Jump to content

Recommended Posts

Posted

విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సదస్సు
నేడు ప్రారంభించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ
మధ్నాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం 
హాజరుకానున్న 44 దేశాల ప్రతినిధులు 
పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు 
రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు 
రెండ్రోజుల సదస్సుకు భారీస్థాయిలో ఏర్పాట్లు

 

 

 

విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’కు సమయం ఆసన్నమైంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా.. విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారుచేసేలా.. చైనా ప్లస్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు.. రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో సోమ, మంగళవారాల్లో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. సోమవారం(8న) మధ్యాహ్నం ఒంటిగంటకు గ్లోబల్‌ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానుండడంతో..అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్‌ 2047 డాక్యుమెంట్‌ లక్ష్యాలు, భారత్‌ ఫ్యూచర్‌ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. 

 

ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం.. సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకేసారి నాలుగు సమావేశ మందిరాల్లో వేర్వేరు అంశాలపై నాలుగు చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి .. తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చాగోష్ఠిలుంటాయి. మర్నాడు 9న ఉదయం 10 గంటల నుంచి సదస్సు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.30 గంటల వరకూ వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులుంటాయి. రెండోరోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు, 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవృద్ధికి రాష్ట్రం ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక.. తదితర అంశాలపై చర్చిస్తారు. రెండ్రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్‌ హాళ్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌’ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. రెండ్రోజులూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం సంగీత విభావరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణీనాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జునసాగర్‌ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్‌ పార్కు ‘బుద్ధవనం’ పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

 

సమిట్‌ ప్రారంభ సమావేశం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్‌ హాల్‌

  • సదస్సును సక్రమంగా, సజావుగా నిర్వహించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌లతో వార్‌రూంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులను ఆహ్వానించడంతో పాటు.. వారిని సదస్సు వద్దకు చేర్చడం, తిరిగి పంపించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  
  • సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ గవర్నర్‌ సహా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ఛైర్‌పర్సన్లు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతమ్‌ అదానీ, అనంత్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా, జి.మల్లికార్జునరావు, ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ సీఈఓ ఎరిక్‌ స్వైడర్‌ తదితరులు హాజరవుతారని ప్రభుత్వం పేర్కొంది.
  • రెండ్రోజుల సదస్సులో సుమారు రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా విద్య, నైపుణ్య, క్రీడా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. టీసీఎస్‌-టీపీజీ, హ్యుందయ్, ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌ అండ్‌ బి హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, క్రిస్టల్‌ లగూన్స్‌ అండ్‌ గ్రీన్‌ పాంథర్స్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ తదితర పలు సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబర్చాయి. ఎంఓయూలు కుదుర్చుకోనున్నాయి.

 

2047 నాటికి మూసీనది పరీవాహక ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియజేసే వీడియోలను ప్రదర్శించే భారీ తెరలు 

  • సదస్సుకు విచ్చేసిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్‌ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. రహదారి వెంట తెలంగాణ చారిత్రక, కళారూపాలతో ‘తెలంగాణ రైజింగ్‌’ నినాదాలతో భారీ హోర్డింగులు, డిజిటల్‌ తెరలను నెలకొల్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలతో పాటు.. మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు, తదితర అంశాలను ఈ హోర్డింగ్‌ల్లో పొందుపర్చారు.
  • సదస్సు ప్రాంగణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వివిధ అంశాలను చాటిచెప్పే 45 స్టాళ్లను నెలకొల్పారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, స్కిల్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వైద్య పర్యాటకం, ఐఐటీ హైదరాబాద్, ఫార్మా, క్రెడాయ్‌లకు సంబంధించిన స్టాళ్లున్నాయి. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా కూడా 10 చోట్ల ఇదే తీరుగా ప్రత్యేక సమాచార కేంద్రాలు నెలకొల్పారు. ఇందులో సదస్సు వివరాలతో పాటు.. ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికను కూడా అందుబాటులో ఉంచారు.
  • సదస్సు ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల భారీ ఎల్‌ఈడీ తెరతో పాటు.. ప్రాంగణంలోని ఇతర వేదికల వద్ద కూడా ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. సదస్సు, సెషన్స్‌ హాళ్లలో జరిగే చర్చలు, ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఈ తెరలపై వీక్షించవచ్చు.

 

గ్లోబల్‌ సమిట్‌ నేపథ్యంలో త్రివర్ణకాంతుల్లో వెలుగులీనుతున్న సచివాలయం 

  • నగరంలోని ప్రధాన చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్‌ ఏర్పాటుచేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా త్రీడి ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ను నెలకొల్పారు. 
  • సదస్సుకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరు కానుండడంతో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనర్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1,000 సీసీ కెమెరాలతో సదస్సు ప్రాంగణంతో పాటు.. పరిసరాలను కూడా అనుక్షణం గమనించేలా ఏర్పాట్లుచేశారు. సీసీ కెమెరాలను నేరుగా సెంట్రల్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేశారు. అనుమతి కార్డు లేకుండా ఎవరినీ రానివ్వరు.

అతిథులకు ప్రత్యేక బహుమతి

సదస్సు జరిగే రెండ్రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు.. తెలంగాణ ప్రసిద్ధ వంటలతో భోజనాలు అందించేందుకు వంటశాలలు సిద్ధమయ్యాయి. 

అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని ప్రభుత్వం తరఫున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ లోగోతో పాటు.. పోచంపల్లి ఇక్కత్‌ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలు  ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిథేలకు అందించనున్నారు.

 

దుర్గంచెరువు తీగల వంతెన వద్ద ఏర్పాటుచేసిన తేలియాడే గ్లోబ్‌ ఆకారపు ప్రొజెక్షన్‌

 

 

గ్లోబల్‌ సమిట్‌కు హాజరయ్యే అతిథులకు స్వాగతం చెప్పేందుకు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటుచేసిన రోబోటిక్‌ యంత్రం 


రెండు నెలల నుంచే సీఎం సమీక్షలు

సదస్సు నిర్వహణపై దాదాపు రెండు నెలల నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ‘తెలంగాణ రైజింగ్‌ సమిట్‌’తో పాటు.. ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌’పైనా నిశితంగా చర్చించారు. దార్శనిక పత్రంలో పొందుపర్చాల్సిన అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించారు. నీతిఆయోగ్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) నిపుణులతో కూడిన సలహా కమిటీని ప్రభుత్వం నియమించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని.. నిపుణులతో చర్చించి.. తెలంగాణ 2047 దార్శనిక పత్రానికి ముఖ్యమంత్రి తుదిరూపునిచ్చారు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా.. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా ప్రభుత్వం ఈ విజన్‌ డాక్యుమెంట్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సును దృష్టిలో ఉంచుకొని  దార్శనిక పత్రాన్ని రూపొందించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రధానంగా తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన మార్గాలు, వ్యూహాలు..అభివృద్ధిని జిల్లాలు, గ్రామాలకూ వికేంద్రీకరించడం.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమనే లక్ష్యాన్ని అధిగమించడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం.. విద్య, వైద్యంలో అధునాతన విధానాలు పాటించడం.. కాలుష్య రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం.. తదితర అంశాలను ప్రభుత్వం హైలైట్‌ చేయనుంది.

Posted

gajji toka kukkalu bow bow. Real estate penchukovudu tappinchi em plan chestaro cheppamanandi. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...