Jaggadonga Posted November 10, 2025 Report Posted November 10, 2025 Delhi red fort area lo full janalu. Alanti chota pelcharu galeez badcows. If this is done by mussi, a dead people lo kuda sagam mussi le vuntaru. Don't know when these fickle minded people understand that Quote
psycopk Posted November 10, 2025 Report Posted November 10, 2025 Vangalapudi Anitha: ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్... ఏపీ వ్యాప్తంగా హై అలర్ట్ 10-11-2025 Mon 23:52 | Andhra రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశం భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీకి స్పష్టమైన సూచనలు తిరుపతి, కృష్ణా జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో విస్తృత తనిఖీలు రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన పేలుళ్ల ఘటన ఆంధ్రప్రదేశ్‌ను అప్రమత్తం చేసింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోంమంత్రి ఆదేశాల మేరకు డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల దృష్ట్యా భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని, అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అనిత పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని సున్నితమైన, రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం హోంమంత్రి ఆదేశాలతో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మాల్స్, హోటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసమ్మర్దం ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 112కు సమాచారం అందించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి, కృష్ణా జిల్లాల పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, తిరుమల వసతి గృహాలతో పాటు అలిపిరి టోల్‌గేట్, నడక మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు బస్టాండ్, లాడ్జిల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ ప్రాంతంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ల సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ కారిడార్ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే... వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చేపలు వేటకు వెళ్ళే మత్యుకారులను ఆదేశించారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో వేటకు వెళ్ళినప్పుడు.. కొత్త ఏమైనా బోట్లు కనిపిస్తే వేంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. 1 Quote
psycopk Posted November 10, 2025 Report Posted November 10, 2025 Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన... ఆత్మాహుతి దాడిగా పోలీసుల అనుమానం... రంగంలోకి ఎన్ఐఏ 10-11-2025 Mon 22:48 | National ఎర్రకోట సమీపంలో పేలుడు 8 మంది మృతి, 24 మందికి తీవ్ర గాయాలు కదులుతున్న వాహనంలోనే పేలుడు జరిగినట్టు నిర్ధారణ పరిస్థితిని సమీక్షించిన అమిత్ షా... రంగంలోకి ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ ఉదయం ఉగ్రముఠా అరెస్ట్, సాయంత్రం పేలుడు... కుట్ర కోణంపై దర్యాప్తు ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో హై అలర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఆత్మాహుతి దాడి అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో 8 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కదులుతున్న వాహనంలోనే ఈ పేలుడు జరగడంతో దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 6:52 గంటల సమయంలో ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగినప్పుడు వాహనంలో మనుషులు ఉన్నారని ఆయన ధృవీకరించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో ఆరు కార్లు, రెండు రిక్షాలు, ఒక ఆటోరిక్షా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోంమంత్రితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించిన జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఓ భారీ ముఠాను భద్రతా బలగాలు సోమవారం ఉదయం పట్టుకున్నాయి. ముగ్గురు డాక్టర్లతో సహా 8 మందిని అరెస్ట్ చేసి, 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, మెట్రో ప్రాంగణాల్లో నిఘా పెంచారు. ముందుజాగ్రత్త చర్యగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించి, కీలక ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.