Android_Halwa Posted November 8 Report Posted November 8 Adigo microsoft…idigo google… papam north biharis..!! Quote
psycopk Posted November 8 Author Report Posted November 8 Nara Lokesh: ఇక్కడికి నేను ఏపీ మంత్రిగా రాలేదు... ఒక భారతీయుడిగా వచ్చాను: నారా లోకేశ్ 08-11-2025 Sat 20:48 | National బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రధాని మోదీ, సీఎం నితీశ్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని వెల్లడి ప్రతిపక్షాల 'ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం' హామీ ఎప్పటికీ జరగదని విమర్శ 'ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త' అనేది ఎన్డీయే లక్ష్యమని స్పష్టీకరణ ప్రతిపక్షాలు పరాధీనతను, తాము సాధికారతను నమ్ముతామని వ్యాఖ్య బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాట్నాలో పర్యటించిన ఆయన, రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి మళ్లీ అధికారం కట్టబెట్టాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాల హామీలపై విమర్శలు గుప్పించారు. "నేను బీహార్ రావడం ఇదే మొదటిసారి. ఇక్కడికి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రాలేదు, ఒక భారతీయుడిగా వచ్చాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది" అని లోకేశ్ అన్నారు. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసేందుకే తాను వచ్చానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి 'ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త' అనే నినాదంతో ముందుకు వెళుతోందని లోకేశ్ పేర్కొన్నారు. కానీ, బీహార్‌లోని ప్రతిపక్షాలు 'ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం' ఇస్తామని హామీ ఇస్తున్నాయని, అది నిజాయితీగా చెప్పాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని విమర్శించారు. "ప్రతిపక్షాలు ప్రజలను పరాధీనంగా మార్చాలని చూస్తున్నాయి. అందుకే ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు. మేము ఎన్డీయేలో సాధికారతను నమ్ముతాం. అందుకే మా నినాదం, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త" అని లోకేశ్ వివరించారు. ఎన్నికల తొలి దశలో మాదిరిగానే, రాబోయే దశలోనూ ఎన్డీయే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని, బీహార్‌లో మళ్లీ ఎన్డీయే జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Quote
RaaaOne Posted November 8 Report Posted November 8 Maaki chooth paaye bodi paaye ippudu kaallu pattukunnadu Quote
anna_gari_maata Posted November 9 Report Posted November 9 Wonder what's TDP strategy is Congress wins Bihar considerably Quote
psycopk Posted November 9 Author Report Posted November 9 Nara Lokesh: ఎన్డీయేను గెలిపిస్తే బీహార్ సర్వతోముఖాభివృద్ధి.. బీహార్ ఓటర్లకు నారా లోకేశ్ విజ్ఞప్తి 09-11-2025 Sun 13:04 | National ఎన్డీయే కూటమి తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది.. బీహార్ లో అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక నితీశ్ కుమార్ ప్రభుత్వం వచ్చాకే బీహార్ లో పెద్దఎత్తున అభివృద్ధి వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర కీలకమైందని వ్యాఖ్య పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేశ్ ‘‘‘ఒక్క ఛాన్స్” పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీకి అవకాశం ఇచ్చి తీవ్రంగా నష్టపోయారు.. ఆ ఒక్క ఛాన్స్ వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఒక్క ఛాన్స్ వల్ల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. మొత్తంగా ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అదే పరిస్థితిని మీరు కొనితెచ్చుకోవద్దు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకం. బీహార్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి మరోమారు ఎన్డీయేను గెలిపించండి’ అంటూ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బీహార్ యువతకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే కూటమి తరఫున మంత్రి లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నేను ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుత భారతీయ పౌరుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకం. బీహార్ యువత మరోమారు ఎన్డీయేను ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్డీయేను గెలిపించాలి” అని మంత్రి పేర్కొన్నారు. ఆ మూడు కారణాలు ఇవే.. లీడర్ షిప్ ట్రాక్ రికార్డు స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్డీయేను గెలిపించాలి. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్ లో నాని (నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్) నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోదీ, నాయుడు గారి నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మోదీ లక్ష్యం. డబుల్ ఇంజన్ సర్కారు బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్డీయే ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారం కలుగుతుంది. ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీశ్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మొద్దు బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోందని, అలాంటి ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్మొద్దంటూ బీహార్ యువతకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారత జాతి బలోపేతమవుతుందని అన్నారు. ఎన్డీయే భాగస్వామిగా డబుల్ ఇంజన్ సర్కారు వల్ల బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేశ్ చెప్పారు. కాగా, ఈ సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీశ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. Quote
