Jump to content

Musuku kurchora poola chokka


Recommended Posts

Posted

వైకాపా హయాంలో పోలీసులు కూడా సెలవులు పెట్టి గంజాయి వ్యాపారంలో దిగి హైదరాబాద్ లో అరెస్ట్ అవ్వడం మనకు తెలిసిందే. నెల్లూరులో పెంచలయ్య కాదు కదా అటు శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూరు వరకు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లతో సాగించిన అరాచకానికి ఎవరూ నోరెత్తలేదు వైకాపా హయాంలో. సైలెంటుగా పదకొండుతో వైలెంట్ వైకాపాను బ్యాలెట్ బాక్సుల వద్ద జనం కుళ్లబొడిచారు.

ఈగల్ టీమ్ పెట్టి పోలీసులు తాట తీస్తుంటే.. చెత్త ఏరుకునే వారి ద్వారా రహస్యంగా గంజాయి వ్యాపారం చేసింది కామాక్షి.  

సీపీఎం నాయకుడు కొట్టివిడి పెంచలయ్య నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ ట్రెజరరుగా వున్నాడు.  అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఆరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇవ్వడం, దొంగతనాలకు పాల్పడేవారితో అసాంఘిక కార్య కలాపాలు చేయించడం గమనించి పెంచలయ్య ఆమెను పద్ధతి మార్చుకోమని మందలించాడు. గంజాయి విక్రయిస్తున్న యువకులను అలా విక్రయించవద్దని చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి గంజాయి విక్రయాలను అడ్డుకున్నాడు. 

ఈ ధైర్యం, చైతన్యం కూటమి పాలనలో వచ్చింది.

కానీ కామాక్షి అహం దెబ్బతింది, కక్షపెంచుకుంది. ఈ నేపథ్యంలో  పెంచలయ్య పిల్లలతో స్కూటీపై వెళుతుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద తొమ్మిదిమంది దుండగులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కత్తులు తీసి పెంచలయ్యను వెంటాడి పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 

//పెంచలయ్య హత్యకేసులో దర్యాప్తు వేగవంతం - అరవ కామాక్షి గ్యాంగే హత్య చేసినట్టు పోలీసుల నిర్ధారణ - నిందితుల కోసం గాలిస్తున్న నెల్లూరు పోలీసులు - అరవ కామాక్షమ్మ, ఆమె భర్త జోసెఫ్‍తో పాటు - మరో ఇద్దరి కోసం గాలింపు - నిన్న కాల్పుల్లో గాయపడ్డ జేమ్స్ - కామాక్షమ్మ ముఠాపై హత్యాయత్నం సహా పలు కేసులు//

వైకాపా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసింది మార్చి 24, 2023. అరవ కామాక్షికి ఫ్లెక్సీలు కట్టి వైకాపాలోకి ఆహ్వానించి మరీ చేర్చుకున్నది ఆగష్టు 20, 2023న. ఇంకా గంజాయి ముఠాను ఎక్కడ బొక్కలోకి తీసినా ఓర్చుకోలేక వచ్చి జగన్ ఓదార్చుతున్నాడు. తెనాలిలో ఏకంగా రఫ్ఫా రఫ్ఫా ఫ్లకార్డులు పట్టుకుని మరీ బెదిరించడం మొదలెట్టారు.

కీలేడి అరుణ నుండి అరవ కామాక్షి వరకు కోటం రెడ్డి కోటాలో తొయ్యాలని వైకాపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అరుణ జైల్లో చిప్పకూడు తింటోంది. అరవ కామాక్షి నీడ ఇక నెల్లూరులో ఉండకపోవచ్చు. నేరస్తులను వెనకేసుకొని వచ్చే జగన్ కాదు ఇక్కడ ఉన్నది,  చండశాసనుడు చంద్రబాబు. ఫ్యాక్షనిస్టుల నుండి రెడ్ శాండిల్ స్మగ్లర్ల వరకు ఆయనేమిటో తెలుసు. ఈ గంజాయి బ్యాచ్ లు ఎంత? వారిని నమ్ముకుని అండగా వైకాపా రాజకీయం చెయ్యడం జనం చూస్తున్నారు..

 

 

Posted
1 hour ago, psycopk said:

 

Eeeyy ladies ni develop avvanivvara...

Women empowerment ki forefront lo untadu ma Jagan anna...47osjd.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...