chintakayalaravi Posted January 10, 2013 Report Posted January 10, 2013 Written by Rajababu On 1/10/2013 2:39:00 AM [img]http://www.sakshi.com/newsimages/contentimages/10012013/akbar10-1-13-37828.jpg[/img]అక్బరుద్దీన్‌పై గత నెల 8న ఆదిలాబాద్ పోలీసులు, 22న నిర్మల్ పోలీసులు కేసులు నమోదు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని.. ఒకే నేరానికి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట విరుద్ధమని...రోజుకో కేసు నమోదు చేస్తున్నారని, వాటి వివరాలు తెలుసుకోవడం పిటిషనర్‌కు అసాధ్యమని అక్బరుద్దీన్ తరపున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి తెలిపారు. వీటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేయాలని సీతారామ్మూర్తి కోరడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అంటే ఫిర్యాదులు చేయకుండా ప్రజలను ఆపాలంటారా? ఆ పని ఈ కోర్టు ఎలా చేయగలదు? రాష్ట్రంలో ఫిర్యాదుల మాట పక్కన పెట్టండి. వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే ఫిర్యాదుల మాటేమిటి? వాటిని ఎలా అపగలం? ’’ అని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘‘పిటిషనర్ (అక్బరుద్దీన్) మాట్లాడిన వీడియోలను నేను యూట్యూబ్‌లో చూశా. దారుణమైన వ్యాఖ్యలు ఉన్నాయి. రాముడి తల్లి ఎక్కడెక్కడ తిరిగి రాముడికి జన్మనిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక మంది ఆరాధించే భగవంతుడి విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అలాంటి మాటలు ఎలా అనగలిగారు? అరే హిందుస్థానీ అంటూ కూడా సంబోధించారు. మరి ఆయన ఉండేది ఎక్కడ? హిందుస్థాన్‌లో కాదా? 15 నిమిషాలపాటు పోలీసులను పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువుల అంతుచూస్తాడట..! నాకున్న పరిధి మేరకు పోలీసులను 15 నిమిషాలు కాదు అరగంటసేపు ఆపుతా. ఏం జరుగుతుందో చూస్తాం. అందరినీ చంపేస్తారా’’ అని ప్రశ్నించారు. ఆయనపై హత్యాయత్నం జరిగినప్పుడు కాపాడింది పోలీసులేనన్న సంగతిని మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం ద్వారా అక్బరుద్దీన్ ఈ దేశానికే సవాలు విసిరాడు. ఆ సవాలుపైనే నిలబడమని చెప్పండి. దాని నుంచి వెనక్కి ఎందుకు తగ్గుతున్నట్లు? అక్బర్ ప్రశాంతంగా కూర్చొని ఆయన మాట్లాడిన వీడియోను చూడమని చెప్పండి. ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకుంటారు. ఈ దేశం నుంచి పోయేటప్పుడు చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌మినార్ తీసుకుపోతాడట. భారతదేశమంటే ఈ మూడేనా? ఈ మూడు లేకుంటే దేశం లేదా? ఈ దేశం ఆయన తండ్రిని ఎంపీని చేసింది. ఆయన సోదరుడినీ ఎంపీని చేసింది. ఆయన్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. మరి ఈ దేశానికి వారు ఇచ్చేది ఇదేనా? ప్రతి స్పందనకు ప్రతిస్పందన ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయాల్లో రాణించాల్సి ఉంది. అటువంటి వ్యక్తి అనాల్సిన మాటలు కావివి. అక్బర్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కులమతాలకు అతీతంగా ప్రార్థించారు. ఆయన మాత్రం ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ముస్లింలదరూ ఆయన చెప్పిన దారిలో నడుస్తారని ఆయన భావిస్తున్నారా’’ అని ప్రశ్నించారు. ఇకపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.