Jump to content

TRAINLO ASSAMKU RAAMANI MAARAAMU CHESTOO GOODSU..


Recommended Posts

Posted

"రాజ్యా"నికి మిత్రా. మూర్తి, ఉపేంద్ర రాంరాం?

హైదరాబాద్‌, (సూర్య ప్రధాన ప్రతినిధి): కీలకమైన మలి దశ ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి మరో శరాఘాతం తగలనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు, గుర్తు నమోదులో సంతకం చేసిన పరకాల ప్రభాకర్‌, అధినేత చిరంజీవి పర్యటనలు రూపొందించిన మాజీ ఐపిఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి వంటి ప్రముఖులు తొలి దశ ఎన్నికల ముందు పార్టీని వీడగా.. మలి విడత ఎన్నికల ముందు మరికొందరు సీనియర్లు కూడా వారి దారినే అనుసరించనున్నారు. వివిధ పార్టీల్లో కీలకపాత్ర పోషించి, అధినేతలను తమ ఆలోచనలతో నడిపించిన తమను పీఆర్పీ నాయకత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు పక్కకు పెట్టిందన్న ఆగ్రహం, అసంతృప్తితో ఉన్న వీరు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం సాయంత్రానికి వీరు తమ నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది. వయసు, రాజకీయానుభవం ఉన్న తమను పనికిరాని ‘పేపరు పని’కి పరిమితం చేసి, కీల నిర్ణయాలన్నీ బావ-బావమరుదులే తీసుకోవడం వీరిని చాలాకాలం నుంచి అసంతృప్తికి గురిచేస్తోంది.

ఇంకా ఉంటే విలువ ఉండదు

విశ్వసనీయ సమాచారం ప్రకారం... చాలాకాలం పాటు పీఆర్పీ వాణిని సమర్థవంతంగా వినిపించిన డాక్టర్‌ పుచ్చలపల్లి మిత్ర, తొలిరోజుల్లో స్వయంగా చిరంజీవి సలహాదారుగా నియమించిన మాజీ ఐఎఎస్‌ అధికారి, దళిత నేత కెఎస్‌ఆర్‌ మూర్తి, రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు సలహాదారైన పర్వతనేని ఉపేంద్ర, మాజీ ఎంపి పుట్టపాగ రాధాకృష్ణ బుధవారం రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరంతా రాజీనామా చేయాలని చాలాకాలం నుంచి భావిస్తున్నప్పటికీ, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

పరకాల ప్రభాకర్‌, డాక్టర్‌ సమరం వంటి మేధావులే పార్టీ విధానాలను తూర్పారపట్టి వెళ్లిపోతే.. సుదీర్ఘ రాజకీయానుభవంలో విలువలు ఉన్న నాయకులుగా పేరున్న తాము ఇంకా పార్టీని పట్టుకుని వేళ్లాడటం వల్ల చెడు సంకేతాలు వెళ్లడంతో పాటు తమ వ్యక్తిత్వానికే మచ్చ వస్తుందన్న భావనతో వీరు చాలా కాలం నుంచి ఊగిసలాడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి విశేష సేవలందించిన చాలామంది పార్టీని వీడిన సమయంలో వారంతా వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్న చిరు, అల్లు వ్యాఖ్యలు వారిని కలచివేసినట్లు తె లుస్తోంది. రేపు తమను కూడా వాళ్లు ఆ విధంగా విమర్శించరన్న గ్యారంటీ ఏమిటన్న అంతర్మథనం కూడా రాజీనామాలకు ఒక కారణంగా చెబుతున్నారు.

మిత్రా అసంతృప్తి

పార్టీ పెట్టకముందు నుంచీ పీఆర్పీకి సిద్ధాంతకర్తగా ప్రచారంలో డాక్టర్‌ మిత్ర, ఆరు నెలల క్రితమే పోలింగ్‌ బూత్‌ ఏజెంట్ల వ్యవస్థపై దృష్టి సారించాలని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. వామపక్ష భావజాలం ఉన్న ఆయన ఒక దశలో వామపక్షాలతో పొత్తుకు ప్రయత్నించినప్పటికీ, చిరు సన్నిహితులే దానిని చెడగొట్టి, ఆ నెపం తనపై వేశారని ఒక సందర్భంలో సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు, టికెట్లు ఇవ్వకుండా, ముందు వారి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని వాదించారు. జిల్లా నేతలు, శ్రేణులెవరినీ హైదరాబాద్‌కు రాకుండా క్షేత్రస్థాయిలోనే పనిచేసుకోవాలని మిత్ర చెబితే, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పార్టీ కార్యాలయంలో అడ్డా వే సి, నియోజకవర్గాలను వదిలేసిన వైనంపై మిత్ర చాలాసార్లు సమావేశాల్లో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ ఏ లక్ష్యాల కోసమైతే ప్రారంభమయిందో అవి పూర్తిగా గాడి తప్పాయని, టికెట్ల పంపకాల్లో తనను ఏమాత్రం సంప్రదించలేదన్న ఆగ్రహం మిత్రలో ఉన్నట్లు చెబుతున్నారు.

