Jump to content

Parakamani TTD Sakshi ni champetam endhira worst fellows


Recommended Posts

Posted
1 hour ago, Teluguredu said:

Manchi story to connect that guy with karukanar reddy ,inkenduku late give those solid proofs to investigation team and get him arrested 

Vaadini ante neekenduku uncle?

1 hour ago, Android_Halwa said:

Wow…As usual news papers links as proofs..!!

 

Inkem kaavali?

Posted
1 hour ago, Android_Halwa said:

Wow…As usual news papers links as proofs..!!

 

Nee lekka langa theories aithe septhaledu ga, lol ra ayya. atleast he has proof to substantiate the claims.

Posted
2 minutes ago, Teluguredu said:

Family members caste pilupu istaara lol.

Meeru Kandukur lo Kamma Vs Kaapu, East Godari lo Kaapu Vs Dalitulu, pastor Praveen death issue lo Christian, Dalit card play chesinappudu undali siggu.

Posted
9 minutes ago, southyx said:

Meeru Kandukur lo Kamma Vs Kaapu, East Godari lo Kaapu Vs Dalitulu, pastor Praveen death issue lo Christian, Dalit card play chesinappudu undali siggu.

Asalu nenu cheppindhi enti nuvvu cheppindhi enti ,family members caste gurinchi enduke maatladathaaru ,varasa cheppukuntaaru kaani. Ee panikimaalia sodhi evaradigaaru.

Posted
5 minutes ago, Teluguredu said:

Asalu nenu cheppindhi enti nuvvu cheppindhi enti ,family members caste gurinchi enduke maatladathaaru ,varasa cheppukuntaaru kaani. Ee panikimaalia sodhi evaradigaaru.

They are scared. They are taking help from their community.

Posted
43 minutes ago, akkum_bakkum said:

Nee lekka langa theories aithe septhaledu ga, lol ra ayya. atleast he has proof to substantiate the claims.

Murder ki proof gurinchi ae na ?

Posted
41 minutes ago, southyx said:

Meeru Kandukur lo Kamma Vs Kaapu, East Godari lo Kaapu Vs Dalitulu, pastor Praveen death issue lo Christian, Dalit card play chesinappudu undali siggu.

Aha…

Posted
2 hours ago, GOne said:

Arey endi raa idi, after all oka employee intha chesthe, enthamandi employees, govt employees contractors mla lu mp lu cops entha thintunnarra ayya

Govt appicers easy ga datestaru politicos ni corruption lo. Vallu election ki inakarchupettali, odipothe em undadu. Vellaki 24 hrs ade duty.

Posted

Satish Kumar: గుట్టు బయటపడుతుందని భయపడ్డారా?

 

సతీష్‌ అడ్డులేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా?
సీఐడీ విచారణకు వెళ్తున్న వ్యక్తి విగతజీవిగా ఎలా మారారు?
తల వెనక భాగంలో బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు
ఇది హత్యేనని పోలీసుల ప్రాథమిక అంచనా
పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా?
సతీష్‌ది ఆత్మహత్యేనంటూ ప్రచారం మొదలుపెట్టిన వైకాపా

 

