Jump to content

Recommended Posts

Posted

కన్న కూతుర్ని ఆయన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు. ఆ రోజుల్లోనే కూతురికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. కూతుర్ని ఆధునిక యువతిగా తయారు చేసేందుకు పరితపించాడు. కానీ, కంటి రెప్పలా కాపాడుకుంటున్న కూతురు కామాంధుల అరాచకానికి బలైపోతే.. చనిపోయే ముందు తన పగను తీర్చాలంటూ తండ్రిని వేడుకుంటే..!
అతడేం చేస్తాడు?
కంటి ముందు పెరిగిన కూతురు.. చిన్న వయసులోనే కాటికి పయనమైతే, దీనికి కారణమైన వారిని ఏం చేశాడు? పగను తీర్చుకుని.. తనను తాను విజేతగా ప్రకటించుకున్న ఒక కన్న తండ్రి నిజ జీవిత కఠోర వాస్తవ గాథ ఇది!

కన్న కూతురిని తెలిసిన వాళ్లే రేప్ చేస్తే.. ఆ వేదనతో తను ఆత్మహత్యకు పాల్పడితే..ఆ దుర్మార్గుల కు తన చేతులతోనే మరణశాసనం రాశాడా తండ్రి.

ప్రకాశం జిల్లా ఒంగోలులో చికోదండరామిరెడ్డి అలియాస్ టిప్ టాప్ రెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు. అతను డ్రై క్లీనింగ్ షాపు నిర్వహించి, డబ్బు బాగా సంపాదించి.. టిప్ టాప్ రెడ్డిగా ఎదిగాడు. తన కూతుర్ని ఆ కాలంలోనే అల్ట్రా మోడ్రన్‌గా పెంచడానికి -- రెడ్డి ప్రయత్నించాడు. ఆ అమ్మాయిని ఒంగోలు హైదరీక్లబ్‌లో టెన్నిస్ నేర్చుకునేందుకు చేర్పించాడు.

అక్కడ సింగ్ అనే యువకుడు ఆ అమ్మాయి కోచ్‌గా వ్యవహరించేవాడు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. సింగ్ అక్కడితో ఊరుకోలేదు. తన ఫ్రెండ్స్ అయిన ఆర్టీసీ డీఎం కొడుకు, నెల్లూరుకు చెందిన ఇంకో అబ్బాయితో కలిసి అమ్మాయిని కొత్తపట్నంబీచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ బీర్‌లో మత్తు మందు కలిపి అమ్మాయి చేత తాపించారు. తర్వాత, ఆ అమ్మాయిని ముగ్గురు కలిసి రేప్ చేసి.. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఈ తర్వాత రోజు అమ్మాయి ఇంటికొచ్చింది. జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నాలుగు రోజుల పాటు అమ్మాయి ముభావంగా ఉంది. జరిగిన విషయం తండ్రికి తెలియదు. తర్వాత నాలుగో రోజు ఓ లేఖ రాసి, అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య లేఖలో.. ‘‘నాన్న నన్ను చాలా దారుణంగా ముగ్గురు కలిసి రేప్ చేశారు.వాళ్లను వదలొద్దు’’ అని రాసింది. ఈ లెటర్ విషయం ఎవరికీ తెలియదు.. అమ్మాయి తండ్రి కోదండ రామిరెడ్డికి మాత్రమే తెలుసు!

పోలీస్ కానిస్టేబుల్‌గా సింగ్ :

ఆ అమ్మాయిని ఇలా చేసిన సింగ్.. అనుకోకుండా, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. అతడు దర్శికి ట్రైనింగ్‌కు వెళ్లిపోయాడు. ఆర్టీసీ డీఎం-- తన కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడం తో నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో చేర్పించాడు.

ఇదే సమయంలో టిప్ టాప్ రెడ్డి.. తన కూతురిపై అరాచకానికి పాల్పడ్డ వారిపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. గుంటూరు వెళ్లి శ్రీనివాస్, చైతన్య అనే ఇద్దరు యువకులను కలిశాడు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని ఈ యువకులకు చెప్పాడు. నేను చెప్పినట్లు వింటే, మీకు కావాల్సినవి చేస్తానని వాళ్లకు చెప్పాడు. దీంతో ఆ యువకులు కూడా ఇంత దారుణమైన అన్యాయం జరిగిందా అని బాధపడుతూ టిప్ టాప్ రెడ్డి పగ తీర్చేందుకు సాయం చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో - రెడ్డి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఇద్దరినీ అందులో ఉంచారు. కొద్ది కాలం పాటు పరిస్థితులను గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు.. అమ్మాయిని రేప్ చేసిన నిందితులను ట్రాప్ చేశారు.

తొలుత కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయిన సింగ్‌తో ఇద్దరు ఫ్రెండ్‌షిప్ చేశారు. తర్వాత, ఓ రోజు ట్రైనింగ్ నిమిత్తం సింగ్ దర్శి వెళ్తుండగా.. ఇద్దరూ కలిసి అతడిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకున్నారు. ఒక స్పాట్ దగ్గరకు వెళ్లాక.. అప్పటికే గొయ్యి తీసిపెట్టి ఆ ప్రదేశంలో రెడ్డి రెడీగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన వెంటనే.. ‘‘నా కూతుర్ని నమ్మించి మోసం చేసి, తన బతుకు నాశనం చేస్తార్రా ’.. అని ఆవేశంతో ఆక్రోశంతో ఊగిపోతూ - సింగ్ మెడను ఉచ్చుతో బిగించి చంపేసి, ఆ గోతిలో వేసిపూడ్చేశాడు.
అప్పడు సరిగా కమ్యూనికేషన్ లేకపోవడంతో.. సింగ్ తల్లిదండ్రులు తమ కుమారుడు ట్రైనింగ్‌కు వెళ్లాడని అనుకున్నారు.. కానీ, అతడు ట్రైనింగ్ క్యాంప్‌లో లేడు..
పైకి పోయాడు..!

