Jump to content

3 days - 13LK cr investmets in pipeline— thank you CBN and Lokesh


Recommended Posts

Posted

Chandrababu Naidu: విశాఖ సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయం... 3 రోజుల్లో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు 

15-11-2025 Sat 20:15 | Andhra
Visakha Summit Exceeds Expectations with 13 Lakh Crore Investments
 
  • విశాఖలో విజయవంతంగా ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • మూడు రోజుల్లో రూ.13.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు
  • అంచనాలకు మించి 30 శాతం అధికంగా తరలివచ్చిన పెట్టుబడులు
  • ఈ ఒప్పందాల ద్వారా 16.31 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం
  •  ఇంధన, పరిశ్రమల, మౌలిక వసతుల రంగాలకు అత్యధిక వాటా
  • సగానికి పైగా ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఖరారు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో విశాఖ సాగర తీరం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన 30వ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి అద్భుత విజయం సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడుల సునామీని తీసుకొచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ.13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16,31,188 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అంచనాలకు మించి పెట్టుబడుల వెల్లువ

వాస్తవానికి ఈ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. అయితే, పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన రావడంతో సదస్సును మరో రోజు పొడిగించాల్సి వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థలు భారీగా తరలిరావడంతో అంచనాలను మించి ఏకంగా 30 శాతం అధికంగా, అంటే రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ప్రభుత్వ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్రమం తప్పకుండా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశాలు నిర్వహిస్తూ పరిశ్రమలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేశారు. దీనికి కొనసాగింపుగా, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి స్వయంగా సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించారు. ఈ కృషి ఫలించి భాగస్వామ్య సదస్సు రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది.

ముఖ్యమంత్రి సమక్షంలో అధిక శాతం ఒప్పందాలు

మూడు రోజుల పాటు జరిగిన ఈ పెట్టుబడుల మేళాలో సింహభాగం ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే జరగడం విశేషం. మొత్తం 123 ఎంఓయూల ద్వారా రూ.7,63,210 కోట్ల పెట్టుబడులు సీఎం సమక్షంలోనే ఖరారయ్యాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు కూడా తమ వంతు కృషి చేసి 490 ఎంఓయూల ద్వారా రూ.5,62,506 కోట్ల పెట్టుబడులను సాధించారు. సదస్సులో తొలి రోజు రూ.3.65 లక్షల కోట్లు, రెండో రోజు రూ.3.49 లక్షల కోట్లు, చివరి రోజు రూ.48,430 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

ప్రధాన రంగాలకు పెద్దపీట

ఈ సదస్సు ద్వారా మొత్తం 12 కీలక రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం రానుంది. ఇందులో ఇంధన, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించాయి. రంగాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

విద్యుత్ రంగం - రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు – 2,66,722 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు – రూ. 2,80,384 కోట్ల పెట్టుబడులు – 5,19,083 మందికి ఉద్యోగాలు
మౌలిక వసతులు – రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు – 3,06,649 మందికి ఉద్యోగాలు
ఐటీఈ అండ్ సీ – రూ. 1,59,467 కోట్ల పెట్టుబడులు - 2,96,315 మందికి ఉద్యోగాలు
ఏపీ సీఆర్డీఏ – రూ. 48,711 కోట్ల పెట్టుబడులు – 41,625 మందికి ఉద్యోగాలు
టూరిజం – రూ. 21,036 కోట్ల పెట్టుబడులు – 1,05,804 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్ – రూ. 13,008 కోట్ల పెట్టుబడులు - 47,390 మందికి ఉద్యోగాలు
పట్టణాభివృద్ధి – రూ. 4,944 కోట్ల పెట్టుబడులు - 12,150 మందికి ఉద్యోగాలు
టెక్స్ టైల్స్ – రూ. 4,490 కోట్ల పెట్టుబడులు - 8,450 మందికి ఉద్యోగాలు
వైద్యారోగం – 4,208 కోట్ల పెట్టుబడులు – 24000 మందికి ఉద్యోగాలు
విద్యా రంగం – రూ. 4,359 కోట్ల పెట్టుబడులు - 3,000 మందికి ఉద్యోగాలు
ఇతర శాఖలు – రూ. 50,000 కోట్ల పెట్టుబడులు

మొత్తం మీద, విశాఖ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి లభించిన గొప్ప విజయంగా నిలుస్తోంది. ఈ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాలిస్తే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారడంతో పాటు, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    34

  • Android_Halwa

    4

  • chintumintu1

    1

  • Teluguredu

    1

Posted

Achchennaidu: ఏపీకి వస్తున్న కంపెనీలు ఇవే... ఒక్క ఫొటోతో కళ్లకు కట్టిన అచ్చెన్నాయుడు!

