Undilaemanchikalam Posted October 27, 2025 Report Posted October 27, 2025 లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? సొంత ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు లక్ష, రెండు లక్షల పనులకు కూడా మా దగ్గర నిధులు లేవు ఎమ్మెల్యేలుగా మా పరిస్థితి చెప్పుకోలేకుండా దారుణంగా ఉంది నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారు.. పెళ్లికి, పేరంటానికి పోవుడు తప్ప చేసేది ఏం లేదు –కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి *********************************** రేవంత్ అవినీతిపై జూపల్లి నజర్ ముదిరిన టెండర్ల వివాదం, ఆర్టీఐ ఆయుధాన్ని ప్రయోగిస్తున్న జూపల్లి కృష్ణారావు రూ.500 కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డితో జూపల్లికి విభేదాలు రేవంత్ రెడ్డి అల్లుడికి టెండర్ కట్టబెట్టే ప్రయత్నంలో ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి బలి ఆగ్రహంతో రేవంత్ రెడ్డి శాఖపై ఆర్టీఐ దాఖలు చేస్తూ వివరాలు సేకరిస్తున్న మంత్రి జూపల్లి రేవంత్ రెడ్డి తన సన్నిహితులకు ఆమోదించిన భూ కేటాయింపులపై ప్రత్యేక నిఘా అన్ని మంత్రిత్వ శాఖల మీద వరుసగా ఆర్టీఐలు వేస్తున్న మంత్రి జూపల్లి గ్యాంగ్ ఏ టెండర్లలో ఎంత కమిషన్లు తీసుకున్నారో చెప్పాలని అధికారులకు బెదిరింపులు సొంత శాఖను కూడా వదలకుండా ఆర్టీఐ దాఖలు చేయడంతో ఆశ్చర్యంలో మంత్రులు. *************************************** ఊరికే నా కుటుంబం మీదనే ఎందుకు నిందలు వేస్తున్నారు.. మీ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా అక్టోబర్ 23న జరిగిన కేబినెట్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై మరియు మంత్రులపై మండిపడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమర్ధవంతంగా వ్యవహరించ లేకపోతున్నారని మహేష్ కుమార్ గౌడ్ పై మండిపాటు పార్టీ విషయాలపై దృష్టి పెట్టడం లేదని, పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో తక్కువ సమయం గడుపుతున్నారని.. పదవి చేపట్టి ఏడాది అవుతున్నప్పటికీ, ఇంకా అన్ని జిల్లాల్లో పర్యటన కూడా పూర్తి చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి ఒక గౌడ్ కి ఎవరు చేయనంత నేను చేసానని.. ఒక పీసీసీ చీఫ్ కి ఎవరు ఇవ్వని ఆడంబరాలు ఇచ్చానని, మంత్రుల కోసం ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్‌ను ఆయనకు ఇచ్చానని, పైలట్ వాహనంతో సహా భద్రత సిబ్బందికి ఇస్తే ఇలా చేయడం ఏంటని చిరాకు పడ్డ రేవంత్ అలాగే మంత్రులపై కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. అధికారిక వ్యవహారాలు ముగిసిన వెంటనే, మంత్రుల ప్రవర్తన ప్రభుత్వానికి మరియు తనకు చెడ్డ పేరు తెస్తోందని హెచ్చరిక నేను మీ అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను.. కానీ మీరు దానిని దుర్వినియోగం చేస్తూ, మీలో మీరు కూడా గొడవ పడుతున్నారు. నేను దీన్ని ఇకపై సహించను. నేను తగిన చర్య తీసుకుంటే నన్ను నిందించవద్దు అని కూడా హెచ్చరించిన ముఖ్యమంత్రి తన సోదరులు, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించడానికి కొందరు నిరంతరం చేసే ప్రయత్నాలను కూడా తప్పుబట్టిన రేవంత్ రెడ్డి చాలా మంది మంత్రుల కుటుంబ సభ్యులు వారు వ్యవహరించే శాఖల వ్యవహారాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని.. నా కుటుంబాన్నే ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.