Jump to content

Recommended Posts

Posted

 

Satish Kumar: తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి.. తాడిపత్రి రైల్వే ట్రాక్‌పై మృతదేహం

14-11-2025 Fri 13:09 | Andhra
TTD Parakamani Case Key Figure Satish Kumar Found Dead
 
  • తాడిపత్రి రైల్వే ట్రాక్‌పై టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతదేహం
  • గతంలో డాలర్ల దొంగతనంపై ఫిర్యాదు చేసింది సతీశ్ కుమారే
  • విచారణ వేళ ఆయన మృతి చెందడంపై పలు అనుమానాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సహాయ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్వో) సతీశ్‌ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై ఆయన విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ బృందం విచారిస్తుండగా, దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లను రవికుమార్‌ అనే వ్యక్తి దొంగిలించాడని ఆరోపిస్తూ అప్పటి ఏవీఎస్వోగా ఉన్న సతీశ్‌ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, అనూహ్యంగా సతీశ్‌ కుమార్ కోర్టులో ఆ కేసును రాజీ చేసుకున్నారు. కొందరు రాజకీయ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆయన రాజీకి అంగీకరించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ రాజీ వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసు తిరిగి విచారణకు వచ్చింది. ప్రస్తుతం సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో, కేసులో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న సతీశ్‌ కుమార్ రైల్వే ట్రాక్‌పై శవమై తేలడం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో పరకామణి కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 
Previous articleNext article

 

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    17

  • southyx

    12

  • Android_Halwa

    3

  • Jack123

    2

Posted

feeling sorry for him.  Same formula or whatever formula doesn't matter.. hathya raajakeeyalu inka ennallu chestarra babu

Posted
🚨🚨🚨🔥🔥🔥🔥🔥
వివేకా కేసులో సాక్ష్యుల వరుస మరణాలు
* కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో విషపుగుళికలు మింగి ఆత్మహత్య. శ్రీనివాసులరెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసు.
* వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబరులో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.
* వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్ లో అనారోగ్యంతో మృతి చెందారు. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన, కొద్ది రోజులకే పోయాడు.
* వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్ మన్ బి.రంగన్న అనారోగ్యంతో పోయాడు
* వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డా.వైఎస్ అభిషేక్ రెడ్డి ఒకరు. వివేకాది దారుణమైన హత్య అంటూ మొదట చెప్పింది ఇతనే.. స్వయంగా జగన్ తమ్ముడు.. 30 ఏళ్ళకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. ఇప్పటికీ ఆ జబ్బు ఏంటో వైఎస్ ఫ్యామిలీ బయటకు చెప్పలేదు
* వివేకా మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్ గా పోయాడు.. అనారోగ్యం అని చెప్పారు.. శవం చుస్తే, నెత్తి కింద రక్తం మరకలు ఉన్నాయి.. ఇది మరో మిస్టరీ
🚨🚨🚨
పరిటాల రవి కేసులో సాక్ష్యుల వరుస మరణాలు
* రెండో నిందితుడు మొద్దు శీను 2008 నవంబర్ 9న అనంతపురం జిల్లా జైల్లో హతమార్చారు. అప్రూవర్‌గా మారతానని చెప్పిన శీనుతోపాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓంప్రకాశ్‌ అతణ్ని సిమెంట్‌ డంబెల్‌తో కొట్టిచంపాడు
* మద్దెలచెరువు సూరి. 2011 జనవరి 3న అతణ్ని హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో చంపారు. బెయిల్‌పై ఏడాదికే బయటకొచ్చిన సూరిని అతని అనుచరుడైన భానుకిరణే కాల్చిచంపాడు.
* పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా కాల్పుల్లో పాల్గొన్నాడని గ్యాంగ్స్టర్ అజీజ్రెడ్డి ని రాజశేఖర్ రెడ్డి 2008 మే 1న ఎన్కౌంటర్ చేపించాడు.
* పరిటాల కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లాక మృతదేహానికి రీపోస్ట్మార్టం బృందంలో ఉన్న మల్లికార్జున రైల్లోంచి దూకి పోయాడు
* జైలు వైద్యుడు డాక్టర్‌ సాంబశివరావు సూరికి సెల్‌ఫోన్లు అందించేవారని, వాటిలో మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశారనే ఆరోపణలున్నాయి. రవి మర్డర్ జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
* ఓం ప్రకాశ్‌ జగన్ ప్రభుత్వంలో అనారోగ్యంతో పోయాడు
ఇలా పరిటాల మర్డర్ కేసులో సాక్షులు, పాత్రధారులు, డాక్టర్లు, అధికారులు కూడా పోయారు..
Posted
పరిటాల రవి గారి హత్య కేసులో FIR లో పేరు వున్నా నాయన అధికారం పలుకుబడి ఉపయోగించి సిబిఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్న అనుభవం..
పైగా ఆ కేసులో సాక్షులు బాధ్యులు చాలా మంది అనుమానాస్పదంగా మరణించినా అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కున్న అతను మాత్రం నాటి నుంచి నేటి వరకు పెద్ద మనిషిగా చెలామణి కాగలుగుతున్నాడు..
స్వయానా చిన్నాన్న దారుణంగా హత్య కావించబడినా ముందు దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు..
కాదు అనుకున్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు..
హత్య జరిగి నేటికి 6 సంవత్సరాల 7 నెలల 29 రోజులు గడిచినా ఇప్పటికి ఇంకా దర్యాప్తు కూడా పూర్తి కాకుండా చూసుకుంటున్నారు..
పైగా తన మీద నమోదు అయిన 11 సీబీఐ కేసుల్లో నేటికి 12 సంవత్సరాల 1 నెల 21 రోజులుగా బెయిలు మీద కొనసాగుతూ ఉంటూ కూడా ఇప్పటి వరకు కేసులు విచారణ కూడా మొదలు కాకుండా చూసుకుంటున్న వ్యక్తి నాయకత్వంలో పని చేస్తున్న వారికి..
పరకామణి కేసులో విచారణకు హాజరు కావాల్సిన అధికారిని గుట్టు చప్పుడు కాకుండా లేపేయడం పెద్ద పనా?
చట్టం అన్నా దర్యాప్తు సంస్థలు అన్నా న్యాయస్థానాలు అన్నా కేసులు అన్నా భయం కానీ భక్తి కానీ లేని బరితెగింపు ముఠా కి సాక్షులను లేపేయడం అంటే చిటికె వేసినంత సునాయాస ప్రక్రియ..
 