15-11-2025 Sat 21:31 | Andhra
Achchennaidu Highlights Companies Investing in Andhra Pradesh
 
  • ఏపీకి వస్తున్న కంపెనీల జాబితాతో మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్
  • విశాఖ సదస్సు యువత భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని వెల్లడి
  • రెండు రోజుల సదస్సులో 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ
  • అంచనాలను మించి రూ.11.91 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • సీఎం చంద్రబాబు సమక్షంలో రెండో రోజు కీలక ఒప్పందాలు
  • అదానీ, హెట్రో, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలతో ఎంఓయూలు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించింది. ఈ సదస్సు రాష్ట్ర యువత భవిష్యత్తుకు 'గేమ్ చేంజర్' అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు దిగ్గజ కంపెనీల పేర్లు, లోగోలతో కూడిన ఒక ఫొటోను ఆయన తన ట్వీట్‌కు జోడించి, సదస్సు ద్వారా 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ లభించిందని స్పష్టం చేశారు.

విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వం తొలుత రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 7.48 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి మొదటి రోజు ముగిసేసరికే 400 ఒప్పందాల ద్వారా రూ.11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.

సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మరో 48 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.48,430 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 94,155 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థలలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెట్రో డ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్‌టీఎల్ క్వాంటం కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్, సీడాక్, పాస్కల్ వంటివి ఉన్నాయి. ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
20251115fr6918a36cb0cc0.jpg
Posted

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల సునామీ... సెమీకండక్టర్ల నుంచి షిప్ యార్డ్ వరకు కీలక ఒప్పందాలు

15-11-2025 Sat 19:10 | Andhra
Nara Lokesh Attracts Investment Boom for Andhra Pradesh
 
  • ఏపీలో సెమీకండక్టర్, చిప్ డిజైనింగ్ యూనిట్ ఏర్పాటుకు సిలికాన్ జెన్ కు ఆహ్వానం
  • క్వాంటం టెక్నాలజీలో దేశానికి ఏపీ మార్గదర్శనం చేస్తుందన్న మంత్రి లోకేశ్
  • రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్స్ సుముఖత
  • అమరావతిలో 12 ఎకరాల్లో ఏఐఎఫ్ఎఫ్ ఫుట్ బాల్ స్టేడియం నిర్మాణం
  • పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు జెలెస్ట్రా పవర్ కు విజ్ఞప్తి
  • శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఏఏఐ, ఏపీఏడీసీ మధ్య కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలో నడిపించేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం వేదికగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. 

మరోవైపు, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరడం విశేషం.

టెక్నాలజీలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టే దిశగా...

క్వాంటం టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉందని మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో 'ఆత్మనిర్భర్ క్వాంటం' అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. మేం కేవలం కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేస్తాం. అందుకే దేశంలోనే తొలిసారిగా క్వాంటం మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించాం" అని అన్నారు. 

అమరావతిలో ఏర్పాటు చేయనున్న 'క్వాంటం వ్యాలీ'కి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయని, అవి.. క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ప్రతిభావంతులైన ఎకోసిస్టమ్ నిర్మాణం, హార్డ్‌వేర్ తయారీ అని వివరించారు. 

ఈ కార్యక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్వాంటం కంప్యూటింగ్ పాలసీ (2025-30)ని విడుదల చేశారు. అనంతరం క్వాంటం టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి.

ఇదే క్రమంలో, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, సెమీకండక్టర్ల తయారీలో ప్రసిద్ధిగాంచిన సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చీదా చిదంబరంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) యూనిట్, చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ఐటీ, సెమీకండక్టర్స్ పాలసీ 2.0 దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. 