అల్లు అరవింద్‌ మిత్రుడయినప్పటికీ, ముక్కుసూటిగా మాట్లాడే తనను పక్కకుపెట్టడం, అసలు పార్టీలో ఏం జరుగుతోందో తనకే తెలియకపోవడం ఆయనను కలచివేసిందంటున్నారు. ప్రతి విషయాన్ని బావ-బావమరుదులే చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య లక్షణం కాదని చాలాసార్లు బాహాటంగానే చర్చించినట్లు తెలిసింది. టికెట్ల అమ్మకాల ఆరోపణలతో పార్టీ భ్రష్టుపట్టిన నేపథ్యంలో ఇక తాను ఈ పార్టీలో ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ కారణంతోనే ఆయనకు నెల్లూరు టికెట్‌ ఇస్తామన్నా వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఒక దశలో మిత్రా వైఖరిపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాగా ప్రచారం కూడా జరిగింది.

ముక్కుసూటి మూర్తికి గౌరవమేదీ?

ఇక పార్టీ పెట్టకముందు నుంచీ ఉన్న దళిత నేత కెఎస్‌ఆర్‌ మూర్తి కూడా నాయకత్వధోరణిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న ఆయన.. పార్టీకి ఒక నిర్మాణం, సమిష్టి నిర్ణయాలు, చర్చలు లేకుండా అంతా బావ-బావమరుదుల చుట్టూనే పార్టీ పరిభ్రమింపచేశారన్న అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్న ఆయనకు పార్టీలో సరైన గౌరవం లేకుండా చేశారని, అమలాపురం సీటు ఆశించిన ఆయనకు ఆ సీటు ఇవ్వకుండా అవమానించారని ఇతర నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను నాయకత్వం అసలు విశ్వాసంలో తీసుకోకపోవడమే మూర్తిని కలచివేసిందని చెబుతున్నారు. పార్టీని సామాన్య, అట్టడుగువర్గాలకు చేర్చాలని, నిరుపేదలకు సీట్లు ఇవ్వడం ద్వారా కొత్త రాజకీయాలను శ్రీకారం చుట్టాలన్న ఆయన లక్ష్యం పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో దెబ్బతిన్నందుకు బాధపడిన మూర్తి కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వ్యక్తిత్వం, అభ్యుదయ భావాలున్న మూర్తి లాంటి సీనియర్లు అసలు ఇప్పటివరకూ పార్టీలో కొనసాగడంపై చాలామంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.

ఉపేంద్రనూ పక్కకుపెడతారా?

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి, కేంద్రమంత్రి స్థాయికి ఎదిగి కాంగ్రెస్‌లోనూ కీలకపాత్ర పోషించిన పర్వతనేని ఉపేంద్ర కూడా పార్టీ నాయకత్వ ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. టికెట్ల పంపిణీపై ఒకదశలో ఆయన తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఉపేంద్ర వంటి అనుభవజ్ఞులు, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకుడిని సైతం పక్కకుపెట్టి, సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలామందికి నచ్చలేదు. పార్టీకి సరైన ఆలోచనలు అందించి, దిశానిర్దేశం చేసి పీఆర్పీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ, చిరు ఆహ్వానంతో తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తమలాంటి సీనియర్లకు ఏదో పేపర్‌ వర్కులు అప్పగించి, ముఖ్యమైన సమావేశాలకు దూరం పెట్టడం వంటి చర్యలతో మనస్తాపం చెందిన ఉపేంద్ర కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Posted

orey bongu maker.......adhi conress lagane......ila news esthe inkonni votes mee congress ki tdp ki padathayi emo ani ramoji gaadu chesthadu... ilanti news neelanti vaade esthadu......morning tv9 news lo tirupathi godava gurinchi upendra and moorthi matladaru......eeri mokama. pleasedie pleasedie pleasedie

Posted

orey bongu maker.......adhi conress lagane......ila news esthe inkonni votes mee congress ki tdp ki padathayi emo ani ramoji gaadu chesthadu... ilanti news neelanti vaade esthadu......morning tv9 news lo tirupathi godava gurinchi upendra and moorthi matladaru......eeri mokama. pleasedie pleasedie pleasedie

3D_Smiles_56.jpg.gif

×
×
  • Create New...