Jump to content

Entire family suffered due to snake bite.......


Recommended Posts

Posted

[size=12pt]మహబూబ్‌నగర్ రూరల్, వైద్యవిభాగం,న్యూస్‌లైన్: పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలన్న వారి ఆశలను ఓ పాము చిదిమేసింది. కూలి చేసుకుని బతికే వారికి ఉన్నత ఆశయాలు పనికిరావని భావించిందేమో కసిదీరా కాటేసింది. ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

విషయం తెలిసిన గ్రామస్థులు భోరుమన్నారు.ఈ విషాద సంఘటన వివరాలు..మండల పరిధిలోని కోడూరుకు చెందిన అమృతమ్మ, భాస్కర్‌గౌడ్ లకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కూ లి చేస్తేనే కానీ కడుపునిండని నిరుపేద కుటుం బం వారిది. గురువారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. భాస్కర్‌గౌడ్ అక్కయ్య లక్ష్మమ్మ కూడా వారింట్లోనే ఉంది. అందరూ కలిసి కుటుంబ విషయాలు చర్చించుకుంటూ నిద్రపోయారు.

మధ్యరాత్రి తరువాత ఆ ఇంట్లోకి చొరబడిన ఓ కట్లపాము పడుకున్న వారిని వరుసగా కాటేసుకుంటూ పోయింది. ఏ దో కుట్టినట్టయి ఉలిక్కిపడిన భాస్కర్‌గౌడ్ కు మారుడు రాకేష్ లేచి లైట్ వేసి చూస్తే కట్లపా ము కనిపించింది. భయంతో కేకలువేసి అందరి నీ నిద్రలేపాడు. పామును చంపేశారు. ఆ కొద్దిసేపటికే నలుగురి నోట్లోంచి నురగలు రావడం తో గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రా మస్థులు వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్(12), లక్ష్మమ్మ(50) మృతి చెందారు. భాస్కర్‌గౌడ్(45), అ మ్ములు(8) పరిస్థితి విషమంగా ఉండడంతో అ క్కడి నుంచి ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. 24గంటలు గడిస్తేగానీ పరిస్థితి చెప్పలేమని వై ద్యులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత అమృతమ్మ(40), మరో కుమార్తె లత(5) పరిస్థితిలో కూడా మార్పు కనిపించడంతో వారిని కూడా ఎస్వీఎస్‌లో చేర్చారు. మరో చిన్నారి స్వప్న(4) క్షేమం. గ్రామస్థులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై శంకర్ తెలిపారు.

తల్లడిల్లిన తోటి విద్యార్థులు
స్థానిక ఉన్నత పాఠశాలల్లో ఏడో తరగతి చదువుతున్న రాకేష్ మృతి చెందడం, అతని చెల్లెలు అమ్ములు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తోటి విద్యార్థులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు..రాకేష్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.

విషాదంలో కోడూరు
సంఘటనతో గ్రామం మొత్తం విషాదంలో ము నిగిపోయింది.బాధితకుటుంబానికి దిక్కులేకుం డా పోయిందంటూ గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, సర్పంచ్ బాలమ్మలతోపాటు పలువురు నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.[/size]

Posted

seriously so sad  sorry2 sorry2

kaalam kaatu esindhi baa allani paamu kadhu

×
×
  • Create New...