nayakudu Posted April 7, 2009 Report Posted April 7, 2009 ఆంధ్రాలో ఉన్న అసెంబ్లీ స్థానాలకంటే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి అయోమయ పరిచి తరువాత సర్దుకొని సంఖ్య చెప్పుతూ వచ్చి మధ్యలో మాజిక్ సంఖ్య సాధిస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు గెలిచి తీరతామని స్పష్టం చేస్తున్నారు. గెలిచేది లేనిదీ పక్కన పెడితే ఎదుటి పక్షాలపై పెట్రేగాల్సింది పోయి రోజూ మేము టికెట్లు అమ్ముకో లేదు మా బావ మరిది అలాంటి వాడు కాదు అని అందరివాడు పదే పదే పాడవలసి వస్తోంది. టికెట్టురాని రాణి అవును డబ్బులు తీసుకొన్న మాట వాస్తవమే మునెమ్మ లాంటి వాళ్లకు సహాయం చెయ్యాలి కదా అంటూ స్పష్టత నిస్తుంటే, నెత్తి మీద పది రూపాయలు పెడితే ఐదు రూపాయలకు కూడా అమ్ముడు పోనీ వ్యక్తులు మాకు కోట్లు ఇచ్చారంటే ఎలా నమ్ముతారు అంటున్నాడు అరవిందుడు. అంటే ఈయన ఉద్దేశం టికెట్లు పొందిన వ్యక్తులు ఎందుకూ కొరగాని వారా? ప్రజలకు భారం అయ్యే వారనేనా? ఇక సమరం జరపడం కూడా వేస్టు అని సమరం సమరానికి ముందే స్వపక్షం పైకి బాణం విసురుతుంటే, మసాలా లాంటి వాళ్ళు సోస వచ్చి సొమ్మ సిల్లి పడుతుంటే, ప్రతి రోజూ ప్రత్యర్ధుల పై ప్రతిధ్వనించే పరకాల పరధ్యానంగా ఉంటుంటే, ఉపెంద్రుడు, దేవేంద్రుడు, శంకరుడు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు మౌనముద్ర దాల్చుతుంటే, ఉపాధ్యక్షుడు నా ఉపదేశాలను పెడచెవిన పెట్టారు ఇక ఉపేక్షించేది లేదు అని అంటుంటే అభిమానులు, సానుభూతి పరులు ఇది అంతా స్వయంకృతం అని పెదవి విరుస్తున్నారు. అభిమానులనూ అందలం ఎక్కిస్తామని ఆశలపల్లకిలో ఊరేగించి ముచ్చటగా మూడు గెలవలేని సీట్లు కేటాయించారు. అందులో మొదటిది, కుప్పంలో తను ఒక్కపుడు రాజకీయంగా అభిమానించిన నాయకునిపై ఒక చిరు అభిమానిని నిలిపాడు. రెండోది కాంగ్రెస్సే గనుల అండతో పోరాడాల్సి వచ్చే అడ్డా అంతపురంలో నిలిపారు. మూడోది రాజమండ్రి అయితే రాణించ లేను అని వెనుకడుగు వేసి దిగినాక బురద కడుక్కోవలసిందే కదా అంటూ దిగేసాడు మరో దిగ్గజం ఎన్నికల గోదాట్లోకి అటువంటి చోట ఇంకో అభిమానిని శాసన సభ బరిలో నిలిపారు. ఇన్నాళ్ళూ పాలాభిషేకం చేసిన మాకు పావలా విలువ ఇవ్వక పాలకొల్లు పారిపోయావా నాయకా అంటూ సంఘాల అధ్యక్షుడే వైరి పక్షంలో చేరి పొయ్యాడు. మొదటినుండి అందరి వాడు మావాడు అంటూ వచ్చిన వర్గం సైంధవుని లాగా వసూళ్ళ రాజాను ప్రధాన కార్యదర్శిగా మరియు కోశాధికారిగా నియమించి ఆమడ దూరంలో మమ్ములను నియంత్రించి ఆయన అన్యాయమయ్యి పోయాడు అంటూ వాపోతున్నారు. అయోమయంలో కొట్టు మిట్టాడుతూ ఈ రోజు మానిఫెస్టో రిలీజు చేసారు ఇది మరెన్ని అయోమయాలకు దారి తీస్తుందో?
nayakudu Posted April 7, 2009 Author Report Posted April 7, 2009 ee mukka velli mi chimpu gadiki cheppuko ra kuyyaaa warningnf
nayakudu Posted April 7, 2009 Author Report Posted April 7, 2009 pleasedie warningnf warningnf ** monkeydanceds monkeydanceds
Recommended Posts