ఈనాడు, అమరావతి: ‘ఓ ఉన్నతాధికారి ఒత్తిళ్లు, ఆదేశాల మేరకే పరకామణిలో చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్నా’ అంటూ ఈ కేసులో ఫిర్యాదుదారు, తితిదే అప్పటి అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్‌వో) సతీష్‌కుమార్‌ సీఐడీ అధికారుల ఎదుట ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే  ఆయన ప్రాణాలు తీసిందా? ఈ కేసులో సతీష్‌ ఇంకా నోరు విప్పితే తమ బండారం బయటపడిపోతుందనే అనుమానంతోనే ఆయన్ను ఈ భూమ్మీద లేకుండా చేశారా? ఘటనా స్థలంలో పరిస్థితులు గమనిస్తే ఈ అనుమానం బలపడకమానదు. సతీష్‌కుమార్‌ది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆయన్ను తల వెనక భాగంలో బలమైన, పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నట్లు గుర్తించారు. సీఐడీ అధికారుల ఎదుట శుక్రవారం విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరిన ఆయన మార్గమధ్యలోనే ఇలా విగతజీవిగా మారటం వెనక ఎవరున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ఎవరి ఒత్తిడితో లోక్‌అదాలత్‌లో ఈ కేసు రాజీ చేశారు? నిందితుడైన రవికుమార్‌ పేరిట ఉన్న ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు? దీని వెనుక చక్రం తిప్పిన పెద్దలెవరు తదితర అంశాలపై సీఐడీ ఈ నెల 6న సతీష్‌కుమార్‌ను విచారించగా.. ఆయన కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు శుక్రవారం మరోమారు విచారణకు పిలిచారు. వారి ఎదుట హాజరవటానికి కొద్ది గంటల ముందు సతీష్‌ మృతి చెందటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు కూడా సతీష్‌ది హత్యేనని, ఆయనకు ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని చెబుతున్నారు.

పరకామణిలో చోరీ కేసులో లబ్ధి పొందిన వారెవరైనా సతీష్‌ను అడ్డు తొలగించుకునే కుట్ర చేశారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతంలో రాష్ట్రంలో అనేక సంచలన కేసుల్లో దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన సాక్షులు, నిందితులు ఇలాగే అనుమానాస్పద స్థితిలో మరణించారు. హత్యకు గురయ్యారు. ఇప్పుడు సతీష్‌ మృతీ అలాగే కనిపిస్తోంది.  

పేర్లు బయటపడతాయనేనా?

వైకాపా హయాంలో పెద్దజీయర్‌ మఠం పర్యవేక్షకుడు రవికుమార్‌ పరకామణిలో చోరీ చేస్తూ 2023 ఏప్రిల్‌ 29న పట్టుబడ్డారు. సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు మే 30న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈలోపే అనూహ్యంగా రవికుమార్‌ ఆస్తులను తితిదేకి రాయించి 2023 సెప్టెంబరు 9న లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. తిరుపతి గ్రామీణ మండలంలో ఐదు, తమిళనాడులో రెండు ఆస్తులను తితిదే పేరిట రాయించారు. వీటి విలువ రూ.14.43 కోట్లు. రవికుమార్‌ అనే భక్తుడు వీటిని ఇచ్చారని బోర్డు సమావేశ ఎజెండాలో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో రాజీ కష్టం.

ఇందుకు భిన్నంగా ఫిర్యాదు చేసిన సతీష్‌కుమారే రాజీకి వచ్చారు. ఈ రాజీ కుదర్చడానికి రవికుమార్‌ పేరిట ఉన్న రూ.పదుల కోట్ల విలువైన పలు ఆస్తులను నాటి వైకాపా ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు, వారి బినామీల పేరిట రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వివరాలన్నీ సతీష్‌కుమార్‌కు స్పష్టంగా తెలుసు. ఆయన వాంగ్మూలమిస్తే అవన్నీ వెల్లడయ్యేవి. అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్య అంటూ ప్రచారం

  • సతీష్‌కుమార్‌కు కుటుంబపరంగా, ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఆస్తి తగాదాలూ లేవు. ఎస్సైగా, సీఐగా దాదాపు 12 ఏళ్లు పనిచేసిన అనుభవముంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. పైగా పరకామణిలో చోరీ కేసులో ఆయన విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తి కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా? 
  • సతీష్‌ మృతి వార్త బయటకు రాగానే వైకాపా నాయకులు సాకే శైలజానాథ్, భూమన కరుణాకరరెడ్డి తదితరులు అది ఆత్మహత్యేనని, పోలీసుల వేధింపుల వల్ల ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రయత్నాలన్నీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
  • Upvote 1
Posted
2 hours ago, GOne said:

Sare police lu vunnadi, chacha ka lekkalu raasukonika?  protect cheyyatam ante telusu gaa?

