twinkle star Posted March 29, 2009 Report Posted March 29, 2009 ఎన్టీఆర్ కు మహేష్ ఫోన్ చేయడం అబద్దం Date Updated: 3/29/2009 9:11:30 AM Email: చంద్రగిరి నియోజక వర్గంలో కాంగ్రెస్ తరఫున ఆరోగ్య శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి తెలుగుదేశం తరఫున రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం చంద్రగిరి లో ఎన్టీఆర్ ను ప్రచారం చేయవద్దని మహేష్ కోరినట్టు ఒక వార్త పుకార్లు చేసింది. ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర పర్యటన లో ఉండగా మహేష్ ఎన్టీఆర్ ను అభినందిస్తూ ఫోన్ చేసాడని అలాగే తన సోదరి అత్త గారైన గల్లా అరుణ కుమారి పోటీ చేస్తున్న చంద్రగిరి నియోజకవర్గం లో ఎన్టీఆర్ ను ప్రచారానికి వెళ్లవద్దు అని కోరినట్టు ఈ పుకారు తాత్పర్యం. అయితే ఈరోజు చంద్రగిరి లో ప్రచారం చేస్తున్న కృష్ణ కుమార్తె మహేష్ సోదరి గల్లా పద్మ ఈ నీలి వార్తను ఖండించింది. . మహేష్ ఎవరికి ఫోన్ చేయరని అలాగే మహేష్ ఎన్నికల లో ఎవరికి ప్రచారం కూడా చేయరని అన్నారు. రాజకీయాలలో తటస్థం గా ఉంటారు అని మరొక్కసారి తేల్చి చెప్పింది. తన ప్రచారం లో స్పందన అనూహ్యంగా ఉందని శ్రీమతి గల్లా పద్మ పేర్కొన్నారు. గల్లా అరుణ కుమారి చంద్రగిరి నుంచి హాట్రిక్ చేయటం ఖాయమని అన్నారు.
Recommended Posts