BattalaSathi Posted November 4 Report Posted November 4 "matladukodaniki" inka vere time/place leva? the attack is sad but these nibba/nibbis need to use common sense..that the time drunkards/ganja batch are out there. Tamil Nadu Sexual Assault: ఎయిర్‌పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు Tamil Nadu Sexual Assault: తమిళనాడులో జరిగిన అత్యాచార ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. By Eenadu 2 min. read View original కోయంబత్తూర్: తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతున్న కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు (Sexual Assault). పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి ఓ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు.. విద్యార్థిని, ఆమె స్నేహితుడితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు తమ వద్ద ఉన్న కొడవలితో ఆ యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను స్పృహ కోల్పోగానే.. వారు ఆ విద్యార్థినిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, నిర్జన ప్రాంతంలో వదిలేసి, అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు తన సెల్‌ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పీళమేడు పోలీసులు అక్కడికి చేరుకొని యువతీయువకులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని (Coimbatore College Student)పై అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టడంతో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితుల ఆచూకీని గుర్తించారు. అయితే పారిపోవడానికి ప్రయత్నించడంతో.. వారి కాళ్లపై షూట్ చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో శాంతిభద్రతలు ఎక్కడ..?: టీవీకే అధినేత విజయ్ ఈ ఘటనను రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలకు సురక్షితమైన నగరంగా పరిగణించే కోయంబత్తూర్‌లో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. మహిళలకు భద్రతలో ద్రవిడ మోడల్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై హింస పెరుగుతోందని ఆరోపించారు. అత్యాచారానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని టీవీకే అధినేత విజయ్ (TVK president Vijay) విమర్శించారు. ‘‘కళాశాల విద్యార్థిని లైంగిక దాడికి గురవడం గురించి తెలిసి హృదయం చలించిపోయింది. అన్నా యూనివర్శిటీలో గతేడాది 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం ఘటనను మరువకముందే మరో దారుణం మన కళ్లముందు నిలిచింది. తమిళనాడులో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి..? ముఖ్యమంత్రి ఎప్పుడు మౌనం వీడతారు..?’’ అని విజయ్ ప్రశ్నించారు. ఈ విమర్శల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.