psycopk Posted November 14 Report Posted November 14 Nara Lokesh: సస్పెన్స్‌కు తెరదించిన మంత్రి లోకేశ్.. ఏపీకి రూ.1.1 లక్షల కోట్ల మెగా ఇన్వెస్ట్మెంట్ 14-11-2025 Fri 09:17 | Andhra ఏపీకి రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న బ్రూక్‌ఫీల్డ్ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా వెల్లడి పునరుత్పాదక ఇంధనం, సోలార్ తయారీ రంగాల్లో ప్రధానంగా పెట్టుబడులు డేటా సెంటర్లు, పోర్టులు, రియల్ ఎస్టేట్‌లోనూ విస్తరణ ఈ పెట్టుబడితో ఏపీ గ్లోబల్ హబ్‌గా మారుతుందన్న లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిన్న చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ రాష్ట్రంలో ఏకంగా 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.1 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చరిత్రాత్మక పెట్టుబడితో ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు వేయనుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజ్, సోలార్ తయారీ, ఇతర డీకార్బనైజేషన్ కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్టు లోకేశ్ తన ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు డేటా సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), మౌలిక సదుపాయాలు, పోర్టుల వంటి విభిన్న రంగాల్లోనూ బ్రూక్‌ఫీల్డ్ పాలుపంచుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌కు బ్రూక్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థను స్వాగతించడం గర్వంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిర, పరివర్తనాత్మక పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్రంలోకి ఓ పెద్ద అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టబోతోందంటూ లోకేశ్ కొద్ది రోజుల క్రితం పరోక్షంగా ట్వీట్ చేయడంతో పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బ్రూక్‌ఫీల్డ్ పేరును, పెట్టుబడి వివరాలను వెల్లడించడంతో ఆ సస్పెన్స్‌కు తెరపడినట్టయింది. Quote
GOne Posted November 14 Report Posted November 14 Fake ooo fake, dongava dochuko, em ettukelathavo em paado mottam amaravthi ni dochukuntunnaru Quote
psycontr Posted November 14 Report Posted November 14 Every week ke oka laksha kotla investment. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.