దీనిపై చిదంబరం సానుకూలంగా స్పందిస్తూ, AI GPUలు, CPUలు, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM) వంటి అధునాతన భాగాల తయారీపై తమకు ఆసక్తి ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ వాసుదేవన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంలో భాగంగా గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ వాసుదేవన్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ & రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు సంస్థను అభినందించారు. దీని ద్వారా సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆదికేశ్ తెలిపారు. భారత నావికాదళం, తీర రక్షక దళానికి తమ సంస్థ సేవలు అందిస్తోందని, 1057 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతం ఉన్న ఏపీలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు.

అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జెలెస్ట్రా పవర్ సీఈఓ పరాగ్ శర్మతో లోకేశ్ భేటీ అయ్యారు. సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం ఏపీలో ఒక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోర్టుకు సమీపంలో యూనిట్ ఏర్పాటు చేస్తే ఎగుమతులకు సులభంగా ఉంటుందని సూచించారు. రాష్ట్రంలో ఉన్న విశాలమైన తీరప్రాంతం, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ, త్వరలో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.

అమరావతిలో ఫుట్‌బాల్ స్టేడియం

పారిశ్రామిక రంగంతో పాటు క్రీడారంగ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) చైర్మన్ కల్యాణ్ చౌబేతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతిలో 12 ఎకరాల విస్తీర్ణంలో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించనున్నట్లు చౌబే ప్రకటించారు. అంతేకాకుండా, పాఠశాల స్థాయి నుంచి ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు పీఈటీలకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖతో కలిసి పనిచేస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటీవల డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో 3 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి గుర్తుచేశారు.

శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APADC) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కనెక్టివిటీ పెరిగి పర్యాటక, ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
Posted

Nara Lokesh: వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెరెమీ జుర్గెన్స్ తో మంత్రి లోకేశ్ భేటీ

15-11-2025 Sat 16:59 | Andhra
Nara Lokesh Meets World Economic Forum MD Jeremy Jurgens
 
  • ఏపీని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం
  • పునరుత్పాదక ఇంధన రంగంలో 115 బిలియన్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
  • పెరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో రాష్ట్రంలోనే నిపుణులను తయారు చేస్తామని వెల్లడి
  • కీలక రంగాల్లో డబ్ల్యూఈఎఫ్ సహకారం అందించాలని కోరిన లోకేశ్
  • ఏపీ ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తామని జెరెమీ జుర్గెన్స్ హామీ
ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని, ఈ లక్ష్య సాధనలో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం - డబ్ల్యూఈఎఫ్) సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. విశాఖపట్నంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు.

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా మారాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 2040 నాటికి దేశంలో విద్యుత్ అవసరాలు రెట్టింపు కానున్న నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం అత్యవసరం. మేము మార్పు కోసం వేచి చూడటం లేదు, మార్పును ముందుండి నడిపిస్తున్నాం. రాష్ట్రాన్ని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలన్నదే మా సంకల్పం" అని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30 శాతం వాటాను ఏపీ నుంచే అందించాలని ధ్యేయంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇవి కేవలం గణాంకాలు కావని, రాష్ట్ర విద్యుత్ భద్రతకు, ఆర్థిక ప్రగతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు.

సైబర్‌సెక్యూరిటీయే జాతీయ భద్రత

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్‌సెక్యూరిటీ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. "అక్టోబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య కాలంలోనే భారతదేశంలో 369 మిలియన్లకు పైగా సైబర్ దాడులు నమోదయ్యాయి. 2033 నాటికి ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల వల్ల కలిగే నష్టం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఈ దాడులు కీలక మౌలిక సదుపాయాలకు, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారతాయి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ వేగంగా ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పరిశ్రమలు, రవాణా, విద్యుత్ వంటి కీలక రంగాలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యతాంశమని లోకేశ్ పేర్కొన్నారు.

