kingmakers Posted December 2, 2009 Report Posted December 2, 2009 తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఎ.ఎ.ఆర్ట్స్ సంస్థ పోసాని కృష్ణమురళి హీరోగా ఎం.కె.మూవీస్ పతాకంపై'మిస్ చింతామణి యం.ఎ.' (కేరాఫ్ సుబ్బిగాడు) అనే కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో కె.చంద్రశేఖర్ (జీతూ), ఎ.ఉదయ్ శంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముహూర్తం సంస్థ కార్యాలయంలో బుధవారంనాడు జరిగింది. దేవుడి పటాలపై ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఎం.కె.మూవీస్ అధినేతల్లో ఒకరైన ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, ఈ తరం ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి కథను రచయిత రాజేంద్రకుమార్ చెప్పారనీ, ఇది తరగతులకూ నచ్చుతుందనీ అన్నారు. పోసాని ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నమిత మరో ముఖ్య భూమిక పోషించనుందనీ, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందనీ చెప్పారు. జనవరి మూడో వారం నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి పి.రాజేంద్రకుమార్ కథ-మాటలు, ఎ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎస్.వి.ఎస్.రవి ఎడిటింగ్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు.
googledude Posted December 2, 2009 Report Posted December 2, 2009 enti ninnati nunchi Posani midha racha chesthunnav dance1w dance1w vadi midha ehduku nayana antha concentration hitwalltwice #
Recommended Posts