Anta Assamey Posted November 21 Report Posted November 21 KCR unnanta varaku Harish uncle will not make any such mistakes... Quote
psycopk Posted November 21 Author Report Posted November 21 KTR: సీఎం రేవంత్ రెడ్డికి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు: కేటీఆర్ 21-11-2025 Fri 13:25 | Telangana ఈ-కార్ రేసు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమన్న కేటీఆర్ కడియంను కాపాడేందుకే దానం నాగేందర్ తో రాజీనామా చేయించే ప్రయత్నం అని ఆరోపణ అనర్హత వేటు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడ అని విమర్శలు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాతే ఉపఎన్నికలు అని జోస్యం సీఎం రేవంత్ రెడ్డికి తనను అరెస్ట్ చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ-కార్ రేసు కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నా" అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడేందుకే దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాతే ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. Quote
southyx Posted November 21 Report Posted November 21 She has better organizing skills than KTR has. KTR Vs Kavitha unte, Kavitha will win in long run. Quote
psycopk Posted November 21 Author Report Posted November 21 Sabitha Indra Reddy: ఇంత జరుగుతున్నా సబిత ఇంద్రారెడ్డి స్పందించకపోవడం దారుణం: కవిత 21-11-2025 Fri 18:45 | Telangana మహేశ్వరంలో సబిత అనుచరులు చెరువులను కబ్జా చేస్తున్నారని ఆరోపణ కబ్జాలపై సబిత స్పందించకపోవడం దారుణమన్న కవిత హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందని వ్యాఖ్య మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కబ్జాలపై ఆమె స్పందించకపోవడం దారుణమని కవిత విమర్శించారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. మహేశ్వరంలోని రావిర్యాల, మంత్రాల చెరువులలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కానీ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆమె నిలదీశారు. మున్ముందు ఈ కబ్జాలకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తామని, వారు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. హైడ్రా ప్రత్యేకంగా సర్టిఫైడ్ ఏజెన్సీగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కబ్జాలకు సంబంధించిన వివరాలను హైడ్రాకు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళతారేమోనని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని ఆమె అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.