psycopk Posted November 7 Report Posted November 7 Chandrababu Naidu: ఏపీకి పెట్టుబడుల వెల్లువ... రూ. లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం 07-11-2025 Fri 19:09 | Andhra ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు 12వ SIPB సమావేశంలో కీలక నిర్ణయాలు మొత్తం రూ.1,00,099 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం ఈ పెట్టుబడుల ద్వారా 84,030 మందికి ప్రత్యక్ష ఉపాధి వివిధ రంగాల్లో 26 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఏఎమ్‌జీ మెటల్స్, ఇండిచిప్ సెమీ కండెక్టర్స్ నుంచి భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం, రూ. 1,01,899 కోట్ల విలువైన 26 పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 16 నెలల కాలంలో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తంగా రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. 12వ SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల పూర్తి వివరాలు: 1. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ - రూ.202 కోట్లు - 436 మందికి ఉద్యోగాలు. 2. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.700 కోట్లు - 1,000 మందికి ఉద్యోగాలు. 3. NPSPL అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,081 కోట్లు - 600 మందికి ఉద్యోగాలు. 4. క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్ - రూ.1,154 కోట్లు - 1500 మందికి ఉద్యోగాలు. 5. SCIC వెంచర్స్ ఎల్ఎల్పీ - రూ.550 కోట్లు - 1130 మందికి ఉద్యోగాలు. 6. ఇండిచిప్ సెమీ కండెక్టర్స్ లిమిటెడ్ - రూ.22,976 కోట్లు - 1241 మందికి ఉద్యోగాలు. 7. ఫ్లూయింట్‌గ్రిడ్ లిమిటెడ్ - రూ.150 కోట్లు - 2,000 మందికి ఉద్యోగాలు. 8. మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ - రూ.110 కోట్లు - 700 మందికి ఉద్యోగాలు. 9. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.115 కోట్లు - 2000 మందికి ఉద్యోగాలు. 10. కె.రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,172 కోట్లు - 9,681 మందికి ఉద్యోగాలు. 11. విశాఖ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,200 కోట్లు - 30 వేల మందికి ఉద్యోగాలు. 12. ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.119 కోట్లు - 2,000 మందికి ఉద్యోగాలు. 13. SAEL సోలార్ పీ12 ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1728 కోట్లు - 860 మందికి ఉద్యోగాలు. 14. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ - రూ.7972 కోట్లు - 2,700 మందికి ఉద్యోగాలు. 15. మైరా బే వ్యూ రిసార్ట్స్ - రూ.157 కోట్లు - 980 మందికి ఉద్యోగాలు. 16. విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.51 కోట్లు - 750 మందికి ఉద్యోగాలు. 17. సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1247 కోట్లు - 1,100 మందికి ఉద్యోగాలు. 18. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ - రూ.8570 కోట్లు - 1000 మందికి ఉద్యోగాలు. 19. వాల్ట్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1682 కోట్లు - 415 మందికి ఉద్యోగాలు. 20. ఏఎమ్‌జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ - రూ.44,000 కోట్లు - 3000 మందికి ఉద్యోగాలు. 21. వాసంగ్ ఎంటర్ప్రైజ్ - రూ.898 కోట్లు - 17,645 మందికి ఉద్యోగాలు. 22. బిర్లాను లిమిటెడ్ - రూ.240 కోట్లు - 588 మందికి ఉద్యోగాలు. 23. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రూ.1,090 కోట్లు - 1250 మందికి ఉద్యోగాలు. 24. భారత్ డైనమిక్స్ - రూ.489 కోట్లు - 500 మందికి ఉద్యోగాలు. 25. డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1234 కోట్లు - 1454 మందికి ఉద్యోగాలు. 26. శ్రీవేదా ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.12 కోట్లు - 1500 మందికి ఉద్యోగాలు. Quote
psycopk Posted November 7 Author Report Posted November 7 Chandrababu Naidu: మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు... మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు 07-11-2025 Fri 19:18 | Andhra రూ.1,01,899 కోట్ల విలువైన 26 పరిశ్రమలకు రాష్ట్ర పెట్టుబడుల బోర్డు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 85,570 మందికి ఉపాధి అవకాశాలు గత 16 నెలల్లో మొత్తం రూ. 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న ప్రభుత్వం ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం విశాఖ, అమరావతి, తిరుపతిలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణకు సన్నాహాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం, రూ. 1,01,899 కోట్ల విలువైన 26 పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా (గ్రౌండ్ అయ్యేలా) చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి” అని ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని, నిర్మాణంలో పురోగతి లేకపోతే వాటి అనుమతులు రద్దు చేయాలని సీఎం తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ల తయారీ వంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసి, క్లస్టర్ల వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి, పెట్టుబడులు చేజారకుండా చూడాలన్నారు. “కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు ఆలస్యమైనా, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినవి వెంటనే అందించి పరిశ్రమలను నిలబెట్టాలి” అని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధంగా ఉంచాలని, ప్రైవేటు భూ యజమానులు పరిశ్రమలకు భూములిచ్చేందుకు ముందుకొస్తే వారిని ప్రోత్సహించాలని తెలిపారు. మూడు మెగా సిటీలు... మాస్టర్ ప్లాన్లు రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని సీఎం పునరుద్ఘాటించారు. “అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను, అలాగే అమరావతి, తిరుపతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలి. అమరావతికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతిలకు కూడా వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ నగరాలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రాలుగా తీర్చిదిద్దాలి” అని సీఎం అన్నారు. మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ నగరాలను నివాసయోగ్యంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖకు మరిన్ని కంపెనీలు రానున్నాయని, వాటికి అవసరమైన భూ లభ్యత ఉండేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు కానున్న నేపథ్యంలో, వాటి అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తామని ప్రకటించారు. పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలి ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమలకు వెంటనే శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా ఇతర మంత్రులు వివిధ జిల్లాల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. తాను ఇటీవల జరిపిన విదేశీ పర్యటనల్లో పలువురు పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించానని, వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Quote
