psycopk Posted Tuesday at 11:33 AM Report Posted Tuesday at 11:33 AM Nara Lokesh: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్తో లోకేశ్, అనిత భేటీ 02-12-2025 Tue 15:12 | Andhra మొంథా తుపానుతో ఏపీలో తీవ్ర పంట నష్టం జరిగిందని వెల్లడి 1.61 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరణ 3.27 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, ఉద్యాన రంగాలకు అపార నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వారు సమావేశమై, రాష్ట్రంలో తుపాను సృష్టించిన నష్టంపై వివరాలు అందజేశారు. గత నెల 28, 29 తేదీల్లో సంభవించిన మొంథా తుపాను వల్ల రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 443 మండలాల పరిధిలోని 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని మంత్రులు వివరించారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 9.53 లక్షల మంది ప్రజలు నష్టపోయారని తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు. మంత్రులు అందించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.61 లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ వంటి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. దీనివల్ల 3.27 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారు. వ్యవసాయంతో పాటు, 6,250 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కొబ్బరి, మిరప వంటి ఉద్యాన పంటలు కూడా ధ్వంసమయ్యాయని కేంద్ర మంత్రికి తెలిపారు. పంట నష్టంతో పాటు చెరువులు, కాలువలు, నర్సరీలు, షేడ్నెట్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టిందని మంత్రి లోకేశ్ తెలిపారు. SDRF, NDRF బృందాలను మోహరించి ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని కేంద్ర మంత్రికి వివరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.