రెండో వాడికి కూడా పక్కా ప్లాన్ :

సింగ్‌ను చంపేసిన తర్వాత రెండో వాడిపై పగ తీర్చుకునేందుకు టిప్ టాప్ రెడ్డి సిద్ధమయ్యాడు. రెండో వాడు - ఆర్టీసీ డీఎం కొడుకు. డీఎంకు తన కొడుకు ఊళ్ళో ఉంటే జీవితంలో పనికి రాడని భావించి.. నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్‌ భారతి డిగ్రీ కాలేజీలో చేర్పించాడు. దీంతో ఇద్దరు గుంటూరు యువకులు కావలి వెళ్లి, కాలేజీలో చదువుతున్న అతడిని ట్రాప్ చేశారు. అతడికి మద్యం అలవాటు ఉండటంతో చాలా తొందరగానే ఫ్రెండ్‌షిప్ కుదిరింది.

తర్వాత, ముగ్గురు కలిసి మద్యం పార్టీలు చేసుకునే వారు. ఈ క్రమంలోనే ఒక రోజు హాస్టల్‌లోని అతడిని ఒక రూంకి స్కూటర్‌పై వచ్చారు. మందు పార్టీ ఉంది రావాలని, డీఎం కొడుకును రమ్మన్నారు. కరేడు అనే సముద్రతీర గ్రామంలో పార్టీ ఉందని చెప్పారు. అయితే, అతడి రూమ్‌మెట్స్ మాత్రం రేపు పరీక్షలు ఉన్నాయి.. ఎలా పోతావు అంటున్నారు. కానీ, ఫూటుగా మద్యం అలవాటు ఉన్న ఆ యువకుడు, మద్యం మోజులో పడి వాళ్ల వెంట వెళ్లాడు. ఈ సమయంలోనే అనుకోకుండా యువకుడి రూమ్‌మేట్ స్కూటర్ నంబర్ నోట్ చేసి పెట్టాడు.

అచ్చం సింగ్ మాదిరిగానే..
ఇలా ముగ్గురు స్కూటర్‌పై బయల్దేరారు. కరేడు దగ్గర రాజుపాలెం అనే గ్రామం వద్దకు రాగానే.. అప్పటికే టిప్ టాప్ రెడ్డి గొయ్యి తీసి రెడీగా ఉన్నాడు. వీళ్లు రాగానే, సింగ్‌ను చంపిన మాదిరిగానే..ఈ యువకుడి ని కూడా గొంతు పిసికి చంపేసి.. గోతిలో పాతిపెట్టేశారు.

దీంతో ఆర్టీసీ డీఎం తన కొడుకు కనిపించడం లేదని గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో కానిస్టేబు‌ల్‌గా సెలెక్ట్ అయిన తమ కొడుకు సింగ్ కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులు దాదాపు నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేశారు. నెల రోజులుగా ట్రైనింగ్ సెంటర్‌లో ఆబ్సెంట్ ఉండటంతో అనుమానం వచ్చింది.

ఏం జరిగిందో అని పూర్తి స్థాయి విచారణ చేపట్టగా.. అప్పుడు స్కూటర్ నంబర్ దొరికింది. ఆ స్కూటర్ చెంచురామయ్య అనే ఓ డాక్టర్‌ది..! ఆయనకు తెలియకుండా టిప్ టాప్ రెడ్డి.. ఈ స్కూటర్‌ను యువకులకు ఇప్పించాడు. చెంచురామయ్య దగ్గరకు వెళ్లి విచారిస్తే.. స్కూటీ తనదేనని, టిప్ టాప్ రెడ్డి తీసుకెళ్లాడని చెప్పాడు. వెంటనే రెడ్డి దగ్గరికి వెళ్లి విచారించగా, అసలు నిజం ఒప్పుకున్నాడు.

హత్యలు చేసింది తానేనని రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేయబోతుండగా.. ‘‘సార్, ఒక్క రోజు టైం ఇస్తే.. ఇంకోకడు ఉన్నాడు, వాడిని కూడా చంపేసి వస్తాను’’ అని చెప్పాడు. పోలీసులు - తమ వృత్తి ధర్మం ఒప్పుకోదని చెబుతూ అతనని అరెస్ట్ చేశారు!

కానీ, విచారణలో తేలింది ఏమంటే.. ఆ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారు. ఈ మూడో వ్యక్తి పక్కన ఉన్నాడు. అమ్మాయిని రేప్ చేసిన ఇద్దర్నీ అమ్మాయి తండ్రి చంపేశాడు. దీంతో అమ్మాయికి నేచురల్ జస్టిస్ జరిగిపోయింది. మూడో వ్యక్తి చూశాడు గానీ, రేప్ చేయలేదు.. అతడు తప్పించుకున్నాడు.

టిప్ టాప్ రెడ్డిని అరెస్టు చేశారు.చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు.ఇప్పుడు ఒంగోలులో సీతారామదేవాలయం కట్టించి అక్కడే ఉంటున్నారు.

ఈ కధ విని - దీని Inspiration తో "సర్పయాగం " కధ రాసుకుని - శోభన్ బాబుతో సినిమా తీశారు పరుచూరి బ్రదర్స్. వారే దర్శకత్వం వహించారు. డి. రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ' శోభన్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

  • Upvote 1
Posted

I belive katari krishna ni hire chesukunadu anukunta for this murder
oka interview lo cheppadu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...