Jump to content

Recommended Posts

Posted

పాపం పండింది.. కోర్టు ధిక్కరణ కింద జైలు వేశారు..

 

595396450_830587666608987_57265652323663

  • Upvote 1
Posted
కోర్టు ధిక్కరణ – జగన్ ' కుల' పతికి కారాగార 'కీర్తి'
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పేరు వినగానే విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు ఒకే మాట చెబుతున్నారు – “విద్యా పరిపాలన కంటే వివాదాల పరిపాలన ఎక్కువ చేశారు”. జ్ఞాన సరస్వతీ మందిరాన్ని న్యాయ ధిక్కరణ, అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం, పరీక్షలలో గందరగోళం అనే నాలుగు స్తంభాలపై నిలబెట్టిన వీసీ గారి “విశిష్ట” పాలన ఇప్పుడు హైకోర్టు తీర్పుతో జైలు గదికి చేరబోతుంది.
⚖️ కోర్టు ధిక్కరణ – “ఉత్తర్వులు అంటే లెక్కలేదు”
- నూకన్నదొర అనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తొలగించి, జీతం నిలిపివేసి, హైకోర్టు ఉత్తర్వులను వరుసగా ధిక్కరించిన ఘనత ప్రసాద్ రెడ్డిదే.
- న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు: “కోర్టు ఆదేశాలంటే ఆయనకు గౌరవం తక్కువ. ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయవ్యవస్థకు నష్టం.”
- ఫలితం: నెల రోజుల జైలు, రూ.2,000 జరిమానా.
గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు:
అక్రమ నియామకాలు – “నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు”
- రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలు పక్కన పెట్టి “సొంత సిఫారసులు” ఆధారంగా నియామకాలు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేసి “అక్రమ నియామకాలు” బహిర్గతం చేశారు.
- కూటమి పాలనలో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చి, 60 రోజుల్లో నివేదిక వస్తుందని ప్రకటించారు.
- విశ్వవిద్యాలయ నిధులలో రూ.100 కోట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు. విశ్వవిద్యాలయం ATMలా మారింది
- ఆర్ఎస్‌యూ ఎ నిధులలో రూ.20 కోట్లు దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ విచారణలో బయటపడింది.
- నిర్మాణ పనులు, పరీక్షల రీ-ఎవాల్యూయేషన్ వ్యవహారాల్లో కూడా “కమిషన్” వాసన.
పరీక్షల గందరగోళం – “రీ-ఎవాల్యూయేషన్ అంటే రీ-కలెక్షన్”
- పీజీ పరీక్షల రీ-ఎవాల్యూయేషన్‌లో “సొంతవారికి” మార్కులు పెంచడం.
- విద్యార్థుల భవిష్యత్తు కాగితాలపై లెక్కల ఆట.
- విశ్వవిద్యాలయం ప్రతిష్టను మట్టిపాలు చేసిన మరో ఘనత.
విశ్వవిద్యాలయ కులపతి అంటే సొంతకులపతిగా భావించి ఇలా ఎంతోమంది అరాచక వ్యక్తులను నియమించి, విద్యాలయాలలో కూడా విధ్వంసాలు చేయించిన సైకోగా జగన్ను విద్యావేత్తలు మరిచిపోరు, ముఖ్యంగా చదువుకున్నవారు! విశ్వవిద్యాలయాన్ని కబ్జా చేసిన కులపతికి జైలు కీర్తి స్వయంకృతం. ప్రతి రంగం నుండి జైలుకు పంపుతున్న జగన్ ఘనకీర్తిని, రికార్డులను మర్చిపోలేం.
 
596803591_1418394716580588_5891020824182

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...