Jump to content

PRP lo inko Wicket down....


Recommended Posts

Posted

పీఆర్‌పీకి సత్తి గుడ్‌బై

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ : ప్రజారాజ్యం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ,విశాఖ అర్బన్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు, సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేస్తానని చెప్పారు. అదేరోజు అట్టహాసంగా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని చెప్పారు. మార్పు కోసం పార్టీ స్థాపించానన్న చిరంజీవి మాటలు నమ్మి ఆ పార్టీలో చేరానన్నారు. అయితే, అక్కడ కనిపించేది పైకి ఒకటి, లోపల వేరొకటిగా పరిస్థితి ఉందని చెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, వ్యాపార ధోరణితో పార్టీని నడుపుతున్న తీరుకు విసుగు చెందానని ఆయన పేర్కొన్నారు. ప్రజారాజ్యం కుల పరమైన సంకుచిత భావాలతో పాటు, ధన రాజ్యానికి పెద్ద పీట వేసిందని విమర్శించారు.

×
×
  • Create New...