psycopk Posted November 16 Report Posted November 16 Jagan Mohan Reddy: ఏపీ అభివృద్ధి అంతా డొల్ల... చంద్రబాబు విజన్ ఇదేనా?: జగన్ విమర్శలు 16-11-2025 Sun 14:26 | Andhra ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వైసీపీ అధినేత జగన్ విమర్శ పెరుగుతున్న అప్పులు, పడిపోతున్న మూలధన వ్యయంపై ఆందోళన రెండంకెల అభివృద్ధి అబద్ధం, పన్నుల వసూళ్లు నిరాశాజనకం అన్న జగన్ జీఎస్టీ, అమ్మకం పన్ను వసూళ్లు కేవలం 2.85 శాతం పెరిగాయని వెల్లడి కొద్ది కాలంలోనే రూ.2.06 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణ వైసీపీ అధినేత జగన్... సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పూర్తిగా విఫలమైందని, ఆదాయం పడిపోతూ అప్పులు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు. కాగ్ (CAG) విడుదల చేసిన తాజా గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. "2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో చాలా నిరుత్సాహకరమైన వృద్ధిని వెల్లడిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వేగంగా పెరుగుతాయని టీడీపీ, జనసేన ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ఆర్థిక పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే కేవలం 7.03 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. జీఎస్‌టీ, అమ్మకం పన్ను వసూళ్లు వినియోగానికి అద్దం పడతాయి. ఈ రెండింటి ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కేవలం 2.85 శాతం మాత్రమే పెరిగింది. గత రెండేళ్ల (2023-24 నుంచి 2025-26) మొదటి అర్ధభాగంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి వార్షిక వృద్ధి రేటు (CAGR) కేవలం 2.75 శాతంగా ఉంది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. అయినా, రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 2024-25లో 12.02 శాతం, 2025-26లో 17.1 శాతం జీఎస్‌డీపీ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని వారు చెబుతున్నారు. ఈ స్థాయిలో వృద్ధి ఉంటే పన్నుల రాబడి కూడా 12 శాతం నుంచి 15 శాతం వరకు పెరగాలి. కానీ వాస్తవ వృద్ధి కేవలం 2.75 శాతం మాత్రమే. మరోవైపు, మూలధన వ్యయం గత రెండేళ్లలో మైనస్ 16 శాతం వార్షిక వృద్ధి రేటుతో క్షీణించడం మరింత బాధాకరం. 2019-24 మధ్య ఐదేళ్లలో రాష్ట్ర సొంత పన్ను రాబడి ఏటా సగటున 9.87 శాతం పెరిగింది. జీఎస్‌డీపీ వృద్ధి 10.23 శాతంగా నమోదైంది. ఆ గణాంకాలకు, ఇప్పటి వృద్ధికి పొంతన లేదు. మరి ఇంత తక్కువ రాబడి వృద్ధితో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెప్పగలరు? ఈ ప్రభుత్వ హయాంలో వేగంగా దూసుకుపోతున్నది ఒక్క అప్పుల విషయంలోనే. ఇప్పటివరకు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ. 2,06,959 కోట్లను అప్పుగా తీసుకుంది లేదా ఒప్పందాలు చేసుకుంది. ఇది గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 62 శాతం అని గణాంకాలు చెబుతున్నాయి" అని జగన్ తన ట్వీట్ లో వివరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.