Jump to content

OLD Days YAAGAM effects verified....


Recommended Posts

Posted

అతిరత్రం పేరు గుర్తుందా? రెండు నెలల క్రితం కేరళలోని పంజల్ గ్రామంలో పన్నెండు రోజులపాటు నిర్వహించిన అతిప్రాచీన యజ్ఞం పేరిది. పరిసరాలు, పర్యావరణం, జీవక్రియలపై యజ్ఞ, యాగాదుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ అతిరత్రంలో ఒక ప్రయత్నం జరిగింది. యజ్ఞ ప్రభావం వీటన్నింటిపై కనిపించిందని, విత్తనాలు అంకురించేందుకు పట్టే సమయం గణనీయంగా తగ్గిందని, యాగశాలలో, పరిసరాల్లోని కొంత దూరం వరకూ సూక్ష్మజీవుల సంతతి కూడా తగ్గడాన్ని గమనించామని యాగాన్ని నిర్వహించిన వర్తతే ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. శాస్త్ర పరిశోధనల వివరాలను ఒక ప్రకటన ద్వారా గురువారం విడుదల చేశారు. పరిశోధనలకు నేతృత్వం వహించిన కొచ్చిన యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకుడు వి.పి.ఎన్.నంబుద్రీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
జీవక్రియలపై యజ్ఞ ప్రభావాన్ని అంచనా వేసేందుకు తాము యాగశాలకు నలుదిక్కులా కొన్ని విత్తనాలు (చిక్కుడు, పెసర, శనగ) నాటామని, మిగిలిన మూడు దిక్కులతో పోలిస్తే పశ్చిమ దిక్కున నాటిన గింజలు వేగంగా మొలకెత్తాయని ఆయన తెలిపారు. శనగ గింజల విషయంలో ఈ వేగం దాదాపు రెండు వేల రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. దీనికి కారణమేమిటన్నది కణస్థాయిలో విశ్లేషించాల్సిన అవసరమేమీ లేదని, ఇదియజ్ఞ ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన మార్పుల ఫలితమేనని చెప్పవచ్చునని ఆయన వివరించారు.
సూక్ష్మజీవులపై జరిపిన పరిశోధనల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. అయితే తాము యాగశాలతోపాటు మరో రెండు చోట్ల ముందుగా నేల, నీటిల్లో ఏర్పాటు చేసిన సూక్ష్మజీవులను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయని అన్నారు. యాగశాల పరిసరాల్లో వీటి సంతతి గణనీయంగా తగ్గిపోయిందని, 500 మీటర్లు, 1.5 కిలోమీటర్ల అవతల ఉంచిన వాటిలో మాత్రం పెద్దగా మార్పు లేదని తెలిపారు. యాగం ప్రారంభానికి ముందు, యాగం జరుగుతున్నప్పుడు, పూర్తయిన నాలుగు రోజులకు పరిశీలనలు జరిపామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాకుండా యాంటీ మైక్రోబియల్ లక్షణాలున్న సూక్ష్మజీవులను కూడా యాగశాల పరిధిలో గుర్తించామని అన్నారు.
- సైన్స్ డెస్క్, సాక్షి

లేజర్‌లా పనిచేసిన ప్రవరగ్యం క్రతువు..
అతిరత్రంలో నిర్వహించిన అతిముఖ్యమైన క్రతువుల్లో ప్రవరగ్యం ఒకటి. ఉవ్వెత్తున ఎగసిపడే నిప్పు గోళం దీని ప్రత్యేకత. ఈ నిప్పు గోళాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ప్రొఫెసర్ సక్సేనా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నిప్పుగోళం ఉష్ణోగ్రత దాదాపుగా 3870 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ ఉండిందని, దీన్నుంచి వెలువడిన కాంతి ప్రత్యేక తరంగదైర్ఘ్యంతో కూడి ఉందని గుర్తించినట్లు వి.పి.ఎన్ నంబుద్రీ తెలిపారు. ఇంతటి తీవ్రమైన తరంగదైర్ఘ్య కాంతి లేజర్ల ద్వారా వెలువడుతూంటుందని తెలిపారు. యాగం సందర్భంగా సేకరించిన సమాచారాన్ని వివిధ పరిశోధన శాలల్లో విశ్లేషిస్తున్నామని, ప్రాథమిక అంచనాల ప్రకారం యాగం తాలూకూ ప్రభావం పరిసరాలపై, పర్యావరణంపై కచ్చితంగా ఉంటుందని స్పష్టమైందని ఆయన తెలిపారు.

×
×
  • Create New...