psycopk Posted November 7 Author Report Posted November 7 Nara Lokesh: ఏపీలో తెలంగాణకు చెందిన 'ప్రీమియర్ ఎనర్జీస్' వేల కోట్ల పెట్టుబడి: నారా లోకేశ్ ప్రకటన 07-11-2025 Fri 18:27 | Andhra సోలార్ రంగంలో ఏపీకి తరలివచ్చిన భారీ పెట్టుబడి రూ.5,942 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సోలార్ సెల్, వేఫర్ తయారీ ప్లాంట్ ప్రత్యక్షంగా 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు రికార్డు సమయంలో 269 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం దేశంలోనే కీలక సోలార్ తయారీ హబ్‌గా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ సౌరశక్తి పరికరాల తయారీ సంస్థ 'ప్రీమియర్ ఎనర్జీస్' ఏపీలో రూ.5,942 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్‌లో ఈ మెగా సోలార్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 గిగావాట్ల సామర్థ్యంతో టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్, 5 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్ మరియు వేఫర్ తయారీ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు 3,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని లోకేశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు భూ కేటాయింపుల ప్రక్రియను ప్రభుత్వం రికార్డు వేగంతో పూర్తి చేసిందని ఆయన వివరించారు. 2024 అక్టోబర్‌లో కంపెనీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభం కాగా, కేవలం కొద్ది నెలల్లోనే, అంటే 2025 ఫిబ్రవరి నాటికి ఏపీఐఐసీ ద్వారా 269 ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఓడరేవులకు సమీపంలో ఉండటం, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అనుకూల పారిశ్రామిక విధానాల వల్లే ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీని ఎంచుకుందని తెలిపారు. ఈ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ముఖ్యమైన సోలార్ తయారీ కేంద్రంగా (హబ్) మారనుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 7 గిగావాట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీదారు అయిన 'ప్రీమియర్ ఎనర్జీస్'కు ఏపీకి స్వాగతం పలుకుతున్నామని, ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, యువతకు హరిత ఉద్యోగాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. Quote
psycopk Posted November 7 Author Report Posted November 7 Mithali Raj: ఏపీ ప్రభుత్వంపై మిథాలీ రాజ్ ప్రశంసలు... సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు 07-11-2025 Fri 18:11 | Andhra మహిళా క్రికెట్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు యువ క్రీడాకారిణి శ్రీ చరణి ప్రతిభను గుర్తించడం స్ఫూర్తిదాయకమన్న మిథాలీ మంత్రి నారా లోకేశ్ కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన వైనం శ్రీ చరణి విజయం అందరికీ గర్వకారణమని పేర్కొన్న మిథాలీ రాజ్ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ మద్దతుపై హర్షం ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంపై భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ క్రీడాకారిణి మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. యువ క్రీడాకారిణి శ్రీ చరణి సాధించిన విజయాన్ని, ఆమె ప్రతిభను గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ మిథాలీ రాజ్ తన సందేశాన్ని పంచుకున్నారు. "గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారూ... ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్ వృద్ధికి మీరు అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. యువ క్రీడాకారిణి శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనను మీరు అభినందించడం రాష్ట్రంలోని వర్ధమాన అథ్లెట్లందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు. అదేవిధంగా, మంత్రి నారా లోకేశ్ కు కూడా మిథాలీ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. "నారా లోకేశ్ గారూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మీరు అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. శ్రీ చరణి సాధించిన విజయం మనందరికీ గర్వకారణం" అని ఆమె వివరించారు. ఒక దిగ్గజ క్రీడాకారిణి నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో క్రీడలకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు మిథాలీ రాజ్ ప్రశంసలు నిదర్శనంగా నిలుస్తున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. Quote
psycopk Posted November 7 Author Report Posted November 7 Sri Charani: ఏసీఏ కీలక నిర్ణయం.. విశాఖ స్టేడియంలోని ఒక వింగ్‌కు శ్రీ చరణి పేరు 07-11-2025 Fri 19:01 | Andhra ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని కీలక ప్రకటన శ్రీ చరణికి రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం కడపలో ఇంటి స్థలం కేటాయింపుపై సీఎం హామీ త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్న ఏసీఏ ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో శ్రీ చరణి భేటీ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెటర్ శ్రీ చరణికి అరుదైన గౌరవం దక్కింది. విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంలో ఒక వింగ్‌కు ఆమె పేరు పెట్టనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించింది. ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో హర్షం నింపుతోంది. మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంతకుముందు, శ్రీ చరణి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను అభినందించిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. శ్రీ చరణికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ తర్వాత మంగళగిరిలో కేశినేని చిన్ని మాట్లాడుతూ, ఏసీఏ తరపున రాష్ట్రంలోని క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీ చరణికి లభించిన ఈ గౌరవం భవిష్యత్ తరాల క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, రాష్ట్రంలో మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలోనే ఒక మహిళా క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. Quote
yslokesh Posted November 7 Report Posted November 7 LOL.. appatlo TDP NRIs kukkala hadaavidi cheeseevi… NRIs ante ippudu pedda joke. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.