"ఈ సవాలును అధిగమించడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఉంది. రాష్ట్రంలోని విద్యార్థుల్లో 70 శాతం మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లోనే ఉన్నారు. ఈ మానవ వనరులను సద్వినియోగం చేసుకొని, స్వదేశీ సైబర్‌సెక్యూరిటీ నిపుణులను తయారుచేస్తాం. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 లక్షల సైబర్ నిపుణుల కొరతను తీర్చడంలో మా వంతు పాత్ర పోషిస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చమురు, విద్యుత్, సప్లయ్ చెయిన్ వంటి కీలక రంగాల్లో సైబర్‌సెక్యూరిటీ మూల్యాంకన నమూనాలను అమలు చేయడంలో సహకరించాలని, ముఖ్యంగా డబ్ల్యూఈఎఫ్ అభివృద్ధి చేసిన 'స్ట్రాటజిక్ సైబర్‌సెక్యూరిటీ టాలెంట్ ఫ్రేమ్‌వర్క్'ను ప్రయోగాత్మకంగా అమలు చేసి, నిపుణులైన మానవ వనరులను ప్రోత్సహించాలని కోరారు.

భాగస్వాములుగా చేరండి

సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవిల్యూషన్ (C4IR) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, దీని విజయానికి భాగస్వాముల సహకారం అత్యంత కీలకమని లోకేశ్ అన్నారు. ఈ ప్రయాణంలో కేవలం ఆర్థికంగానే కాకుండా, మేధోపరంగా, కార్యనిర్వహణ పరంగా కూడా సంస్థాపక భాగస్వాములుగా చేరాలని జెరెమీని ఆహ్వానించారు.

మంత్రి లోకేశ్ విజ్ఞప్తిపై జెరెమీ జుర్గెన్స్ సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తమ 'మొబిలైజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ క్లిన్ ఎనర్జీ ఇన్ ఇమర్జింగ్ ఎకానమీస్ (MICEE)' కార్యక్రమం ద్వారా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, 'ఎనర్జీ లెర్నింగ్ ప్రోగ్రాం' ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచుతామని తెలిపారు. సైబర్‌సెక్యూరిటీపై తమ సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని, ఏపీ ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
20251115fr691863ec1e9b0.jpg20251115fr691863f4b5dbc.jpg
Posted

Chandrababu Naidu: ఇంధన రంగానికి సైబర్ కవచం.. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

15-11-2025 Sat 17:26 | Andhra
Chandrababu Naidu Government Partners with World Economic Forum for Energy Cyber Security
 
  • ఏపీ ఇంధన రంగంలో కొత్త శకం
  • విద్యుత్ వ్యవస్థల భద్రతకు ప్రత్యేక కేంద్రం
  • విద్యుత్ వ్యవస్థల రక్షణకు సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఏర్పాటు
  • ఏఐ టెక్నాలజీతో విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గిస్తామన్న సీఎం చంద్రబాబు
  • డేటా సెంటర్లకు తక్కువ వ్యయంతో విద్యుత్ అందించడమే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
ఇంధన భద్రత, సైబర్ రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యుత్ వ్యవస్థలను పటిష్ఠం చేయడంతో పాటు, వాటికి సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా 'సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్' (CECRC) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలో శనివారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా ఇంధన రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, సైబర్ భద్రతా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇంధన రంగంలో సాంకేతికత వినియోగం ఎంత ముఖ్యమో, సైబర్ రక్షణ కూడా అంతే కీలకమని ఉద్ఘాటించారు. "ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాదు, దానిని ప్రజలకు అతి తక్కువ వ్యయంతో, సురక్షితంగా అందించడం కూడా ప్రభుత్వ బాధ్యత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలి. అప్పుడే ఈ రంగంలో సుస్థిరత సాధ్యమవుతుంది" అని ఆయన వివరించారు.

వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి విద్యుత్ అత్యవసరమని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వికేంద్రీకృత ఉత్పత్తి విధానాలపై దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు. 