Android_Halwa Posted November 9 Report Posted November 9 1 hour ago, psycopk said: Ela ante…donga votlu guddi sadinchinatta ? Quote
HighlyRespected Posted November 9 Report Posted November 9 9 hours ago, anna_gari_maata said: Wonder what's TDP strategy is Congress wins Bihar considerably A care...TDP just need full cooperation from pushpams this term for the sake of ap development... 2029 lo pushpams defanilty gone case ....if TDP wins it stays neutral..no anti congress agenda Quote
yslokesh Posted November 9 Report Posted November 9 On 11/8/2025 at 9:41 AM, psycopk said: Assam elections pampisthe symbolism perfect gaa set ayyeedhi kadha Quote
psycopk Posted November 9 Author Report Posted November 9 Nara Lokesh: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ 09-11-2025 Sun 14:55 | National పాట్నాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో లోకేశ్ భేటీ బీహార్ ఎన్నికల వ్యూహాలపై చర్చించిన నేతలు ఎన్డీఏ గెలుపునకు ప్రధాన్ కృషిని కొనియాడిన లోకేశ్ ఒడిశా, హర్యానా ఎన్నికల్లో ఆయన పాత్ర అమోఘమన్న మంత్రి బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని ధీమా ఎన్డీయే తరఫున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాట్నాలో సమావేశమయ్యారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని లోకేశ్ వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆయన స్వయంగా పంచుకున్నారు. బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు లోకేశ్ తెలిపారు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రధాన్ అహరహం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. "గతేడాది జరిగిన హర్యానా, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపులో ప్రధాన్ గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీహార్‌లో మరోమారు ఎన్డీఏ సర్కారును గెలిపించేందుకు ఆయన చేస్తున్న నిర్మాణాత్మక కృషిని ఈ సందర్భంగా అభినందించాను" అని లోకేశ్ పేర్కొన్నారు. బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ పాలన వైపే మొగ్గు చూపుతున్నారని, ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. Quote
psycopk Posted November 9 Author Report Posted November 9 Nara Lokesh: 'ఒక్క ఛాన్స్' పొరపాటు వద్దు: బీహార్ ఓటర్లకు నారా లోకేశ్ పిలుపు 09-11-2025 Sun 20:14 | National బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో అవసరమని వ్యాఖ్య ఏపీలో వైసీపీకి ఛాన్స్ ఇవ్వడంతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆరోపణ నితీశ్ కుమార్ పాలన కొనసాగాలని బీహార్ ప్రజలకు విజ్ఞప్తి వికసిత భారత్ లక్ష్య సాధనలో బీహార్ పాత్ర కీలకమని వెల్లడి బీహార్ రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే, అక్కడ మరోసారి ఎన్డీయే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తోనే ఇది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి చివరి రోజైన ఆదివారం నాడు ఆయన పాట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం బీహార్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని, ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వ మార్పు జరిగితే మొత్తం ప్రక్రియ గాడి తప్పుతుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ తప్పిదాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. "మా రాష్ట్రంలో 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి' అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చింది. వారు పాలన చేపట్టిన తర్వాత అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. పెట్టుబడులు ఆగిపోయాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి" అని లోకేశ్ హితవు పలికారు. "బీహార్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిసి పనిచేస్తేనే బీహార్ కలలు సాకారమవుతాయి. ప్రస్తుతం అభివృద్ధి అనే విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది. ఇది ఆగిపోవాల్సిన సమయం కాదు. అందుకే, మా కూటమికి ఐదోసారి అధికారం ఇవ్వండి. మేమంతా కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కాకముందు బీహార్‌లో 'జంగిల్ రాజ్' నడిచిందని లోకేశ్ గుర్తుచేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాతే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. "నేను పాట్నాలోని పారిశ్రామికవేత్తలతో మాట్లాడాను. ఇక్కడి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి పనులపై వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు అత్యధిక నిధులు కేటాయించారు. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన వివరించారు. ప్రధానంగా మూడు కారణాల వల్ల బీహార్‌లో ఎన్డీయే గెలవాల్సిన అవసరం ఉందని లోకేశ్ నొక్కిచెప్పారు. నాయకత్వ పనితీరు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ప్రభుత్వాల కొనసాగింపు అనేవి రాష్ట్ర పురోగతికి కీలకమన్నారు. 'వికసిత భారత్' లక్ష్యాలను చేరుకోవడంలో బీహార్ పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం యువత ఎన్డీయే విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా లోకేశ్ బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. రాష్ట్రాలు బలపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సరైన సమయంలో దేశ ప్రజలు సరైన నాయకుడిని ప్రధానిగా ఎన్నుకున్నారని, ఫలితంగా గత దశాబ్ద కాలంలో భారత్ అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.