psycopk Posted October 19 Report Posted October 19 Chandrababu Naidu: దీపావళి వేళ... ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 18-10-2025 Sat 21:43 | Andhra ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల డీఏ పెంపు నవంబర్ 1 నుంచి పెరిగిన డీఏ అమలు ప్రభుత్వంపై నెలకు రూ. 160 కోట్ల అదనపు భారం పోలీసులకు ఈఎల్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళిలోగా ప్రమోషన్లు 60 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య వ్యవస్థల మెరుగుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు. ఉద్యోగులకు ఒక నెల కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పెంచిన డీఏను నవంబర్ 1వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తాజా డీఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ. 160 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి. ఈ ఉత్సాహంతో రేపటి నుంచి మరింత బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పోలీసు సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా రూ. 105 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సింగిల్ ప్రమోషన్‌ను దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను 60 రోజుల్లో క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి కీలక అంశాలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని, ఈ విషయాల్లో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. సంపద సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం, ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Chandrababu Naidu: ఆర్థిక వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తాం: సీఎం చంద్రబాబు 18-10-2025 Sat 22:18 | Andhra ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డాక పీఆర్‌సీ ఇస్తామని స్పష్టమైన హామీ సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేశాకే సీపీఎస్‌పై తుది నిర్ణయం రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని పిలుపు గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఆర్థిక ఇబ్బందులని వెల్లడి దీపావళికి శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ భేటీ అని వ్యాఖ్య "రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది, గూడుపుఠాణీలకు తావులేదు. గత పాలకులు చేసిన అప్పులు, అనుత్పాదక వ్యయం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి రావాలి. ఆర్థిక వెసులుబాటు రాగానే తప్పకుండా పీఆర్‌సీ ఇస్తాం, దీనికి కొంత సమయం పడుతుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను కోరారు. దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి వార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగ సంఘం సహా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర మొత్తం వ్యయంలో 91 శాతం, అంటే రూ.51,452 కోట్లు కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే వెళ్తోందని సీఎం వివరించారు. "గత ఐదేళ్లలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ (38%), తమిళనాడు (42%), కర్ణాటక (39%) తమ వ్యయాన్ని తగ్గించుకుంటే, మన రాష్ట్రంలో మాత్రం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఈ విధ్వంసాన్ని సరిదిద్దేందుకే ప్రజలు కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయాన్ని అందించారు," అని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉందని, ఎప్పటికప్పుడు సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ఉద్యోగులే ప్రధాన రథచక్రాలని, వారు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం పేర్కొన్నారు. "ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఉద్యోగులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యమవుతుంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖకు రావడం సుపరిపాలన వల్లే సాధ్యమైంది. అందరం కలిసి 'ప్రభుత్వం మనది' అనే భావనతో పనిచేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలుపుదాం" అని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ, ఆప్కాస్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే చూస్తున్నామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ఏమన్నాయంటే...! 18-10-2025 Sat 22:26 | Andhra ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు పోలీసు సిబ్బందికి ఈఎల్ సౌకర్యం ప్రకటన సీఎం నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం ప్రభుత్వ చొరవను స్వాగతిస్తున్నామని వెల్లడి గత ప్రభుత్వంలో చర్చలే లేవన్న బొప్పరాజు దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించిన ఆర్టీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. పెండింగ్‌లో ఉన్న ఒక బకాయి కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తున్నట్లు, పోలీసులకు ఈఎల్ (Earned Leave) సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సానుకూల నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉప సంఘానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించడం తెలిసిందే. ఉద్యోగులకు 1 డీఏ పెంపు, పోలీసులకు ఈఎల్ ప్రకటించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు., ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగులకు, పోలీసులకు సీఎం శుభవార్త చెప్పారని కొనియాడారు. ఒక్కో సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి వర్గ ఉప సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ... ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం చొరవచూపిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు కూర్చున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగులతో గత ముఖ్యమంత్రి చర్చించలేదని తెలిపారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ గొప్ప వెసులుబాటు అని బొప్పరాజు అభివర్ణించారు. యూటీఎఫ్ అధ్యక్షుడు కూడా దీనిపై హర్షం వెలిబుచ్చారు. ఉపాధ్యాయులకు ఊరటనిచ్చేలా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మిగిలిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రకటనపై ఆర్టీసీ కార్మిక పరిషత్ కూడా స్పందించింది. సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపడం హర్షణీయమని తెలిపింది. ఒక డీఏ చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని వెల్లడించింది. ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆర్టీసీ కార్మిక పరిషత్ వివరించింది. Quote
psycopk Posted October 19 Author Report Posted October 19 Asalu veedini enduku tolerate chestundi gov?? Jaggadi time lo jeethalu ivaka poina ani musukuna paytm kukka koncham focus peti mundu dismiss cheyali ilanti bewerse yedavalani Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.