"ఎక్కడికక్కడే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాం. తద్వారా ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించి, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చవచ్చు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను వేగవంతం చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి వినియోగాన్ని పెంచిన అనుభవం మాకుంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన వ్యవస్థలను తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డబ్ల్యూఈఎఫ్ ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిపై చంద్రబాబు దృష్టి సారించారు: మంత్రి నారా లోకేశ్ 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. "విశాఖకు 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను తీసుకురావాలన్న మా కల సాకారమైంది. అయితే, ఇలాంటి డేటా సెంటర్లకు నిరంతరాయంగా, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ అందించడం ఒక పెద్ద సవాలు. అధిక ధరలకు విద్యుత్‌ను అందిస్తే పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. అందుకే సీఎం చంద్రబాబు ఆధునిక టెక్నాలజీతో తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఈ రోజు ఏర్పాటు చేస్తున్న సైబర్ రెజిలియన్స్ సెంటర్, మన విద్యుత్ వ్యవస్థలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ తరుణంలో మన విద్యుత్ గ్రిడ్లు, వ్యవస్థల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం" అని తెలిపారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ ముందుచూపును ప్రశంసించారు. "ఏఐ వంటి సాంకేతిక విప్లవం చోటుచేసుకుంటున్న ఈ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయం. భారత్‌లో ఇంధన రంగంలో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే ఇలాంటి భద్రతా కేంద్రాలు ఎంతో అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Posted
4 minutes ago, psycopk said:

 

Achchennaidu: ఏపీకి వస్తున్న కంపెనీలు ఇవే... ఒక్క ఫొటోతో కళ్లకు కట్టిన అచ్చెన్నాయుడు!

15-11-2025 Sat 21:31 | Andhra
Achchennaidu Highlights Companies Investing in Andhra Pradesh
 
  • ఏపీకి వస్తున్న కంపెనీల జాబితాతో మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్
  • విశాఖ సదస్సు యువత భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని వెల్లడి
  • రెండు రోజుల సదస్సులో 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ
  • అంచనాలను మించి రూ.11.91 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • సీఎం చంద్రబాబు సమక్షంలో రెండో రోజు కీలక ఒప్పందాలు
  • అదానీ, హెట్రో, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలతో ఎంఓయూలు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించింది. ఈ సదస్సు రాష్ట్ర యువత భవిష్యత్తుకు 'గేమ్ చేంజర్' అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు దిగ్గజ కంపెనీల పేర్లు, లోగోలతో కూడిన ఒక ఫొటోను ఆయన తన ట్వీట్‌కు జోడించి, సదస్సు ద్వారా 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ లభించిందని స్పష్టం చేశారు.

విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వం తొలుత రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 7.48 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి మొదటి రోజు ముగిసేసరికే 400 ఒప్పందాల ద్వారా రూ.11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.

సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మరో 48 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.48,430 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 94,155 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థలలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెట్రో డ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్‌టీఎల్ క్వాంటం కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్, సీడాక్, పాస్కల్ వంటివి ఉన్నాయి. ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
20251115fr6918a36cb0cc0.jpg

bagane companies teekavachi @LionLokesh anna

siri solutions

vemana it solutions

jayaram llc kannapadam ledu ani @Android_Halwa telling

 

Posted

MoU’s…

Baboru isontivi supettadam maak kotha kaadu…sudadam public ki kotha kaadu..

Mothaniki maa baboru Amaravati ni pakkana padesindu…

Akariki Drone City ni kuda Vizag ki shifted..

Google Data center became Adani Data Center..

Mothaniki…13 lakh crore investments ani seppi vijawada nundi vizag varaku okka acre migalakunda dobbeyadam kharar

Posted
3 hours ago, psycopk said:

విద్యుత్ రంగం - రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు –      2,66,722 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు – రూ. 2,80,384 కోట్ల పెట్టుబడులు –          5,19,083 మందికి ఉద్యోగాలు
మౌలిక వసతులు – రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు – 3,06,649 మందికి ఉద్యోగాలు
ఐటీఈ అండ్ సీ – రూ. 1,59,467 కోట్ల పెట్టుబడులు -   2,96,315 మందికి

Just ie four verticals lo antha kalipithe 1,388,769 Jobs. 

I think AP will see labot shortage. H1b visa laaga edaina plan cheysthe better emo...

Ipatike 10 lakh jobs vachesinayi...unemployed youth andariki jobs vachesinayi...ipudu kothaga jobs ante AP needs to import from other states.

Posted

2014-19 lo sign chesina MOUs lo only 5-6% ground ayaye. 
Ematram daniki chimpukuntunaru

bajana-gif.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...