psycopk Posted 2 hours ago Author Report Posted 2 hours ago Chandrababu Naidu: చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి... మంత్రి ఆనం ఫైర్ 31-01-2026 Sat 16:40 | Andhra అవి బాధ్యతారహిత, అనుచిత వ్యాఖ్యలని ఫైర్ అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ విమర్శలు హద్దులు దాటొద్దని ప్రజాప్రతినిధులకు హితవు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంబటి వ్యాఖ్యలు అత్యంత అనుచితంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై బూతు మాటలతో దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, ముఖ్యమంత్రికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి ఆనం డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటితే ప్రజలు ఏమాత్రం సహించరని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తమ మాటల పట్ల సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు హుందాతనాన్ని పాటించడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. Quote
psycopk Posted 2 hours ago Author Report Posted 2 hours ago Ambati Rambabu: గుంటూరులో అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత... పోలీసు బందోబస్తు! 31-01-2026 Sat 17:26 | Andhra చంద్రబాబుపై అంబటి బూతులతో విరుచుకుపడిన వైనం పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అంబటిని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు! గుంటూరులో సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును బూతులతో దూషించిన నేపథ్యంలో, టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేయబోతున్నారనే వదంతులు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ప్రచారంతో గుంటూరులోని నవభారత్ నగర్ లో ఉన్న అంబటి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరులోని తన నివాసంలోనే ఉన్నారు. ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ ఖాయమంటూ సోషల్ మీడియాలో, స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ఈ సమాచారంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై అంబటి నివాసానికి వెళ్లే మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. మీడియా ప్రతినిధులతో సహా ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. Quote
psycopk Posted 2 hours ago Author Report Posted 2 hours ago Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలు.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు 31-01-2026 Sat 17:11 | Andhra సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర అసభ్య వ్యాఖ్యలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు లడ్డూ నెయ్యి కల్తీ ఫ్లెక్సీపై మొదలైన వివాదం గోరంట్లలో అంబటిని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అంబటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్న మంత్రి పార్థసారథి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు శనివారం జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంబటిపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయిందంటూ 'మహాపాపం' పేరుతో టీడీపీ నేతలు ఇటీవల ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. చెప్పినట్టుగానే శనివారం ఉదయం గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఆ తర్వాత ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నాయి. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీ వద్దకు రావద్దని అంబటికి సూచించారు. అయితే, ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన అంబటిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు నివారించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో దూషించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు అంబటిని అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటన అనంతరం గుంటూరులోని ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి వ్యాఖ్యలను 'అత్యంత దుర్మార్గం' అని మంత్రి కొల్లు రవీంద్ర, పార్థసారథి వంటి వారు తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ మంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రిపై ఇంతటి అనుచిత భాషను ఉపయోగించడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. Quote
psycopk Posted 2 hours ago Author Report Posted 2 hours ago Ambati Rambabu: అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ శ్రేణులు... చేతులు జోడించి క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి 31-01-2026 Sat 18:00 | Andhra ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల కలకలం అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించిన టీడీపీ శ్రేణులు చేతులు జోడించి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ అంబటి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్ల దాడి.. కారు ధ్వంసం ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ మహిళా కార్యకర్తల ఆగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి బహిరంగంగా, రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఆమె నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్లోని అంబటి నివాసాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆగ్రహంతో ఉన్న కొందరు కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వగా, మరికొందరు ఇంటి బయటన ఉన్న కారును ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడుల్లో ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు పగిలిపోయాయి. టీడీపీ మహిళా కార్యకర్తలు చీపురు కట్టలతో నిరసన తెలుపుతూ, అంబటి నివాసంపై కోడిగుడ్లు విసిరారు.ః ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇంతటి అసభ్యకరంగా దూషించడం హేయమైన చర్య. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రజలందరి ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు. మహిళా కార్యకర్తలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "చంద్రబాబు మాకు దైవంతో సమానం. గతంలో ఆయన కుటుంబసభ్యులను దూషించినప్పుడు సంయమనం పాటించాం. కానీ ఈసారి సహించేది లేదు. అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే మాకు అప్పగించాలి" అంటూ వారు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో అంబటి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. Quote
nokia123 Posted 1 hour ago Report Posted 1 hour ago “గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు ” Antha kante emi ikkithaaru tdp vallu? adhe ycp cadre ithe rappa rappa nariketollu annodini Quote
psycopk Posted 1 hour ago Author Report Posted 1 hour ago They are doing everything to divert from laddu issue Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.