నారా లోకేశ్ 19-10-2025 Sun 17:02 | Andhra ఆస్ట్రేలియాలో నారా లోకేశ్ పర్యటన సిడ్నీలో తెలుగు డయాస్పొరాతో సమావేశం ఏపీకి గూగుల్ సిటీ రావడం వెనుక కేంద్రం సహకారం ఉందని వెల్లడి ప్రధాని జోక్యంతో గూగుల్ కోసం చట్ట సవరణ పవన్‌తో కలిసి 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించడమే లక్ష్యం అంటూ వ్యాఖ్యలుస గూగుల్ ఎంత ముఖ్యమో.. ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని స్పష్టీకరణ రాష్ట్రానికి ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’ రావడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యంతోనే ఇది సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తాను గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కోరినప్పుడు, కేంద్ర చట్టాల్లో కొన్ని సవరణలు అవసరమని వారు చెప్పారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి ఆ చట్టాలను సవరించేలా చేశారని లోకేశ్ వివరించారు. ఈ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్‌లో ఏపీఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్ర ప్రగతి కేవలం గూగుల్ మాత్రమే కాకుండా, కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మాసిటీ వంటి అనేక కీలక ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతోనే రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఆర్సెల్లర్ మిట్టల్ ప్రాజెక్ట్ విషయంలోనూ కేంద్రం ఇలాగే సహకరించిందని, ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను అనకాపల్లికి తీసుకురాగలిగామని అన్నారు. తనకు గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఎంత ముఖ్యమో, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కూడా అంతే ముఖ్యమని లోకేశ్ స్పష్టం చేశారు. పవన్‌తో కలిసి 15 ఏళ్ల ప్రయాణం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తమ పొత్తు ఎంతో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని లోకేశ్ పేర్కొన్నారు. పొత్తుల్లో చిన్న చిన్న సమస్యలు సహజమే అయినా, రాబోయే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని పవన్ పదేపదే చెబుతున్నారని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో పీపీఏలు, ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోయాయని, ఆ చేదు అనుభవం పునరావృతం కాకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలపడమే తమ ఏకైక అజెండా అని, తెలుగువారు మళ్లీ గర్వంగా తలెత్తుకునే రోజులు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రులే మన బ్రాండ్ అంబాసిడర్లు విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "మీరు మీ కంపెనీలలో రాష్ట్రం గురించి మాట్లాడితే, నా కన్నా మార్కెటింగ్ సులభంగా జరుగుతుంది. ఏదైనా కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మా దృష్టికి తీసుకురండి, ఆ డీల్ పూర్తి చేసే బాధ్యత మేం తీసుకుంటాం" అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రవాసాంధ్రుల పెట్టుబడులకు మద్దతుగా ఏపీఎన్ఆర్‌టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దానిని ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్న తెలుగువారికి, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఏపీఎన్ఆర్‌టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని లోకేశ్ తెలిపారు. అనంతరం ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్. జానకీ రామన్, ఏపీఎన్ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.