psycopk Posted 3 hours ago Author Report Posted 3 hours ago Amaravati Cricket Stadium: అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనుల జోరు.. 90 శాతం పూర్తి 31-01-2026 Sat 15:27 | Andhra కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం 34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం పనుల పురోగతిపై మున్సిపల్ శాఖ వీడియో విడుదల రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని నవులూరు వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయిందని ఏపీ మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "రాజధాని అమరావతిలో నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని సిద్ధం చేస్తున్నాం" అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ స్టేడియంను మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో 34 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. విజయవాడకు 13 కిలోమీటర్లు, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా ఇది నిర్మితమవుతోంది. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి, స్టేడియంను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. Quote
psycopk Posted 2 hours ago Author Report Posted 2 hours ago Chandrababu: ఇ-సైకిళ్లపై భారీ రాయితీ.. గిన్నిస్ రికార్డుతో ఏపీ సర్కార్ కొత్త చరిత్ర 31-01-2026 Sat 16:11 | Andhra ఏపీలో ఇ-సైకిళ్లపై రూ.10 వేల రాయితీ ప్రకటించిన ప్రభుత్వం 24 గంటల్లో 5,555 సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు కుప్పంలో 3 కిలోమీటర్లు ఇ-సైకిల్ నడిపిన సీఎం చంద్రబాబు రూ.35 వేల సైకిల్‌ను రూ.25 వేలకే పొందే అవకాశం ఇ-మోటరాడ్ సంస్థతో ఒప్పందం.. కుప్పంలోనే అసెంబ్లింగ్ ఏపీలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పర్యావరణ హిత ఇ-సైకిళ్లను భారీ రాయితీపై అందిస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. పర్యావరణ హితమైన కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రూ.10 వేల సబ్సిడీ.. రూ.25 వేలకే సైకిల్ ఇ-మోటరాడ్స్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రూ.35,000 విలువైన ఒక్కో ఇ-సైకిల్‌పై ప్రభుత్వం రూ.10,000 రాయితీ కల్పిస్తోంది. దీంతో ప్రజలు కేవలం రూ.25,000 చెల్లించి ఈ సైకిల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఈ సైకిల్ 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. విశేషమేమిటంటే ఈ సైకిళ్లను కుప్పంలోనే ఇ-మోటరాడ్ సంస్థ అసెంబుల్ చేస్తోంది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ సైకిళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తూంసీలోని ప్రజావేదిక వద్దకు ఆయన దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఇ-సైకిల్‌పై ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం గిన్నిస్ రికార్డు సాధించినందుకు గాను చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పం ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. "ఎన్నికల్లో సైకిల్‌కు ఓటేశారు, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం" అని పేర్కొన్నారు. ఇ-సైకిళ్లకు పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.