Posted

Doctors confirm he is murdered… ycp pressmeet peti mari sucicide ani pracharam chestunaru..

anita act fast

Satish Kumar: పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ కుమార్ ది హత్యే... డాక్టర్ల ప్రాథమిక నిర్ధారణ 

14-11-2025 Fri 21:26 | Andhra
Satish Kumar Murdered Doctors Confirm
 
  • పోస్టుమార్టంలో వెలుగులోకి వచ్చిన కీలక నిజాలు
  • తల వెనుక గొడ్డలితో నరికినట్లు గుర్తింపు
  • శరీరంలో పలుచోట్ల విరిగిన ఎముకలు
  • దర్యాప్తు కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు
  • తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై లభ్యమైన మృతదేహం
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన సతీశ్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆయనది ప్రమాదవశాత్తు మరణం కాదని, పక్కా హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీశ్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో నరికి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రత్యేక అనుమతితో అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సతీశ్ కుమార్ మృతదేహానికి శుక్రవారం శవపరీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సీటీ స్కాన్ కూడా చేశారు. పోస్టుమార్టంలో సతీశ్ శరీరంలోని పలుచోట్ల ఎముకలు విరిగిపోయినట్లు, తీవ్ర గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య ఆయన మృతి చెంది ఉండవచ్చని అంచనా వేశారు.

పరకామణి కేసు విచారణకు హాజరయ్యేందుకు సతీశ్ కుమార్ గురువారం రాత్రి గుంతకల్‌లో రైలు ఎక్కారు. అయితే, అనూహ్యంగా తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాల పక్కన ఆయన శవమై కనిపించడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ స్వయంగా దగ్గరుండి పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కేసును ఛేదించేందుకు 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సతీశ్ కుమార్ ఫోన్ ను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

గతంలో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన సతీశ్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లులో జీఆర్ పీ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు.
Posted
13 hours ago, nag said:

feeling sorry for him.  Same formula or whatever formula doesn't matter.. hathya raajakeeyalu inka ennallu chestarra babu

Hanthakulani, kula gula gaallani janalu abhimaninchadam maneyyali.. 

Posted

wondering one day sharmila son raja reddy becomes strong and becomes krishna and kills mama Kamsa !

@psycopk 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...