Jump to content

Unlimited FSI, 69 floors building, where is safety..!

Recommended Posts

Posted

Kokapet: తదుపరి రూ.200 కోట్లేనా?

తదుపరి రూ.200 కోట్లేనా?

ఈనాడు, హైదరాబాద్‌: కోకాపేటలో గతంలో ఎకరా రూ.100 కోట్లు పలికితే ఇప్పుడు రూ.151 కోట్లు పలికింది. బిల్డర్లు పోటీపడి మరీ భూములు దక్కించుకుంటున్నారు. రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లకు కొన్నారు. వీటినిబట్టి చూస్తుంటే ఎకరా రూ.200 కోట్ల మార్కును దాటేందుకు ఎక్కువ రోజులు పట్టవనే అంచనాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్‌కు ఈ ధరలు అద్దం పడుతున్నాయని చెబుతున్నా హైదరాబాద్‌లో అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) ఉండటమే అధిక ధరలకు భూముల కొనుగోలు వెనక ఉన్న అసలు కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నగరంలో కొన్నేళ్ల క్రితం కట్టిన బహుళ అంతస్తుల సముదాయాలను గమనిస్తే ఎకరా స్థలంలో రెండు నుంచి రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాసాలు కట్టారు. 10 నుంచి 23 అంతస్తుల వరకు నిర్మించారు. భూముల ధరలు పెరిగితే అక్కడి నుంచి కాస్త దూరం వెళ్లి తక్కువ ధరకు భూములు కొని అక్కడ కట్టేవారు. అలా ఒక్కో గేటెడ్‌ కమ్యూనిటీలో ఐదారువందల నివాసాలే ఉండేవి.

వేలం తర్వాత చూస్తే.. భూముల వేలం ద్వారా రియాలిటీ రూపురేఖలు మారిపోయాయి. ఎకరా వందకోట్లకు కొన్నప్పుడు 4 లక్షల చ.అడుగులు కట్టేవారు. ఇప్పుడు రూ.150 కోట్లను దాటింది కాబట్టి 5 లక్షలు చదరపు అడుగులు కట్టేలా డిజైన్‌ చేస్తున్నారు. 50-69 అంతస్తుల వరకు వెళుతున్నారు. వాటిలో 3-4 వేల ఫ్లాట్లు ఉంటున్నాయి. ఒక్కో ఫ్లాట్‌కు రెండేసి కార్లు ఉంటాయి. అన్నీ రోడ్లెక్కితే ట్రాఫిక్‌ సమస్యలే. 

ఎఫ్‌ఎస్‌ఐ లెక్కలే వారి ధీమా.. నగరంలో ఎకరాల్లో భూమి కొన్నా గజాల్లో విలువ లెక్కిస్తుంటారు. బిల్డర్లు ఎఫ్‌ఎస్‌ఐ రూపంలో లెక్కగట్టి లాభనష్టాలను బేరీజు వేస్తున్నారు. ఉదాహరణకు.. కోకాపేటలో ఎకరం రూ.150 కోట్ల లెక్కన వేసుకుంటే ఇక్కడ ఎకరానికి 5 లక్షల చ.అడుగులు నిర్మిస్తారు. అప్పుడు ఎఫ్‌ఎస్‌ఐ ధర రూ.3 వేలు పడుతుంది. కట్టేది ఆకాశహర్మ్యాలు కాబట్టి చ.అడుగు రూ.4 వేల వరకు అవుతుంది. అప్పుడు చ.అడుగు ధర రూ.10 వేల నుంచి రూ.12 వేలకు విక్రయించినా లాభసాటి అని కొంటున్నారని నిపుణులు అంటున్నారు. తక్కువ విస్తీర్ణంలో కడితే ఎక్కువ స్థలం వృథా అవుతుంది కాబట్టి 5-15 వేల చ.అడుగుల్లో నిర్మిస్తున్నారు.   

చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం.. కోకాపేటలో వేలం ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతుందని బిల్డర్లు వాపోతున్నారు. ఇది భూ యాజమానులకు లాభమే అయినా.. బిల్డర్లకు, ఇళ్లు కొనేవారికి పెద్ద భారంగా మారిందనే అభిప్రాయాలున్నాయి. ఆ ధరలకు కొని కడితే 2 బీహెచ్‌కే ఇంటికి కోటికిపైగా అవుతుంది. సిటీకి దూరంగా వెళ్లి ఈ ధరలకు ఎవరు కొంటారని చిన్న బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. ‘సర్కారు ఆదాయం కోసం భూములు వేలం వేస్తోంది. 10 శాతం మంది వీటితో లాభపడుతున్నా.. 90 శాతం కష్టాలు పడాల్సి వస్తోంది. గ్రేటర్‌లో అందుబాటు ఇళ్లకు అడ్రస్‌ లేకుండా పోతుంది’ అని బిల్డర్‌ సతీష్‌ మారం ‘ఈనాడు’తో అన్నారు.  

అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ మూలంగానే

తదుపరి రూ.200 కోట్లేనా?

కరానికి ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు నిర్మాణం చేపట్టవచ్చనే భరోసాతోనే బిల్డర్లు అధిక ధరలకు వేలంలో భూములను దక్కించుకుంటున్నారు. హైదరాబాద్‌లో అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) ఉండటమే ఇందుక్కారణం. ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలు ఉండాలని బిల్డర్లు కోరుకుంటున్నారు. ఆంక్షలు పెడితే ఆకాశహర్మ్యాలు రావనే వాదన ఉంది ముంబయిలో ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలున్నా అక్కడే ఆకాశ     హర్మ్యాలు అత్యధికంగా ఉన్నాయి. అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ కారణంగా తదుపరి చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వేలంలో అమ్మితే సర్కారుకు ఆదాయం వస్తుంది. బిల్డర్‌కూ లాభసాటే. కొన్నవారే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. నార్సింగి, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో 25 శాతం అక్యుపెన్సీ ఉంటేనే ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాం. నిర్మాణాలు పూర్తయితే వందశాతం ఆవాసాల్లోకి జనాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించలేం. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి.

-నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌-ఇండియా

Posted
4 minutes ago, Undilaemanchikalam said:

Cbn Chandrababu GIF - Cbn Chandrababu Naidu - Discover & Share GIFs

Posted

Next tukkuguda lo 50cr

Future city lo 10cr loading 

Posted
9 hours ago, DallasKarreballu said:

Cbn Chandrababu GIF - Cbn Chandrababu Naidu - Discover & Share GIFs

Hong Kong lo em jargindho chusam kadha.. 

  • Upvote 1
Posted
1 hour ago, Undilaemanchikalam said:

Hong Kong lo em jargindho chusam kadha.. 

Hong Kong no land

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...