Athane police. CI. CI ki malla protection enti?

Ee case lo chala mandhiki protection iccharu already.

Posted

Satish Kumar: తితిదే మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు

అనంతపురం: తితిదే మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతిని హత్యగా నిర్ధరిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌ చేశారు. 

పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు అందులో పేర్కొన్నారు. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (ఏవీఎస్‌వో) వై.సతీష్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌కుమార్‌ గతంలో తితిదే ఏవీఎస్‌వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు.

Posted

Andhra News: కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు

పరిటాల రవి, వివేకా హత్యల నుంచి పరకామణి చోరీ వరకూ అదే తీరు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అందులోని నిందితులు, అనుమానితులు, సాక్షులు వరుస హత్యలకు గురైన, అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతాలనేకం చూశాం. తాజాగా తితిదే పరకామణి చోరీ కేసు వ్యవహారంలో ఫిర్యాదుదారైన నాటి తితిదే ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గతంలో తెదేపా నేత పరిటాల రవి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుల్లోనూ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలోనే నిందితులు, అనుమానితులు, సాక్షులు హత్యలకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

అప్పట్లో పరిటాల రవి హత్య వెనకున్న అసలైన సూత్రధారులు, కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా అందులోని పాత్రధారులను అంతమొందించారనే ఫిర్యాదులున్నాయి. అందులో అత్యధిక హత్యలు, మరణాలు రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి. వివేకా హత్య కేసులోనూ జగన్‌ హయాంలోనే ఎక్కువ మంది సాక్షులు మరణించారు. ఇప్పుడు పరకామణి కేసులోనూ ఇదే తరహా నేర విధానం కనిపించింది. అందుకే సతీష్‌కుమార్‌ అనుమానాస్పద మృతిపై మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరముంది. 

పరిటాల రవి హత్య కేసులో..

 

1. మొద్దు శీను: పరిటాల రవిపై కాల్పులు జరిపిన, హత్య కేసులో రెండో నిందితుడైన మొద్దు శీను 2008 నవంబరు 9న అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యారు. శీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ మల్లెల ఓంప్రకాశ్‌ అతడిని సిమెంట్‌ డంబెల్‌తో మోదీ చంపేశారు. అప్రూవర్‌గా మారి, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని 2007 ఏప్రిల్‌లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరైనప్పుడు మొద్దు శీను ప్రకటించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడిని జైల్లో చంపేశారు. సూత్రధారులను బయటపెడతానని చెప్పడంతోనే దాని వెనకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దు శీను హత్య జరిగిందన్న ఆరోపణలున్నాయి. 

2. మద్దెలచెరువు సూరి: రవి హత్య కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి 2011 జనవరిలో హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో దారుణ హత్యకు గురయ్యారు. సూరికి అత్యంత సన్నిహిత అనుచరుడైన మలిశెట్టి భానుకిరణ్‌ అతడిని కాల్చి చంపాడు. రవి హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన సూరి ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు.

3. అజీజ్‌రెడ్డి: రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్న గ్యాంగ్‌స్టర్‌ అజీజ్‌రెడ్డి 2008 మేలో జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అజీజ్‌రెడ్డి డబ్బులు కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్‌ సాయంత్రం ఫిర్యాదివ్వగా.. పోలీసులు అదేరోజు రాత్రి ఎన్‌కౌంటర్‌ చేసేశారు. వెంకటరెడ్డి అనే వ్యక్తి.. అజీజ్‌రెడ్డి ద్వారా తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దు శీను, అప్రూవర్‌ రామ్మోహన్‌రెడ్డిలు వెల్లడించారు. కొన్నాళ్లకు వెంకటరెడ్డి హత్యకు గురికాగా, అజీజ్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. దీంతో ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చిందెవరు? అనేది తేలలేదు.

