ragstheindian Posted November 16, 2009 Report Posted November 16, 2009 1.వంశ పారంపర్యం "వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్. "అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య. 2.ఏ పక్క "మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?" సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్. "గోడపక్క" చెప్పాడు సుధాకర్ 3.భయం "నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను" "ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?" "కాదు..... నన్ను తోసేస్తుందని." 4.కోరిక "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని. "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి. "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా. 5.పట్టుదల "పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం "అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు. 6.చిరుత ... ఆ తరువాత చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు? బుడత - బాలకృష్ణ తనయ ఉడత - వెంకటేష్ తనయ మిడత - మోహన్ బాబు తనయ పిడత - పవన్ కళ్యాణ్ తనయ 7.చెక్కు "రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్. "ఎందుకండీ?" అన్నాడు చంద్రం. "ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్. "మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.