Jump to content

Recommended Posts

Posted

పెళ్లయి రెండు మూడు రోజులు గడిచిందో లేదో శిల్పాశెట్టి తన కోరికల చిట్టాను విప్పుతోంది. ఎంత త్వరగా తల్లినయితే అంత త్వరగా చూసుకోవాలని కుతూహలంగా ఉందని చెపుతోంది. తల్లినయ్యేందుకు వివాహ ఘడియలు ఎప్పుడొస్తాయా.. అని ఎన్నాళ్లగానో ఎదురు చూశాననీ, అనుకున్న క్షణాలు రానే వచ్చాయనీ, దేవుడు లాంటి భర్త దొరికాడని కుంద్రాను పొగడ్తలతో ముంచెత్తుతోంది.

తన భర్త రాజ్‌కు తనేంటో తెలుసనీ, అదేవిధంగా రాజ్ అంటే ఏమిటో తనకు తెలుసుననీ, వివాహానికి ముందు గత కొన్ని నెలలుగా అతడితో స్నేహం చేశానని చెపుతోంది. ఆయనలాంటి వ్యక్తి తనకు ఎవరూ తారసపడలేదని అంటోంది.

తన పెళ్లిరోజు వేడుకను గురించి గుర్తు చేసుకుంటూ... ఆ రోజు మా ఇద్దరి జంటను చూసేందుకు అభిమానులు, ఫోటోగ్రాఫర్లు గోడలు, చెట్లు ఎక్కి ఎంతో ఆసక్తి కనబరచారని చెప్పుకొచ్చింది. తన హనీమూన్ వివరాల గురించి చెపుతూ... బహమాస్‌కు వెళ్లనున్నామనీ, అక్కడి అందాలను తిలికించేందుకు తన భర్త తన కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారని

×
×
  • Create New...