4. మల్లికార్జున: పరిటాల రవి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించించిన బృందంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున కొన్నాళ్ల తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన రైల్లోంచి దూకి చనిపోయారంటూ ప్రచారం చేశారు. రీ పోస్టుమార్టంలో వెలుగుచూసిన విషయాలు బయటకు రాకుండా తొక్కిపెట్టాలనే కుట్ర ఈ మృతి వెనక ఉందనే ఆరోపణలున్నాయి. 

5. డాక్టర్‌ సాంబశివరావు: పరిటాల రవి హత్య కంటే ముందు జూబ్లీహిల్స్‌ బాంబు పేలుడు కేసులో మద్దెలచెరువు సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు. అప్పట్లో జైల్లో వైద్యుడు సాంబశివరావు అతనికి సెల్‌ఫోన్లు అందించేవారని, సూరి వాటితో మాట్లాడే రవి హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలున్నాయి. రవి హత్య తర్వాత కొన్నాళ్లకు సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన కూడా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం చేశారు. ఆయన బతికుంటే రవి హత్య కుట్రలో మరింత మంది సూత్రధారులు బయటపడే అవకాశం ఉండేది. 

6. ఓంప్రకాశ్‌: మొద్దు శీనును అంతమొందించిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓంప్రకాశ్‌ విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉండేవాడు. వైకాపా పరిపాలన కాలంలో 2020 జులైలో మృతిచెందాడు. మూత్రపిండాలు దెబ్బతినడంతో చనిపోయినట్లు జైలు అధికారులు ప్రకటించారు.


వివేకా హత్య కేసులోనూ.. అదే తరహాలో మరణాలు

 

1. నారాయణయాదవ్, డ్రైవర్‌: వివేకా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ 2019 డిసెంబరులో మృతిచెందారు. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్‌ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించడం సందేహాస్పదంగా మారింది. ఆయన్ను విచారణకు పిలుస్తారనే సమయంలో మృతిచెందారు. ఈ ఘటనపై కేసే నమోదు కాలేదు. 

2. వాచ్‌మన్‌ రంగన్న: వివేకా హత్య కేసులో వాచ్‌మన్‌ రంగన్న ప్రత్యక్ష సాక్షి. ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లు వివేకాను హత్య చేసినట్లు ఆయన సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. దాని ఆధారంగా ఈ హత్య కేసులో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కరరెడ్డి తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. ఆయన కొన్ని నెలల కిందట అస్వస్థతకు గురై మృతిచెందారు. రంగన్న మృతిపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 

3. కల్లూరు గంగాధర్‌రెడ్డి: వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసులో ఆయన సీబీఐ ఎదుట కీలక వాంగ్మూలమిచ్చి ఆ తర్వాత మాట మార్చారు. పులివెందుల్లోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకా, అవినాష్‌రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సీబీఐ కొలతలు వేయడం, గూగుల్‌ కోర్డినేట్స్‌ తీసుకుంటున్న సమయంలో ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిచ్చింది.

4. కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి: కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. శ్రీనివాసులరెడ్డి మృతదేహంలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. 

5. డా.వైఎస్‌.అభిషేక్‌రెడ్డి: వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన డా.వై.ఎస్‌.అభిషేక్‌రెడ్డి.. 2021 ఆగస్టులో సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానని వాంగ్మూలమిచ్చారు. ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్ని రోజుల తర్వాత అభిషేక్‌రెడ్డి అనారోగ్యం బారిన పడి ఈ ఏడాది జనవరిలో మరణించారు.

6. ఈసీ గంగిరెడ్డి: వై.ఎస్‌.భారతిరెడ్డి తండ్రి, జగన్‌మోహన్‌రెడ్డి మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డికి చెందిన ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతీ అనుమానాస్పదమే. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...